పారాసెట్‌మాల్ ధర పెరిగిందోచ్!
అజిత్రోమైసిన్ మందులు కూడా ఇక ప్రియమే
సామాన్యులు వాడే మందుల ధరల దంపుడు
న్యూఢిల్లీ: మనం పీల్చేగాలి తప్ప దాదాపు అన్నింటిపైనా ధరల దంపుడు పడిరది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో జనం అల్లాడిపోతుంటే, తాజాగా ఔషధాల ధరలు పెరగడం సామాన్యునికి షాక్ కొట్టినట్లయింది. వంటగ్యాసు, వంటనూనె ధరల వాయింపునే తట్టుకోలేకపోతుంటే తాజాగా మందుల ధరలను పెంచడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అత్యధికంగా వాడే పారాసెట్‌మాల్ ఔషధం ధర దాదాపు 11 శాతం పెరిగింది. ఇదొక్కటే కాదు… జ్వరం, ఇన్ఫెక్షన్, బీపీ వంటి వ్యాధులకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ పెరిగాయి. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మందుల ధరలు 10.8% నుంచి పెరుగుతాయని నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఒక ప్రకటనలో వెల్లడిరచింది. ఈ మందుల జాబితాలో 800 వున్నాయి. ముఖ్యంగా జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ పెరుగుతాయి. అంటే పారాసెట్‌మాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాలున్నాయి. పైగా విటమిన్స్, మినరల్స్ మందుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇందులో కొన్నింటిని కొవిడ్ బాధితులకు చికిత్సలోనూ ఉపయోగిస్తున్నారు. మహమ్మారి కారణంగా తయారీ ఖర్చులు పెరగడంతో ఈ ఔషధాల ధరలను పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్‌పీపీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడిరచిన టోకు ద్రవ్యోల్బణ సూచీ గణాంకాల ఆధారంగా ఈ పెంపుదల చేపట్టినట్లు తెలిసింది. (Story: పారాసెట్‌మాల్ ధర పెరిగిందోచ్!)
See Also: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అసలు రివ్యూ ఇదే!