డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ
మంత్రి రవి, ఎంపీ లావు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : నరసరావుపేట పట్టణంలోని లింగంగుంట్ల రోడ్డులో గల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి సభాపతి, స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివరాం పాల్గొని స్వర్గీయ కోడెల శివప్రసాద్ కి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. డాక్టర్ కోడెల శివప్రసాద్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఒక గొప్ప నాయకుడని, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అరవింద్ బాబు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు. (Story:డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ )
