AB INBEV & WATERAID INDIA సంస్థలు సమిష్టిగా నీటి అందుబాటు మరియు భద్రతను మెరుగుపరచడానికి తెలంగాణ లో నీటి కన్సార్టియం ని లాంచ్ చేయటం జరిగింది.
- నీటి సమస్యలను పరిష్కరించడానికి, నీటి నిర్వహణ మరియు పరిరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కన్సార్టియం అనేకమంది వ్యక్తులని మరియు బహుళ సంస్థలను ఒకచోటకి చేర్చింది.
- భాగస్వామ్యం, కన్సార్టియం యొక్క చర్యలు, పాత్రలు, బాధ్యతలు, ప్రమాణాలు మరియు నీటి సంరక్షణ పట్ల నిబద్ధతకి సంబంధించి ఉమ్మడి చార్టర్‌ను ఏర్పాటు చేసింది.
AB INBEV : ప్రపంచపు అతి పెద్ద బ్రూవర్ సంస్థ ఐన, AB InBev, WaterAid India సహకారంతో, తెలంగాణ నీటి సంరక్షణ కోసం పని చేసే కన్సార్టియంను ఏర్పాటు చేసింది. ఈ కన్సార్టియం ప్రభుత్వ సంస్థలు, స్వచ్చంద సంస్థలు, పరిశోధనా సంస్థలు, నీటి రంగ నిపుణులు మరియు కార్పొరేట్‌లకు చెందిన బహుళ వాటాదారులు మరియు ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేయటం జరిగింది.
లెట్స్ ఎండార్స్, హైదరాబాద్ అర్బన్ ల్యాబ్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, TISS, JNTU, థింక్ ట్యాంక్ ఇండియా వంటి అకాడెమియా సభ్యులతో సహా స్వచ్చంద సంస్థలు ల నుండి,వాటర్ స్టీవార్డ్‌షిప్ నెట్‌వర్క్ అలాగే భూగర్భ జల ప్రభుత్వ విభాగంనుండి హాజరైన వారి సమక్షంలో కన్సార్టియం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని మెర్క్యూర్ హోటల్‌లో నిర్వహించబడింది. కన్సార్టియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వి.ప్రకాశరావు హాజరయ్యారు.
తెలంగాణలో నీటి సంరక్షణ ప్రయత్నాలను మరియుపరిష్కారాలను మెరుగుపరచడంలో వివిధ సహకారాలపై ఉమ్మడి మరియు భిన్నమైన అవగాహన ఉన్న భాగస్వాముల నుండి సమిష్టి చర్య అవసరం. రాష్ట్రంలో నీటి సంరక్షణను పెద్ద ఎత్తున చేపట్టేందుకు నీటి సంబంధిత సవాళ్లను అధిగమించేందుకు సమగ్ర టూల్‌కిట్‌ను అభివృద్ధి చేయడం పై కన్సార్టియం ప్రాథమికంగా దృష్టిపెట్టనుంది.
ఈ వాటాదారులు ఒక ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా నీటి సారథ్యం,నిర్వహణ మరియు పరిరక్షణకు సంబంధించిన ఉమ్మడి లక్ష్యం కోసం పని చేస్తారు.ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత మరియు భవిష్యత్తు కార్యక్రమాల కోసం కీలకమైన అభ్యాసాలు మరియు అనుభవాలను పంచుకుంటారు.
కన్సార్టియం నీటి సంరక్షణపై నైపుణ్యం-భాగస్వామ్యం మరియు సాంకేతిక వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది, పరిష్కారాలు, సాంకేతికతలు మరియు భాగస్వాములకు ప్రతిబింబించేలా ఆవిష్కరణలను హైలైట్ చేస్తుంది. చిన్న భాగస్వామ్యాల ద్వారా వారి నీటి కార్యక్రమాల ప్రణాళికలు వేయటం మరియు అమలు చేయడంలో ఇది ఇతర సారూప్య సంస్థలకు కూడా మద్దతు ఇస్తుంది. కీలకమైన నీటి సమస్యలపై భాగస్వాములు ఎప్పటికప్పుడు చర్చిస్తారు, పరిష్కారాలను వెతుకుతారు మరియు రాష్ట్రానికి మార్గదర్శకాలని రూపొందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర నీటిఅవసరాల కోసం ఈ వాటర్ కన్సార్టియం ప్రారంభించడంపై మాట్లాడిన అశ్విన్ కాక్, హెడ్ ప్రొక్యూర్‌మెంట్ & సస్టైనబిలిటీ-ఇండియా & సౌత్ ఈస్ట్ ఏషియా, AB InBev, “రాష్ట్రంలో నీటి లభ్యతను పరిష్కరించడంలో సహాయపడటానికి తెలంగాణలో భాగస్వామ్యాలను నిర్మించడం మాకు ఆనందంగా ఉందని, కీలకమైన సహజ వనరుల మరియు మెరుగైన భవిష్యత్తు కోసం సహజ వనరులను మెరుగుచేయటానికి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ కన్సార్టియం ద్వారా, మా కమ్యూనిటీలకు నీటి సవాళ్లను పరిష్కరించడానికి మేము పరిష్కారాలను క్యూరేట్ చేస్తాము. ఈ ప్రయత్నంలో మాకు మద్దతు ఇచ్చినందుకు WaterAid India మరియు తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.”
కన్సార్టియం కింద, పెద్ద మరియు చిన్న వ్యాపారాలు నీటి వినియోగాన్ని మెరుగుపరచడం మరియు నీటి సంరక్షణపై ప్రచారాలను రూపొందించడంపై దృష్టి పెడతాయి, అయితే పరిశోధకులు మరియు నిపుణులు నీటి పరిశోధనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంటారు. మరోవైపు, రైతులు నీటి-సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెడతారు, అయితే ప్రభుత్వ సంస్థలు భవిష్యత్తు ప్రణాళిక మరియు విజ్ఞాన భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తాయి.
రాజేష్ రంగరాజన్, రాష్ట్ర ప్రోగ్రాం డైరెక్టర్, WaterAid,”నీటి సంరక్షణకు వ్యాపారాలు, సాంకేతిక సంస్థలు, సామాజిక ప్రభావ అంకురసంస్థలు, పౌర సమాజంలో మార్పు చేసేవారు మరియు ప్రభుత్వం వంటి భాగస్వాముల నుండి సమిష్టి మరియు సహకార చర్య అవసరం. ఇది మాకు ఒక కన్సార్టియం ఏర్పడటానికి దారితీసింది, తద్వారా మేము సమిష్టిగా సమస్యలను గుర్తించవచ్చు మరియు పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చు. మేము ఇప్పుడు నీటి రంగంలో సంక్షోభాలకు ప్రతిస్పందిస్తూ దీర్ఘకాలిక మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అన్నారు.
కన్సార్టియం కీలకమైన పాత్రలు మరియు భవిష్యత్ కార్యాచరణతో కూడిన “చార్టర్”ని కూడా అభివృద్ధి చేసింది. ఇది నీటి సంరక్షణ మరియు నిర్వహణ రంగంలో కార్యక్రమాలు మరియు కార్యకలాపాలను రూపొందించడంలో మరియు అమలు చేయడంలో శ్రేష్ఠతను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. (Story: తెలంగాణలో నీటి కన్సార్టియం)
See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!