మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌టిసి ఛార్జీలు పెరిగాయి. ఊహించని విధంగా తెలంగాణ ఆర్‌టిసి ప్రయాణికులపై భారం మోపింది. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్‌టిసిని లాభాల బాట పట్టించేందుకు ఛార్జీల మోత తప్పనిసరి అని ఆర్‌టిసి అధికారులు చెపుతున్నారు. చిల్లర సమస్యలను తీర్చడానికి టికెట్టు ధరలను రౌండప్ చేయాల్సి వచ్చిందని, కొన్ని చోట్ల టికెట్ ధరలను తగ్గించి, ఇంకొన్ని చోట్ల పెంచినట్లు అధికారులు తెలిపారు. పైగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్‌టిసిని తీర్చిదిద్దుతామని చెప్పారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.5-10 వరకు అదనంగా సెస్ వసూలు చేయాలని ఆర్‌టిసి నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. మరోవైపు రెండు నెలల్లో సుమారు 4250 బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశ పెట్టాలని ఆర్‌టిసి నిర్ణయించిన నేపథ్యంలో అది అమల్లోకి రాగానే టికెట్‌పై అదనంగా మరో రూ. 1-5 వరకు ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణ బస్సులతోపాటు డీలక్స్‌కు పైబడిన బస్సుల్లోనూ ఆర్‌టిసి ఛార్జీల మోత మోగనున్నదని అర్థమైపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. (Story: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు)
See Also: చైనాలో లాక్‌డౌన్!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!