Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

0

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

విజయసాయిరెడ్డి వ్యాఖ్యల దుమారం
అప్రూవుల్‌గా మారితే డేంజరే
మద్యం కుంభకోణంలో కసిరెడ్డే!
వైఎస్‌ఆర్‌సీపీలో కాకరేపుతున్న కేసులు
పార్టీ ఆవిర్భావం రోజున చిచ్చురేపిన సాయిరెడ్డి

న్యూస్‌ తెలుగు/అమరావతి: వైసీపీలో నంబర్‌2గా చెలాయించిన నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ పెద్ద కోటరీ ఉందని, దాని వల్లే జగన్‌కు నష్టం వాటిల్లిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఆ కోటరీ వల్ల జగన్‌కు, తనకు మధ్య గ్యాప్‌ పెంచారని, ఒక నాయకుడు చెప్పుడు మాటలు వినకూడదని, మంచి, చెడు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్టు అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి విజయవాడ సీఐడీ కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్‌పైన, ఆయన చుట్టూ ఉన్న కోటరీపైన, వైఎస్‌ఆర్‌సీపీపైన సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది. మళ్లీ వైసీపీతో దోస్తీ చేసేది లేదు..నా మనస్సు విరిగింది..అది అతుక్కోదు..కోటరీనే జగన్‌ కొంప ముంచింది.. వాళ్ల మాట వినడం జగన్‌ తప్పే అంటూ చెప్పారు. తాను వైఎస్‌ఆర్‌సీపీలోకి తిరిగి రాబోనని తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా ఏ పార్టీలోనూ చేరబోనని పునరుద్ఘాటించారు. దీని ఆధారంగా విజయసాయిరెడ్డి అప్రూవుల్‌గా మారతారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అదే జరిగితే జగన్‌కు, ఆ పార్టీకి రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. సరిగ్గా వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం దినోత్సవంనాడు, ఒక వైపు యువత పోరు చేపడుతున్న సమయంలో సీఐడీ విచారణకు పిలవడం, విజయసాయిరెడ్డి రావడం చకచకా జరిగిపోయాయి. విచారణకు వచ్చిన సాయిరెడ్డి తన పని తాను చూసుకుని వెళ్లకుండా..మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడ‌టం వెనుక…వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని కూటమి పార్టీ వాళ్లే కావాలని విజయసాయిరెడ్డితో మాట్లాడించారంటూ మండిపడుతున్నారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో వైఎస్‌ఆర్‌సీపీకి టెన్షన్‌

కాకినాడ సీపోర్ట్‌ విషయంలో విజ‌య‌సాయిరెడ్డి వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసేలా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కాకినాడ పోర్టు ఇష్యూలో కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌ రెడ్డేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అటుపై ఆ పోర్టు అధిఏత కేవీరావుకు, జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి వైఎస్‌ఆర్‌సీపీకి దడ పుట్టించారు. విక్రాంత్‌రెడ్డి పోర్ట్‌ వాటాల డీల్‌కు సెట్‌ చేశారని ఆరోపించారు. ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ తీస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటూ వ్యాఖ్యానించారు. మీడియా ముందే విజయసాయిరెడ్డి ఈ రకంగా వ్యాఖ్యానిస్తే..ఇక సీఐడీ వారికి ఇంకేం సమాచారం చెప్పారనేదీ వైఎస్‌ఆర్‌సీపీ వారికి అంతుచిక్కడంలేదు. ప్రశాంతంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఇలా..వైఎస్‌ఆర్‌సీపీపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, అదీ కేసుల గురించి వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చానీయాంశమైంది. ఇవి కూటమి పార్టీలకు మరింత అవకాశంగా మారింది. మొత్తంగా కాకినాడ సీ పోర్టు కేసులో విజయసాయిరెడ్డి అప్రూవల్‌గా మారితే, ఆయనపై ఉన్న ఏ2 కేసు తొలగిపోతుంది. ఇక..పూర్తిగా ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఆయన ప్రశాంతంగా ఉండవచ్చు. జగన్‌ చుట్టూ ఉన్న కోటరీని.. ఆయన ద్వితీయ శ్రేణి నాయకులు అంటూ..సజ్జల గురించే పరోక్షంగా చెప్పినట్లయింది.

మద్యం కుంభకోణంలోనూ ఘాటు వ్యాఖ్యలు

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఆరోపణలపైనా విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసిందంతా అప్పటి బేవరేజెసెస్‌ మేనేజింగ్‌డైరెక్టర్‌ కసిరెడ్డి కనుసన్నల్లోనే అవినీతి దందా జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో ఆ విషయాన్ని సీఐడీ అధికారులకు విజయసాయిరెడ్డి చెప్పారా?, లేదా? అనేదీ వైఎస్‌ఆర్‌సీపీ కలవరం చెందుతోంది. పనిలో పనిగా సీఐడీ అధికారులు ఆ విషయాలను తనతో చెప్పించారంటూ వ్యాఖ్యానించారు. ఇలా కాకినాడ సీ పోర్టు అవినీతి గురించి, మద్యం కుంభ‌కోణం గురించి విజయసాయిరెడ్డి మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. చుట్టూ ఉన్న కోటరీ వల్లే తనను జగన్‌కు దూరం చేశారంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రారంభించి..ఆ తర్వాత జగన్‌తోపాటు గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయడం వెనుక ఆయన వ్యూహం ఏమిటనేదీ ఎవరికీ అంతుచిక్కడంలేదు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో జగన్‌ పూర్తిగా ఇరుక్కుపోయే ప్రమాదముంది. ఇప్పటికే సీబీఐ కేసుల్లో జగన్‌, విజయసాయిరెడ్డి 16 నెలలుపాటు జైలుకు వెళ్లి వచ్చారు. మళ్లీ కాకినాడ సీ పోర్టు, మద్యం కుంభకోణం లాంటి కేసులను కూటమి ప్రభుత్వ హయాంలో ఎదుర్కొవాల్సి వస్తోంది. అందులో ప్రధానంగా కాకినాడ సీ పోర్టులో విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో దాన్ని నుంచి తప్పించుకునేందుకుగాను విజయసాయిరెడ్డి అప్రూవుల్‌గా మారతారా?, లేక ఆయన చెప్పినట్లుగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటారా? అనేదీ చూడాల్సి ఉంది. (Story: జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?)

Follow the Stories:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రీక్ష‌!

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version