సత్య కళాశాల విద్యార్థి కి కిక్ బాక్సింగ్ రజితం
న్యూస్ తెలుగు/విజయనగరం: స్థానిక తోటపాలెంలో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బి ఎస్ సి తృతీయ సంవత్సరం విద్యార్థి కె. కృష్ణ భగవాన్ ఇటీవల పార్వతీపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన ఎంఎల్ఏ కప్ మొదటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అమెచ్యూర్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో రజిత పతకం సాధించాడు. ఈ టోర్నమెంట్ ను పార్వతీపురం అమెచ్యూర్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల లో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు కృష్ణ భగవాన్ ను అభినందిస్తూ ఈ గేమ్ లో ఇంకా ఉన్నత స్థాయి కి ఎదగాలని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి యూనివర్సిటీ గేమ్స్ లోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయి లో మంచి పతకాలు సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఫిజికల్ డైరెక్టర్ పి. మహేశ్వర రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story: సత్య కళాశాల విద్యార్థి కి కిక్ బాక్సింగ్ రజితం)