UA-35385725-1 UA-35385725-1

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై విజ‌య‌వాడ‌లో త్వ‌ర‌లో భారీ ర్యాలీ, స‌ద‌స్సు

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై విజ‌య‌వాడ‌లో త్వ‌ర‌లో భారీ ర్యాలీ, స‌ద‌స్సు

అనంతపురం: అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి విజయవాడలో పెద్ద ఎత్తున జర్నలిస్టుల ర్యాలీ, సదస్సు నిర్వహించనున్నామని ఏపీయూడబ్ల్యూజే( ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తెలిపారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన అనంతపురం జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశామని అప్పట్లోనే సమస్యల పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా తో మృతి చెందిన జర్నలిస్టులకు రూ. ఐదు లక్షలు పరిహారం ఇస్తామని జీవో ఇచ్చినప్పటికీ అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలలో కారోనా తో మృతి చెందిన జర్నలిస్టులకు లక్షల రూపాయలు సాయం చేశాయని…తెలంగాణ లో కారోనా సోకిన వారికి డబ్బు లు సాయం చేసారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 130 మందికి పైగా జర్నలిస్టులు మృతి చెందారని తెలిపారు. తొలివిడత కారోనా లో 45 మంది చనిపోతే… 25 మంది అర్హులు అన్నారు.. ఇప్పటి వరకు ఒక్కరికీ సాయం చేసిన పాపాన పోలేదని చెప్పారు. అక్రిడేషన్ ఇవ్వటానికి చాలా ఇబ్బందులు పెట్టారని చిన్న పత్రికలకు జి.ఎస్.టి వంటి నిబంధనలు పెట్టి అన్యాయం చేశారని మండిపడ్డారు. గతంలో పోరాడి సాధించుకున్న ప్రమాద బీమా పథకాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన మూడు సంవత్సరాల్లో అనేక దఫాలుగా ప్రభుత్వంలోని వివిధ స్థాయిలో అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. అక్రెడిటేషన్ కమిటీలలో జర్నలిస్టులకు స్థానం లేకుండా చేశారని…. ఎప్పటికప్పుడు జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం తో పోరాటాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు. అన్ని జిల్లాలలో కార్యవర్గ సమావేశాలు నిర్వహించి జర్నలిస్టుల లో చైతన్యం తీసుకు వచ్చిన అనంతరం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మి కాంత్ రెడ్డి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఐజేయూ సభ్యులు ప్రభాకర్ నాయుడు, ఏపీయూడబ్ల్యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ పయ్యావుల ప్రవీణ్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డానియల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story: జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై విజ‌య‌వాడ‌లో త్వ‌ర‌లో భారీ ర్యాలీ, స‌ద‌స్సు)

See Also: 

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1