Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కమలారామ్ కు ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం జాతీయ అవార్డు 

కమలారామ్ కు ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం జాతీయ అవార్డు 

0

కమలారామ్ కు ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం జాతీయ అవార్డు 

న్యూస్ తెలుగు/వినుకొండ  : రచయిత, కవిరత్న, కళారత్న అవార్డ్ గ్రహీత,జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షులు, కమలారామ్ కి ప్రతిష్టాత్మకమైన ‘విశ్వజనని ఉగాది పురస్కారం అవార్డు” ను అందజేసినట్లు విశ్వజనని జాతీయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొగ్గారపు బ్రహ్మానందం తెలిపారు.విశ్వజనని ఫౌండేషన్ జాతీయ సంస్థ ఆధ్వర్యంలో “విజయవాడ కృష్ణతేజ ఎసి ఫంక్షన్ హాల్” లో జరిగిన ఉగాది మహోత్సవాలలో ఈ అవార్డును ప్రముఖుల చేతుల మీదుగా అనేక సంవత్సరాలుగా సాహితీసేవలందిస్తున్నందుకు కమలారామ్ కు అందజేశామని వ్యవస్థాపకులు తెలిపారు. విశ్వజనని ఉగాది పురస్కారం అవార్డును అంద చేసినందుకు ఫౌండేషన్ సంస్థ వారికి కమలారామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉగాది పురస్కారాన్ని స్వీకరించిన కమలారామ్ ను పలువురు కవులు, కళాకారులు మిత్రులు, జాషువా సమాఖ్య సభ్యులు,జన విజ్ఞాన వేదిక నాయకులు అభినందనలు తెలిపారు.(Story : కమలారామ్ కు ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం జాతీయ అవార్డు  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version