UA-35385725-1 UA-35385725-1

జులై 15 నుండి ఓటీటీలో ‘సమ్మతమే’

జులై 15 నుండి ఓటీటీలో ‘సమ్మతమే’

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ సమ్మతమే ‘ సినిమాను జులై 15 నుండి ప్రసారం చేయనున్న ఆహా

Sammathame: ఆహా, 100 % లోకల్ ఓటిటి ప్లాట్ఫామ్ ప్రతివారం ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. అందరి మనసులో అపురూపంగా నిలిచిపోయింది. మరోసారి అందరిని తన మత్తులో ముంచెత్తడానికి సమ్మతమే సినిమాతో వచ్చేస్తుంది. ఈ జులై 15 శుక్రవారం రాత్రి 12 గంటలకు ఆహ లో సమ్మతమే సినిమా విడుదల కానుంది.

కథ విషయానికి వస్తే, కృష్ణ (కిరణ్ అబ్బవరం) తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోతాడు. అప్పటి నుండి,  పెళ్లి చేసుకోవాలన్నదే కృష్ణ లక్ష్యంగా మారుతుంది. ప్రేమకు దూరంగా ఉంటూ.. పెళ్లి తరువాతే ప్రేమ అనేలా పెరుగుతాడు. అలాంటి కృష్ణ‌కు శాన్వి (చాందినీ చౌదరి) పరిచయం అవుతుంది. అసలు తాను కోరుకున్న లక్షణాలు ఒక్కటీ కూడా లేని శాన్వితో ప్రయాణం ఎలా సాగుతుంది? పెళ్లికి ముందు ప్రేమించను అని చెప్పే కృష్ణ చివరకు ప్రేమలో పడటం? చివరకు అది ఎలాంటి మలుపు తిరుగుతుంది? శాన్వి, కృష్ణల ప్రయాణం ఎలా ముగుస్తుంది? అనేదే కథ.

పెళ్లి చేసుకునే ప్రతి యువకుడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి..అలా ఉండాలని అనుకుంటారు. కన్నవాళ్లని వదులుకొని వచ్చిన భార్యకు ఆంక్షలు విధిస్తారు. అది తన భార్యపై తనకున్న ప్రేమ అని భావిస్తారు. కానీ ఆ ఆంక్షల వల్ల అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది? పాతికేళ్లు తనకు నచ్చినట్లుగా బతికే అమ్మాయి.. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్లుగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం?  తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా? ఇదే విషయాన్ని ‘సమ్మతమే’చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు మరియు ఈ సినిమా రచయిత గోపినాథ్ రెడ్డి.

మరి ఇలాంటి కథ ఎలా ముగుస్తుందో తెలియాంటే జులై 15 రాత్రి 12 గంటలకు సమ్మతమే సినిమాని చూడాల్సిందే. (Story: జులై 15 నుండి ఓటీటీలో ‘సమ్మతమే’)

See Also: 

త్రివిక్ర‌మ్ మూవీలో మ‌హేష్ కొత్త స్టైల్‌!

‘రారా రెడ్డి’ సాంగ్‌లో దుమ్మురేపిన అంజలి

మహేష్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ

‘మేజర్’ ఓహ్ ఇషా… వీడియో సాంగ్ విడుదల

ఆ నలుగురికీ రాజ్యసభ సీట్లు

మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!

లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!

దుమ్మురేపిన వ‌ర‌ల‌క్ష్మి! వీడియో

అలెర్ట్‌: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్‌!)

నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన

పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

మసీదులో శివలింగం

అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

ఆ నటిని భర్తే చంపేశాడు?

Mahesh-Trivikram’s movie to go on floors

Rashmika in hijab-clad

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Chaging Movie Trailer

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1