విద్యుత్ ఛార్జీల మోత!
అమరావతి: ఇప్పటికే ధరలతో జీవితం భారమైపోతుంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు మోత మోగించాయి. ఆరు శ్లాబ్‌ల్లో కరెంట్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రకటనను తిరుపతిలో విడుదల చేశారు. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16, 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంచుతున్నట్లు ఈఆర్‌సీ ప్రకటించింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆగస్ట్ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ బుధవారం సాయంత్రం విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ప్రజలు నిరసన తెలియజేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి.(Story: విద్యుత్ ఛార్జీల మోత!)
See Also: ఎంత దారుణం : శవంతో సెక్స్!
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)