UA-35385725-1 UA-35385725-1

ఏపీలో మ‌రో కొత్త జిల్లా!

ఏపీలో మ‌రో కొత్త జిల్లా!

అమ‌రావ‌తి :  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త శ‌కం ఆరంభ‌మైంది. 13 జిల్లాలు ఉన్న ఏపీ ఇప్పుడు 26 జిల్లాలుగా రూపాంత‌రం చెందింది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను అర్థ‌రాత్రి విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత 4వ తేదీ నుంచి జిల్లాల్లో కార్యాల‌యాలు ప్రారంభం కావ‌డం, పాల‌న కూడా మొద‌లుకావ‌డం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిపోయింది. అంతా అయిపోయింద‌నుకున్నారు. కానీ అస‌లు క‌థ ఇంకా వుంది. తెలంగాణ‌లో జ‌రిగిన‌ట్లుగానే ఆంధ్రాలో కూడా కొత్త జిల్లాల చేర్పింపు జ‌ర‌గ‌బోతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాల‌పై చాలా సూచ‌న‌లు, స‌ల‌హాలు, అభ్యంత‌రాలు వ‌చ్చాయి. వాటిలో కొన్నింటిని మాత్ర‌మే సీఎం జ‌గ‌న్ ప‌రిశీలించారు. వాటిని మార్చారు. మిగ‌తా అభ్యంత‌రాల్లో ఎక్కువ‌గా రాజ‌కీయ కార‌ణాలే వుండ‌టంతో వాట‌న్నింటినీ బుట్ట‌దాఖ‌లు చేశారు. అయితే అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల‌కు సంబంధించి మాత్రం నిజంగానే అక్క‌డి జ‌నానికి అన్యాయం జ‌రిగింది. ఎందుకంటే ఈ జిల్లా విస్తీర్ణం చాలా ఎక్కువ‌. విస్తీర్ణం క‌న్నా దీని పొడ‌వు ఎక్కువ‌. దీని వ‌ల్ల అల్లూరి సీతారామ‌రాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు అదే జిల్లాలోని చింతూరువాళ్లు వెళ్లాలంటే బ‌స్సులో 8 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. అంటే శ్రీ‌కాకుళం నుంచి విజ‌య‌వాడ‌కు వ‌చ్చినంత దూర‌మ‌న్న‌మాట‌! ఇది నిజంగానే అన్యాయం. చింతూరు వాళ్లు పాడేరు క‌లెక్ట‌రేట్‌కు చేరుకోవాలంటే నానా అవ‌స్థ‌లు ప‌డాల్సిందే. అందుకే జిల్లాల నోటిఫికేష‌న్ త‌ర్వాత ప్ర‌భుత్వం కొత్త‌గా ఒక ఆలోచ‌న చేయ‌డం మొద‌లు పెట్టింది. ఈ అల్లూరి సీతారామ‌రాజు జిల్లాను రెండుగా విభ‌జించ‌డ‌మే ఉప‌యుక్తంగా వుంటుందేమోన‌న్న ఆలోచ‌న అధికార‌వ‌ర్గాల్లో మెదిలింది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో రెండు డివిజ‌న్లు వున్నాయి. అవి పాడేరు (అరుకు), రంప‌చోడ‌వ‌రం. ఇందులో రంప‌చోడ‌వ‌రం పూర్వ తూర్పు గోదావ‌రి జిల్లాలో వుండేది. ఈ డివిజ‌న్‌లో 11 మండ‌లాలు వున్నాయి. ఈ మండ‌లాల్లో రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణ నుంచి వ‌చ్చిన పోల‌వ‌రం ముంపు మండ‌లాలు కూడా వున్నాయి. పాల‌న స్థానికంగా బ‌లోపేతం చేయాల‌ని, వికేంద్రీక‌ర‌ణ చేయాల‌ని క‌ల‌లు కంటున్న వైఎస్ జ‌గ‌న్ ఈ అల్లూరి సీతారామ‌రాజు జిల్లాను అలాగే వుంచితే ఆయ‌న క‌ల క‌చ్చితంగా ప‌రిపూర్ణం కాదు. అందుకే ఈ జిల్లాను రెండుగా విభ‌జించ‌డ‌మే ఉత్త‌మం. రంప‌చోడ‌వ‌రం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని జ‌నంతోపాటు అధికారులు కూడా భావిస్తున్నారు. పాడేరు చేరుకున్న కొత్త క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, ఇత‌ర అధికారులు కూడా తొలిరోజే ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం అధికారిక స‌మీక్ష‌లో బ‌య‌ట‌ప‌డింది. అందువ‌ల్ల ప్ర‌భుత్వం అల్లూరి సీతారామ‌రాజు జిల్లా నుంచి రంప‌చోడ‌వ‌రం ప్రాంతాన్ని విడ‌దీసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో ఇంకో కొత్త నోటీసు విడుద‌ల కావ‌చ్చు. కాక‌పోతే కొత్త జిల్లాకు అల్లూరి సీతారామ‌రాజు జిల్లా పేరును ఉంచుతారా? లేక పాడేరు ప్రాంతానికే ఆ పేరు ఉంచేసి, ఈ రంప‌చోడ‌వ‌రం, చింతూరు ప్రాంతాల‌కు కొత్త పేరు పెడ‌తారా? అన్న‌ది ఇంకా తేలాల్సి వుంది. ఏదేమైన‌ప్ప‌టికీ, చిన్న జిల్లాలుగా మారిపోయినా, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాను రెండుగా విభ‌జించ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయం. ప్ర‌భుత్వం కూడా ఆ దిశ‌గానే చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని భావిస్తున్నారు. రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్‌లోని 11 మండ‌లాల‌తో ఒక కొత్త జిల్లా ఏర్ప‌డితే అది 27వ జిల్లాగా అవ‌త‌రిస్తుంది. దాంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 27కి చేరుతుంది. (Story: ఏపీలో మ‌రో కొత్త జిల్లా!)

See Also: రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

మంత్రుల్లో ఆ న‌లుగురూ సేఫ్‌!

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1