UA-35385725-1 UA-35385725-1

రోహిత్‌శర్మపై వేటు?

రోహిత్‌శర్మపై వేటు?

Mumbai Indians IPL: ముంబయి ఇండియన్స్‌ (ఎంఐ) జట్టు ఈసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వరుస పరాజయాలు మూటగట్టుకున్నది. తొలి ఐదు మ్యాచ్‌లలో ఘోరంగా ఓడిపోయిన ముంబయి ఆరో మ్యాచ్‌ నుంచి లైన్లోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చతికిలపడిపోయింది. ఇప్పటివరకు తొలి ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయం చవిచూసిన ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా అవతరించింది. గతంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కూడా ఇదేవిధంగా తొలి ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఇప్పుడా రికార్డును ముంబయి సమం చేసింది. అసలు ముంబయికి ఏమైందో ఏమో తెలియడం లేదని క్రికెట్‌ నిపుణులు, ఎంఐ మెంటార్స్‌ తలలు బాదుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ అత్యధిక డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన ఇషాన్‌ కిషన్‌ ఒక్కడే కాస్త రాణిస్తున్నాడు. మిగతా ఆటగాళ్లంతా నిలకడతనం కోల్పోయి ఆడుతున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక అభిమానులు కలిగిన జట్టు ముంబయి ఇండియన్సే. అభిమానుల మద్దతు అధికంగా వుండటం వల్లనేమో ఆ జట్టు అత్యధిక ట్రోఫీలు గెల్చుకున్న జట్టుగా రికార్డు కలిగివుంది. ఐపీఎల్‌ 2022లో పది జట్టు ఆడుతున్నాయి. అందులో గుజరాత్‌ టైటాన్స్‌ ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లతో మంచి స్ట్రయిక్‌ రేటుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ జట్టు ఈ సీజన్‌ నుంచే ఐపీఎల్‌లో అడుగు పెట్టడం విశేషం. మరో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా 8 పాయింట్లతో రెండస్థానంలో కొనసాగుతున్నది. విచిత్రమేమిటంటే, రెండు కొత్త జట్లూ టాప్‌2లో నిలవడం గొప్పతనం. ఇక ఆర్‌సీబీ, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు 3, 4 స్థానాల్లో వున్నాయి. పంజాబ్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, దిల్లీ, చెన్నై జట్లు వరుసగా తదుపరి స్థానాలు పొందాయి. నిజానికి ఎక్కువ కప్‌లు గెల్చుకున్న ముంబయి ఆఖరి స్థానంలో వుండగా, చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచి ముంబయి కన్నా ఒక స్థానం ముందుంది. నెంబర్‌ 1, 2 జట్లు ఆఖరి 9, 10 స్థానాల్లో వుండటం విచిత్రం.
ముంబయి ఇండియన్స్‌ ఇప్పటివరకు ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి ఒక్క దాంట్లోనూ గెలవలేదు. పైగా దాని నెట్‌ రన్‌రేటు `1.048గా వుంది. అంటే వారి ఆటతీరు ఎంత దారుణంగా వుందో చూడండి. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ ఓడిపోయింది. ఇక రాజస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఐదవ మ్యాచ్‌లో కేవలం 12 పరుగుల దూరంలో చతికిలపడిరది. తాజాగా జరిగిన ఆరవ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ చేతిలో 18 పరుగుల తేడాతో చిత్తయింది.
ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌ జట్టును ప్రక్షాళన చేయడం అవసరమని ఫ్రాంఛైజీ యాజమాన్యం భావిస్తున్నది. అన్నింటికన్నా ముందుగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఉద్వాసన చెప్పాల్సిన అవసరం వుందని కొంతమంది సలహా ఇస్తున్నారు. అయితే జట్టు వైఫల్యాన్ని కెప్టెన్‌పై రుద్దడం సరికాదని సచిన్‌ టెండూల్కర్‌ వంటి వాళ్లు భావిస్తున్నప్పటికీ, రోహిత్‌ స్థానంలో ఎవరినైనా కెప్టెన్‌గా మారిస్తే కనీసం ఏడవ మ్యాచ్‌ నుంచైనా మంచి ఫలితాలు వుంటాయోమోనని యాజమాన్యం ఆశిస్తున్నది. నిజానికి వరుస పరాజయాలు ముంబయికి కొత్తకాదు. గతంలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన ఘనత ఎంఐకి వుంది. ఆ తర్వాత పుంజుకొని కప్‌లు గెల్చుకున్న సందర్భాలూ వున్నాయి. ఇప్పుడున్న జట్టులో రోహిత్‌ శర్మ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ 41, 10, 3, 26, 28, 6 పరుగులు చేశాడు. అంటే మూడు మ్యాచ్‌ల్లో పరవాలేదనిపించిన సారథి, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఇదే కొనసాగితే, రోహిత్‌శర్మపై వేటు తప్పదు. రోహిత్‌ శర్మను కాదని ఇంకొకరికి కెప్టెన్సీ ఇవ్వాలంటే, జస్‌ప్రీత్‌ బుమ్రా, కీరన్‌ పోలార్డ్‌లు తప్ప సీనియర్లు ఇంకెవ్వరూ లేరు. ఇస్తేగిస్తే వీళ్లిద్దరిలో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పగించాలి. అయితే రోహిత్‌శర్మకు మించిన వ్యూహాలు వీళ్లిద్దరూ చేస్తారని ఆశించడం కరెక్ట్‌కాదు. ఏదేమైనప్పటికీ, ఈ జట్టు మెంటార్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయాన్ని కాదని ఫ్రాంఛైజీ ఓనర్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. కాకపోతే కెప్టెన్సీ మార్చడంపై ఆచితూచి వ్యవహరించాలని యాజమాన్యం భావిస్తోంది. (Story: రోహిత్‌శర్మపై వేటు?)

See Also: 

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1