UA-35385725-1 UA-35385725-1

IPL: గెలుపు ఆర్సీబీకి…ప్రశంసలు శ్రేయాస్‌కు!

IPL: గెలుపు ఆర్సీబీకి…ప్రశంసలు శ్రేయాస్‌కు!

IPL నవీ ముంబయి: ఐపీఎల్‌ (IPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు (ఆర్‌సీబీ) తొలి విజయం నమోదు చేసింది. బుధవారంనాడిక్కడ ఆసక్తిదాయకంగా సాగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)పై విజయం సాధించింది. ఆర్‌సీబీ ఎంతో చెమటోడ్చి నెగ్గాల్సివచ్చింది. మ్యాచ్‌ ఓడినా కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ప్రశంసలు అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలకు గాను 18.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలగా, ఆర్‌సీబీ ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే 7 వికెట్లకు 132 పరుగులు చేసి విజయం సాధించింది. వనీందు హసరంగ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.
స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు కూడా ఆరంభమే ఎదురుదెబ్బలు తిన్నది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (5), అనూజ్‌ రావత్‌ (0), విరాట్‌ కోహ్లీ (12)లు పెద్దగా పరుగులు చేయకుండానే నిష్క్రమించాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్‌ విల్లే (18), రూథర్‌ఫర్డ్‌ (28), షాబాజ్‌ అహ్మద్‌ (27)లు మాదిరిగా రాణించారు. చివర్లో దినేష్‌ కార్తిక్‌ 7 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 14, హర్షల్‌ పటేల్‌ 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అజేయంగా నిలిచి కీలకమైన పరుగులతో జట్టును గెలిపించారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ 3, ఉమేష్‌ యాదవ్‌ 2 వికెట్లు తీసుకోగా, నరైన్‌, వరుణ్‌ చక్రవర్తిలు చెరొక వికెట్టు సాధించారు.
అంతకుముందు, ఆర్‌సీబీ (Royal Challengers Bangalore) టాస్‌ గెలిచి ముందుగా కోల్‌కతా (Kolkata Knight Riders)ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే కేకేఆర్‌ జట్టులో ఆండ్రీ రస్సెల్‌ (25), ఉమేష్‌ యాదవ్‌ (18), శామ్‌ బిల్లింగ్స్‌ (14), శ్రేయాస్‌ అయ్యర్‌ (13)లే పెద్ద స్కోర్లు చేశారు. వనీందు హసరంగ అద్భుతమైన బౌలింగ్‌ చేసి కోల్‌కతా బ్యాటింగ్‌ నడ్డి విరిచాడు. అతను 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అందులో శ్రేయాస్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌, షెల్డన్‌ జాక్సన్‌, టిమ్‌ సౌథీల వికెట్లు వున్నాయి. ఆకాష్‌ దీప్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. వంద పరుగులు దాటకముందే 8 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 128 పరుగులు చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. స్కోరు తక్కువే అయినప్పటికీ, బెంగుళూరు దీన్ని ఛేదించడం కష్టసాధ్యమైపోయింది. ముఖ్యంగా శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ వ్యూహాలు ఆర్‌సీబీని తికమక చేశాయి. (Story: IPL: గెలుపు ఆర్సీబీకి…ప్రశంసలు శ్రేయాస్‌కు!)

See Also: ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1