గాలివాన: ప్రాణాలు తీసిన పిడుగులు!
న్యూస్ తెలుగు/అమరావతి: భారీ వర్షాలతో ఆంధ్రాలో పిడుగులకు, చెట్లు కూలి వేర్వేరు జిల్లాలకు చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు బాలురు ఉన్నారు. ఊహించని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రజిల్లాల్లో వీచిన ఈదురు గాలులతో చెట్లు ధ్వంసమమై పాక్షికంగా నష్టం, ప్రాణనష్టం వాటిల్లింది. బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు చినగంజాల మండలం రామకోటేశ్వరి కాలనీకి చెందిన బ్రహ్మయ్య (50), మాతంగి సుప్రదీప్ (21) మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముసునూరులో భారీ వృక్షం కూలిన సంఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న బాలుడు దుర్మరణం చెందారు. ఇదే జిల్లాలోని మండవల్లి మండలం దెయ్యంపాడులో పిడుగుపాటుకు సైదు గిరిబాబు (33) మృత్యవాతకు గురయ్యారు. ఇక..ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనాల భాస్కర్ (50)తోపాటు కార్తీక్ అనే బాలుడు పిడుగుపాటుకు మృతి చెందారు. రానున్న రెండు రోజుల్లో వాతావరణం భిన్నంగా ఉంటుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, ఇంకొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర ప్రజలు నిలబడవద్దని అధికారులు చెప్పారు. భారీ వర్షాల ప్రభావంతో ఒకే రోజు పిడుగుపాటుకు ఐదుగురు, వృక్షం కూలి మరొకరు మొత్తంగా ఆరుగురు చనిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. (Story: గాలివాన: ప్రాణాలు తీసిన పిడుగులు!)
Follow the Stories:
యూనియన్ బ్యాంకులో ఉద్యోగాల జాతర
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
