Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వామ్మో…ఇంట‌ర్‌లో ఇన్ని మార్పులా?

వామ్మో…ఇంట‌ర్‌లో ఇన్ని మార్పులా?

0

వామ్మో…ఇంట‌ర్‌లో ఇన్ని మార్పులా?

ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం!
ఇంటర్మీయట్ మ్యాథ్య్ ఎ-బి ఒకే సబ్జెక్ట్, బాటనీ-జువాలజీ ఒకే సబ్జెక్టు!
ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు
జూనియర్ కాలేజిల్లో ఎం.బైపిసి కోర్సుకు అనుమతి
మంత్రి లోకేష్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశం

ఇక‌పై ఆ స‌బ్జెక్టులే ఉండ‌వు! ఫిబ్ర‌వ‌రిలోనే ప‌రీక్ష‌లు!

న్యూస్‌తెలుగు/అమరావతి: విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్ లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజిలవైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజిల విద్యార్థులను తయారుచేసేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్ లో మార్పులు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 1వతేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయి.
జూన్ 1 వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభిస్తారు.

2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చి 2026కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు. ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. డిజిలాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్‌లైన్ యాక్సెస్ ఉండేలా 1973 నుండి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేస్తారు.

విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి, బహుళవిభాగ అభ్యాసాలను ప్రోత్సహించడానికి ఈ విద్యాసంవత్సరం నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్స్ లో ఒక సబ్జెక్టును 2వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. జూనియర్ కళాశాలల్లో ఎంబైపిసి ప్రవేశపెట్టాలనే ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఈ విద్యాసంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎం.బైపిసి కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు (సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ సహా) సవరించిన సిలబస్‌తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి. ఇంటర్మీడియట్ లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఎ, బిలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం చేశారు.

అలాగే బైపిసి విద్యార్థులకు బాటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టు ఉండేలా విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ లభిస్తుంది. ఈఏపిసెట్, జెఇఇ,
నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేస్తుంది. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారు.

కాంపిటీటివ్ బేస్డ్ ఎసెస్ మెంట్ కోసం ఇంటర్మీడిటయట్, సైన్స్, హ్యూమనిటీస్ విభాగాలప్రశ్నల్లో 10% తప్పనిసరిగా బహుళ-ఎంపిక ప్రశ్నలు (MCQలు), ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండేలా కొశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు. NSQF స్థాయి ప్రకారం సిలబస్ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యుయల్ సర్టిఫికేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు. సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం, NSQF స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్‌ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక రూపొందించారు. వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికాశుక్లా, పాఠశాల విద్య డైరక్టర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్పెషల్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాస్ రావు, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ డైరక్టర్ జి.గణేష్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఓపెన్ స్కూల్స్ సెక్రటరీ నరసింహరావు, ఆంధ్రా వర్సిటీ వైస్ చాన్స్ లర్ జివి రాజశేఖర్, పద్మావతి వర్సిటీ విసి వి.ఉమ, ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి శారద రాజ్యలక్ష్మిదేవి, ఎన్ టిఆర్ హెల్త్ యూనివర్సిటీ విసి డిఎస్ విఎల్ నరసింహం, విశాఖపట్నం విఎస్ కె డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ ఐ. విజయబాబు, మొవ్వ క్షేత్రయ్య గవర్నమెంట్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రసాద్ శాస్త్రి, కర్నూలు ఎపి రెసిడెన్షియల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జయం శ్రీనివాస గుప్త, క్రోసూరు ఎపిఎంఎస్ ప్రిన్సిపాల్ శ్రీమతి మేరీ సుశాన్, నాదండ్ల కెజిబివి ప్రిన్సిపాల్ మాధవీ లత, నారాయణ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ ఆనంద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. (Story: వామ్మో…ఇంట‌ర్‌లో ఇన్ని మార్పులా?)

Follow the Stories:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రీక్ష‌!

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version