చైర్మన్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపిన రచయిత సురేష్ కుమార్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నూతనంగా 3 కార్పొరేషన్ చైర్మన్ లను నియమించారు. అందులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ కి ఈ అవకాశం దక్కింది..
తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ఆదివారం హైదరాబాద్ లోని రోడ్లు మరియు భవనముల శాఖ కార్యాలయంలో ని ఆ శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లాకు చెందిన యువ సాహిత్య రత్న ప్రముఖ సామాజిక రచయిత కడియాల సురేష్ కుమార్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్ వామపక్ష బావజాలాలు ఉన్న వ్యక్తి అని ప్రజా సమస్యల పై అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన వ్యక్తి అని అన్నారు.. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ తనకి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం తెలంగాణ ప్రభుత్వం కోసం తన వంతు ప్రయత్నం చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు. ప్రశాంత్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్,మరియు ఎం ఎల్ సి ,రైతుబందు సమితి రాష్ట్ర అధ్యక్షుడు,పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎంఎల్ఏ లు ఎంపిలు,జెడ్పీ చైర్మన్ లు ,టీఆరెస్ ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆరెస్ నాయకులు , చైర్మన్,గుండు సుధారాణి ములుగు జిల్ల జడ్పీటీసీ మహిళా నాయకులు సకినాల భవాని ,కుటుంబ సభ్యులు,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story: చైర్మన్ శ్రీనివాస్ కి రచయిత సురేష్ కుమార్ శుభాకాంక్షలు)
See Also: ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు