UA-35385725-1 UA-35385725-1

ఇక రాజీనామాలే : దుర్ముహూర్తం 3 pm

ఇక రాజీనామాలే : దుర్ముహూర్తం 3 pm

అమ‌రావ‌తి : వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంత్రివ‌ర్గానికి గంట‌లు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. కొత్త మంత్రివ‌ర్గానికి మార్గం సుగ‌మం చేయాలంటే ఇప్పుడున్న మంత్రివ‌ర్గం రాజీనామా చేయాల్సిందే. సీఎం ఆదేశాల మేర‌కు గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌స్తుత మంత్రివ‌ర్గం రాజీనామా స‌మ‌ర్పిస్తుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ క్యాబినెట్ స‌మావేశ‌మ‌వుతుంది. ఈ స‌మావేశం సీఎంకు సుముహూర్త‌మైతే…మంత్రుల‌కు మాత్రం దుర్ముహూర్తంగా భావిస్తున్నారు. వారికి ఇదే ఆఖ‌రి మంత్రివ‌ర్గ స‌మావేశం. ఈ స‌మావేశంలో కొన్ని విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఖ‌రారు చేసిన త‌ర్వాత మంత్రులంతా రాజీనామా చేయ‌నున్నారు. మూకుమ్మ‌డి రాజీనామా ప‌ర్వం ముగిసిన త‌ర్వాత సీఎం ఒక్క‌రే నాలుగు రోజుల‌పాటు రాష్ట్రాన్ని పాలించ‌నున్నారు. ఒక‌ప్పుడు ఎన్‌.టి.రామారావు పాలించిన‌ట్ల‌న్న‌మాట‌! ఇప్పుడున్న మంత్రుల్లో ఒక‌రిద్ద‌రు కొన‌సాగుతార‌ని ఊహాగానాలు ఉన్న‌ప్ప‌టికీ, వారు కూడా ప్ర‌స్తుతానికి రాజీనామా చేయాల్సిందే. అవ‌స‌ర‌మైతే, వారిని 11వ తేదీన కొత్త‌గా మ‌ళ్లీ ప్ర‌మాణం చేయిస్తార‌ని భావిస్తున్నారు. రాజీనామా చేయాల్సిరావ‌డం నిజంగానే బాధాక‌రంగా వుంద‌ని ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అది ఒక మంత్రి అభిప్రాయం కాదు. దాదాపు అంద‌రి మంత్రుల అభిప్రాయం కూడా అదే. కాక‌పోతే అధికారాల్లేని ఈ ప‌దవులు ఎందుక‌నే అభిప్రాయం కూడా వుంది. ప్ర‌స్తుత మంత్రులంతా డ‌మ్మీలుగానే వుండిపోయారు. టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తే, కౌంట‌ర్లు ఇవ్వ‌డానికి త‌ప్ప వారికి పెద్ద‌గా ప‌నేమీ లేదు. అంతా అధికారుల పెత్త‌నంపైనే స‌ర్కారీ య‌వ్వారాల‌న్నీ న‌డుస్తున్నాయి. సీఎం డైరెక్ట్‌గా అన్ని శాఖ‌ల‌నూ డీల్ చేయ‌డం, ఆయ‌న ఆదేశాల మేర‌కు అంతా జ‌రుగుతూ వుండ‌టం వ‌ల్ల మంత్రుల‌కు పెద్ద ప‌నేమీ లేదు. అయిన‌ప్ప‌టికీ, హోదా కోసం మాత్ర‌మే వీరంతా ప్రాకులాడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ, ఆరంభంలోనే సీఎం ప్ర‌క‌టించిన‌ట్లుగానే రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గం మార్పు అనివార్యం కాబోతున్న‌ది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క్యాబినెట్ భేటీ ప్రారంభ‌మ‌య్యాక‌, కొన్ని అంశాలు చ‌ర్చించుకుంటారు. ఆ త‌ర్వాత ఎజెండాలో ముగింపు అంశం మంత్రుల రాజీనామాలే వుంటాయ‌ని అంటున్నారు. (Story: ఇక రాజీనామాలే : దుర్ముహూర్తం 3 pm)

See Also: పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

మంత్రుల్లో ఆ న‌లుగురూ సేఫ్‌!

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1