Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పాలకుల కళ్లు మూసుకుపోయాయి!

పాలకుల కళ్లు మూసుకుపోయాయి!

0

పాలకుల కళ్లు మూసుకుపోయాయి!

రైతుల క‌ష్టాన్ని దళారీల‌కు అమ్మేస్తారా?

మిర్చి రైతుల అవస్థలు పట్టని ప్రభుత్వం
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
గుంటూరు మిర్చియార్డులో రైతులతో భేటీ

న్యూస్‌ తెలుగు/అమరావతి: మిర్చి రైతుల బాధలు, అవస్థలను చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు ఉందని, కష్టాలు కనిపిస్తున్నా ప్రభుత్వం కళ్లు మూసుకుంటోందని మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కనీస మద్దతు ధర కూడా దక్కక, తీవ్రంగా నష్టపోతూ నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులకు అండగా నిలుస్తూ, గుంటూరులోని మిర్చియార్డును జగన్‌ బుధవారం సందర్శించారు. యార్డులో మిర్చి రైతులను కలుసుకున్న ఆయన, వారి సమస్యలు, అగచాట్లు ఆరా తీశారు. ఒకవైపు రైతులు, మరోవైపు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో గుంటూరు మిర్చియార్డు క్రిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల కష్టాలను సీఎం చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని, సచివాలయానికి, సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చియార్డులో రైతులు పడుతున్న అవస్ధలు చంద్రబాబునాయుడుగారికి అర్ధం కావడం లేదని మండిపడ్డారు. ఆయనకు రైతుల కష్టాలు కనిపించినా కళ్లు మూసుకున్నారని, వారిని మరిన్ని కష్టాల పాల్జేస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరు మిర్చియార్డులో ఇప్పుడు మిర్చి పంటకు కనీసం రూ.10 వేలు, రూ.11 వేల ధర కూడా రావడం లేదని, ఆరుగాలం కష్టించి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు. ఒకవైపు తెగుళ్ల తాకిడితో మామాలుగా 20 క్వింటాళ్లకు పైగా రావాల్సిన దిగుబడి కాస్తా ఇవాళ 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయిందని, మరోవైపు గత ఏడాది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.21 వేల నుంచి రూ.27 వేలు ధర పలికిన మిర్చిని ఇవాళ కనీసం రూ.10 వేల నుంచి రూ.11 వేలకు కూడా కొనే నాధుడు లేకుండా పోయాడని తెలిపారు. రైతులకు పెట్టుబడి కింద కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అటు తెగుళ్లతో తగ్గిన దిగుబడి. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో రైతులు బ్రతుకు దుర్భరంగా మారిందని, రాష్ట్ర వ్యాప్తంగా కందులు, పెసర, మినుములు, టమోట, ప్రత్తి ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రైతులను దళారీలకు అమ్మేశార‌ని, పంటలకు మద్దతు ధర రావడం లేదన్నారు. రైతులకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నిలిచిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైందని, రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని జగన్‌ హెచ్చరించారు. రైతులు ప్రతి విషయంలోనూ నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లుతెరిచి రైతులకు పెట్టుబడి సహాయం సాయం చేయాలన్నారు. ప్రతి విషయంలోనూ రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన నేపధ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి గుంటూరు మిర్చియార్డుకు రావాలని, రైతుల కష్టాలను తెలుసుకుని వారికి కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా చంద్రబాబు నిలబడకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయని రైతుల తరపున జగన్ హెచ్చరించారు. (Story: పాలకుల కళ్లు మూసుకుపోయాయి!)

Follow the Stories:

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?

ఇంజినీరింగ్‌ కాలేజీలపై నిఘా?

మావోల కింకర్తవ్యం?

నంబరు-2 రూటెటు?

కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?

షుగ‌ర్ రాకుండా తినాల్సిన 5 ప‌దార్థాలు!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version