Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాల జాతర

యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాల జాతర

0

యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాల జాతర

న్యూస్ తెలుగు/అమరావతి: నిరుద్యోగులకు యూనియన్‌ బ్యాంకు తీపి కబురు అందించింది. ఈ బ్యాంకులో ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా యూనియన్‌ బ్యాంక్‌ పనిచేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి ఏప్రిల్‌ 1, 2025వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 20, 2025వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఇస్తారు. ఈ ప్రకటన కింద మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు 250, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఐటీ) 250 వరకు ఉన్నాయి. మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకుగాను 225 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌ 1లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 25 మార్కులకు 25 ప్రశ్నలు, ఇంగ్లీషు ల్యాంగ్వేజ్‌కు 25 మార్కులకు 25 ప్రశ్నలు.. వెరసి 75 మార్కులకు ఉంటుంది. పార్ట్‌ 2లో 150 మార్కులకు సంబంధిత పోస్టుకు చెందిన ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌లో పరీక్ష ఉంటుంది. మొత్తం 150 నిముషాల పాటు పరీక్ష ఉంటుంది. గ్రూప్‌ డిస్కషన్‌కు 50 మార్కులకు ఉండగా..కనీసం 25 మార్కులు తెచ్చుకోవాలి. పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో బీటెక్‌ లేదా బీఈ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌, ఎంబీఏ లేదా పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది పాటు పని అనుభవం ఉండాలి. (Story: యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాల జాతర)

Follow the Stories:

కుర్రాళ్ల‌ను కెలికేసి.. ఉచ్చులోకి లాగేసి!

మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version