Home Blog Page 958

ఉద్యోగాల‌పై కేసీఆర్ ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం (PDF)

0
KCR
KCR

ఉద్యోగాల‌పై కేసీఆర్ ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం (PDF)

FINAL CM SIR’S STATEMENT Click Here

 

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా ..
——————–
రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..
గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు..
జిల్లాల్లాలో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

జిల్లాల వారీగా ఖాళీలు..
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు..
కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్‌- 2,328
రాజన్న జోన్‌- 2,403
భద్రాద్రి జోన్‌- 2,858
యాదాద్రి జోన్‌- 2,160
చార్మినార్ జోన్‌- 5,297
జోగులాంబ జోన్‌- 2,190

మల్టీజోన్లు..
మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370

ఏ శాఖలో ఎన్ని..
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16

 

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

0
KCR
KCR

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

తెలంగాణలో ఉద్యోగమేళా!

పూర్తి వివరాలివే!
80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details ! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాస్త ఆలస్యంగానైనా నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడిరచారు. మిగిలిన 11,103 పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. 95శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని కేసీఆర్‌ చెప్పారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు ఆకాశాన్నంటుతున్నాయి. కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టులతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కేసీఆర్‌ మానస పుత్రిక అయిన మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరును అందించారు. ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో సమకూరుతున్న ఆదాయ వనరులను సబ్బండ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా ఏడేండ్లలోనే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచి, ఇప్పటికే వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని కేసీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైందిలి

భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 371- డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. కేంద్రం అనవసర తాత్సారం చేసినా.. స్వయంగా అనేకసార్లు ఢల్లీికి వెళ్ళి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి దీనికున్న ప్రాముఖ్యతను వివరించినట్లు చెప్పారు. దీని కోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢల్లీిలోనే పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వల సవరణ సాధ్యమైందన్నారు. ఇది తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం అన్నారు.

గరిష్ఠ వయో పరిమితి పెంపు
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జనరల్‌ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచగా.. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ అభ్యర్థులు 49 సం.లు, దివ్యాంగులకు 54సం. వయో పరిమితిగా ఉంటుందని చెప్పారు.

శాఖల వారీగా ఖాళీల వివరాలివీ..

సీఎం కేసీఆర్‌ ప్రకటన ప్రకారం శాఖల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,334 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ శాఖలో 3,560, ఎస్సీల అభివృద్ధి శాఖ 2,879, నీటిపారుదల- కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ 2,692, గిరిజన సంక్షేమశాఖ 2,399, మైనార్టీ సంక్షేమశాఖ 1,825, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 1,598, పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి శాఖ 1,455, కార్మిక-ఉపాధి కల్పన శాఖలో 1,221 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

ఆర్థికశాఖలో 1,146 పోస్టులు.. స్త్రీ, శిశు సంక్షేమశాఖ 895, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 859, వ్యవసాయ-సహకార 801, ట్రాన్స్‌పోర్ట్‌- ఆర్‌అండ్‌బీ శాఖ 563, న్యాయశాఖ 386, పశుసంవర్థక, మత్స్యశాఖ 353, సాధారణ పరిపాలన శాఖ 343, పరిశ్రమలు-వాణిజ్యశాఖ 233, యువజన సర్వీసులు-పర్యాటక, సాంస్కృతిక శాఖ 184, ప్రణాళిక శాఖ 136, పౌరసరఫరాల శాఖ 106, లెజిస్లేచర్‌ 25, ఎనర్జీ 16 పోస్టులు.. ఇలా మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్‌ తన ప్రకటనలో వెల్లడిరచారు.

గ్రూప్స్‌.. లోకల్‌ కేడర్‌ వారీగా..

గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌- 4 వరకు భర్తీ చేయనున్న ఖాళీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్‌-1 కింద 503, గ్రూప్‌-2 (582), గ్రూప్‌-3 (1,373), గ్రూప్‌-4 (9,168) పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు. లోకల్‌ కేడర్‌ వారీగా పరిశీలిస్తే జిల్లా స్థాయిలో 39,829, జోనల్‌లో 18,866, మల్టీ జోనల్‌లో 13,170, మిగిలిన విభాగాలు, యూనివర్సిటీల్లో 8,174 పోస్టులను భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య ఇదీ..

జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడిరచింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39,829 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..
గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 582 ఉద్యోగాలు
గ్రూప్‌ 3 %–% 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

క్యాడర్‌ వారీగా ఖాళీలు..
జిల్లాల్లాలో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్‌ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

ఏ శాఖలో ఎన్ని..

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్‌- 13,086
హెల్త్‌, మెడికల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌- 12,755
హయ్యర్‌ ఎడ్యుకేషన్‌- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్‌- 2,399
మైనారిటీస్‌ వెల్ఫేర్‌- 1,825
ఎన్విరాన్మెంట్‌, ఫారెస్ట్‌, సైన్స్‌ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్‌, ఎంప్లాయీమెంట్‌- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌- 895
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌- 859
అగ్రికల్చర్‌, కో-ఆపరేషన్‌- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌- 343
ఇండస్ట్రీస్‌, కామర్స్‌- 233
యూత్‌, టూరిజం, కల్చర్‌- 184
ప్లానింగ్‌- 136
ఫుడ్‌, సివిల్‌ సప్లయిస్‌- 106
లెజిస్లేచర్‌- 25
ఎనర్జీ- 16

జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్‌ %– 5,268
%నిజామాబాద్‌- 1,976
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్‌- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్‌- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్‌- 1,213
ఆదిలాబాద్‌- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్‌- 1,172
హనుమకొండ- 1,157
మెదక్‌- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్‌ భూపాలపల్లి- 918
నిర్మల్‌- 876
వరంగల్‌- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్‌- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్‌- 741
వికారాబాద్‌- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు..

కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్‌- 2,328
రాజన్న జోన్‌- 2,403
భద్రాద్రి జోన్‌- 2,858
యాదాద్రి జోన్‌- 2,160
చార్మినార్‌ జోన్‌- 5,297
జోగులాంబ జోన్‌- 2,190

మల్టీజోన్లు..

మల్టీజోన్‌ 1- 6,800
మల్టీజోన్‌ 2- 6,370 (Story: తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details)

See Also: చిన్న ప‌త్రిక‌లే శాంతి క‌పోతాలు : కె.శ్రీ‌నివాస్‌రెడ్డి

‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా?
మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

అందుకే మీడియా నాలుగో స్తంభ‌మైంది!

0
Venkaiah Naidu
Venkaiah Naidu

అందుకే మీడియా నాలుగో స్తంభ‌మైంది!

నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి

• పత్రికలు, మీడియా సత్యానికి దగ్గరగా.. సంచలనాలకు దూరంగా ఉండాలి
• ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే ఎత్తిచూపాల్సిందే… అలాగని ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మంచిది కాదు
• సమాజంలో పాత్రికేయులూ ఓ భాగమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
• మీడియాలో వచ్చే ఒక్కో అక్షరం ఏవిధంగా ప్రభావితం చేయగలదో బేరీజు వేసుకుని నిర్ణం తీసుకోవడమే ఉన్నత విలువల జర్నలిజం
• కరోనా సమయంలో జర్నలిస్టులు చూపించిన తెగువ నిరుపమానం
• ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి

మార్చి 6, 2022, హైదరాబాద్

అందుకే మీడియా నాలుగో స్తంభ‌మైంది! నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసారమాధ్యమాలపై ఉందని, ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారథిగా.. అటు సమస్యలను ఇటు, ఇక్కడి పరిష్కారాలను అటు చేరవేయడంలో పాత్రికేయులు పోషిస్తున్న, పోషించాల్సిన పాత్రను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
ఆదివారం హైదరాబాద్ లో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముందు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ప్రజల్లోనూ ఎన్నో ఆశలు, అంచనాలు ఉంటాయని, చాలా విషయాలను తమకు అర్థమయ్యే రీతిలో పత్రికలు వివరిస్తాయనే ప్రజలు భావిస్తారని అందుకు అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలని ఆయన సూచించారు.
నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నదున్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయం అన్న ఉపరాష్ట్రపతి, సంపాదకీయాల ద్వారా తమ భావాలను జోడిస్తూ.. మిగిలిన వార్తలను యథావిధిగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలన్న ఆయన… వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలంటే వాటిని ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని.. అదే సమయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని పేర్కొన్నారు.
ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలన్న ఉపరాష్ట్రపతి, మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని బేరీజు వేయగలగాలని పాత్రికేయ మిత్రులకు సూచించారు. అక్షరంపై సంపూర్ణ సాధికారత ఉన్న వారే జర్నలిజం రంగంలో ప్రత్యేకతను చాటుకుంటారన్నారు. ఇందులో నాటి కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు మొదటి వరసలో నిలుస్తారని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఈ సందర్భంగా తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన శ్రీ ముట్నూరి కృష్ణారావు గారికి ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులు అర్పించారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమని, మనిషి జీవిత విధానాన్ని, ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి పత్రికలకు ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. అయితే ఈ శక్తిని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పత్రికలకు ఉండాలన్నారు. వివక్షలకు వ్యతిరేకంగా, మనవైన సంప్రదాయాలను, ప్రకృతిని కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తూ శ్రీ కృష్ణారావు గారు రాసిన సంపాదకీయాలు నేటికీ స్ఫూర్తిని పంచుతాయని తెలిపారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలకు మార్గదర్శనం చేయడం, దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు కింది స్థాయి వరకు తెలియజేయడంలో పత్రికలు ఎంతగానో కృషిచేశాయన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా బ్రిటిషర్ల పాలనా కాలంలో యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వరాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణా పత్రికకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
దాదాపు 4 దశాబ్దాలపాటు కృష్ణా పత్రిక సంపాదకీయం ద్వారా శ్రీ ముట్నూరి వారు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం చేసిందన్నారు. వారి నిరుపమానమైన దేశభక్తి, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్ష వెరసి వారిని పాత్రికేయ వృత్తివైపు నడిపించాయని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. మొండివారు అని పేరుగాంచిన వారి సంపాదకీయాలు అధ్యయన గ్రంథాలు అని చెప్పడం అతిశయోక్తి కాదని ఆయన అన్నారు.
‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమేననే విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. దీంతోపాటుగా సుతిమెత్తగా, చురకలు అంటిస్తూ విమర్శించే ఓవిధమైన గడుసుదనం వారి రచనల్లో తొంగిచూసేదన్నారు. దీంతోపాటుగా ఆ రోజుల్లో కృష్ణా పత్రిక తెలుగు సాహిత్యానికి, కళలకు, తెలుగు నాట సాగిన జాతీయ ఉద్యమాలకు ఇచ్చిన చేయూత నిరుపమానమైనదన్నారు.
కృష్ణారావు గారి సంపాదకీయాల్ని సాంఘిక విషయాలు, సాంస్కృతిక విషయాలు, ఆర్ధిక విషయాలు, రాజకీయ విషయాలు ఇలా 9 విభాగాలుగా విభజించి వాటిని ఓ చక్కటి పుసక్త రూపంలో ముందుకు తీసుకొచ్చిన శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ ను ఉపరాష్ట్రపతి అభినందించారు. నేటి యువత, మరీ ముఖ్యంగా యువ పాత్రికేయులు శ్రీ ముట్నూరి వారి సంపాదకీయాల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
కృష్ణారావు గారు రాసిన సంపాదకీయాల్ని యువత ఆకళింపు చేసుకోవాలని, ప్రతి సంపాదకీయం వెనుక వారి దూరదృష్టిని అర్ధం చేసుకుంటూ.. పాత్రికేయ వృత్తిలో శ్రీ కృష్ణారావు గారు పాటించిన విలువలు, సిద్ధాంత నిబద్ధత, దేశభక్తిని ఈతరం యువత అర్ధం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి, శాంతా బయోటెక్ చైర్మన్ డా. వరప్రసాద్ రెడ్డి, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్ పాత్రికేయులు శ్రీ కె.రామచంద్రమూర్తి, శ్రీ వల్లీశ్వర్, రచయిత శ్రీ దత్తాత్రేయ శర్మ, దర్శనం పత్రిక ఎడిటర్ శ్రీ ఎం.వి.ఆర్. శర్మ సహా పలువురు పాత్రికేయులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story: అందుకే మీడియా నాలుగో స్తంభ‌మైంది!)

See Also: చిన్న ప‌త్రిక‌లే శాంతి క‌పోతాలు : కె.శ్రీ‌నివాస్‌రెడ్డి

‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా?

మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

చిన్న ప‌త్రిక‌లే శాంతి క‌పోతాలు : కె.శ్రీ‌నివాస్‌రెడ్డి

0
Ssamna
Ssamna

చిన్న ప‌త్రిక‌లే శాంతి క‌పోతాలు : కె.శ్రీ‌నివాస్‌రెడ్డి

శాంతి కపోతాలను చంపకండి

స్సామ్నా రాష్ట్ర ప్రధమమహాసభలో
ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి

విజయవాడ: శాంతి కపోతాలుగా ఉన్న చిన్న పత్రికలను చంపొద్దని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి హితవుపలికారు. స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు అధ్యక్షతన విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయని వాటిలో శాంతి కపోతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే స్థానిక పత్రికలు అనేవి శాంతి కపోతాలు వంటివే అని చెప్పారు. కేవలం నిబంధనల పేరుతో వారిని అష్ట కష్టాలపాల్చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో రాజులు పావురాల ద్వారానే వర్తమాన సమాచారాన్ని పంపేవారన్నారు. సమాజంలో జరిగే సమాచారాన్ని కూడా పావురాల‌ మాదిరిగానే జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమాచారాన్ని అందజేస్తున్నాయన్నారు. అలాంటి పత్రికలను కేవలం ఆంక్షల కత్తితో చంపొద్దని సూచించారు. అక్రిడిటేషన్లు అనేవి జర్నలిస్టులకు ఉన్న హక్కుఅని ప్రభుత్వం ఆ హక్కును కాలరాసే విధంగా ప్రవర్తించడం సహేతుకం కాదన్నారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐఐఎస్) అధికారి అయిన సమాచార మరియు పౌర సంబంధాలశాఖ అధికారి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ రాకుండా జీఎస్టీ పేరుతో, సర్కులేషన్ నిబంధనలతో అడ్డుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని , ఈ తరహా సమాచార అధికారిని నేనెప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వ సలహాదారులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఇలాంటి సున్నితమైన విషయాలను సీఎం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లడంలేదో అర్ధం కావడం లేదన్నారు. అసలు సమాచార శాఖ అధికారులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారో లేక ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్చేసే విధంగా కృషి చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. మిగతా రాష్ట్రాలలో కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టులకు ఐదు నుంచి ఇరవై లక్షల రూపాయల వరకూ ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాల‌ను ఆదుకుంటే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం జీవో ప్రకటించి కూడా దాన్ని అమలు చేయకపోవడం శోచ‌నీయమని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డీఏవీపీ, ఆర్ ఎన్ ఐ రూల్స్ ప్రకారం ప్రతి 500 కాపీలు ముద్రించిన పత్రికకు అక్రిడిటేషన్లు, ఎన్ ప్యానల్ ఇచ్చి తద్వారా ప్రకటనలు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ఆయన ఆక్రోశం వెలిబుచ్చారు. పత్రికలలో చిన్న, పెద్ద పత్రికలు అనే తేడాలు లేవని కేవలం బడా బాబుల వ్యాపారంగా మార్చడం ద్వారా ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద పత్రికలలో వచ్చే వార్తల కంటే స్థానిక వార్తలకే సమాజంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందువల్లే పెద్ద పత్రికలు కూడా స్థానికతను అధారంగా చేసుకుని టాబ్లాయిడ్ పేజీలను తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల స్థానికత ఆధారంగా వీలైతే స్సామ్నా అనే పేరును స్థానికత వచ్చేవిధంగా మార్చితే బాగుంటుందని ఆయన మహాసభలో సూచించారు.అమెరికా వంటి దేశాలలో ఇలాంటి పత్రికలను కౌంటీలని పిలుస్తారన్నారు. చిన్న పత్రికలు చెప్పే సత్యం చిన సత్యం గానూ, పెద్ద పత్రికలు రాసే సత్యాలు పెద్ద సత్యంగానూ పిలవరన్నారు. ఎవరు రాసినా సత్యం ఒకే విధంగా ఉంటుందని దానిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎందులో రాసిన వార్త ప్రమాణికతే ముఖ్యమన్నారు. సత్యం అనేది ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తారని తెలిపారు. సత్యాన్ని గౌరవిస్తూ సత్యం రాసేందుకే ప్రతి ఒక్క పత్రిక ప్రయత్నించాలన్నారు. పెద సత్యాలు సత్యాలు కావని చిన సత్యాలు అసత్యాలు కావని దేనికైనా ప్రమాణికమే ముఖ్యమని ఆయన తెలిపారు. ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్సామ్నా రాష్ట్ర మహాసభకు 200 మంది ప్రతినిధులు రావడం ఎంతో అభినందనీయమన్నారు. మున్ముందు స్సామ్నా మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం చిన్న పత్రికలపై చిన్నచూపు తగదని, వాటిని ఆదుకునేందుకు అక్రిడిటేషన్లు, ప్రకటనలు ఎలాంటి షరతులు, నిబంధనలు విధించకుండా సహకరించాలని ఆయన కోరారు. స్సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి కార్యదర్శిని వేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పత్రికల మనుగడ కోసం స్సామ్నా ఏర్పాటుకు ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఎంతో కృషిచేశారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మహాసభలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, డి. సోమసుందర్ , ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ఫోటో జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, శ్రీరామమూర్తి, రామసుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు పసుపులేటి రాము, విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, స్సామ్నా నగర అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. (Story: చిన్న ప‌త్రిక‌లే శాంతి క‌పోతాలు : కె.శ్రీ‌నివాస్‌రెడ్డి)

నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులు నల్లిధర్మారావు (శ్రీకాకుళం)

కార్యనిర్వాహక అధ్యక్షులు సి వెంకటరెడ్డి (కడప)

ఉపాధ్యక్షులు
1పి బాలకోటయ్య (ప్రకాశం)
2 జె. రమేష్ రాజా (తూ.గో. జిల్లా)
3 పి విజయకుమార్ (నెల్లూరు)

ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి (కృష్ణా అర్బన్)

కార్యదర్శులు
బీవీవీ రామారావు (ప.గో.జిల్లా)
కె చక్రవర్తి (విశాఖ)
ఎం సునీల్ కుమార్ ( కర్నూలు)
వి అశోక్ కుమార్ (విజయనగరం)

కోశాధికారి
వి నర్సరాజు (గుంటూరు)

మరుయు 13 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తీర్మానాలు

1. ఐఅండ్ పీఆర్ కమిషనర్ ను వెంటనే బదిలీచేయాలి
2. చిన్నపత్రికలను జీఎస్డీ నుంచి మినహాయించాలి
3. డీఏవీపీ నిబంధనల ప్రకారం చిన్న పత్రికల వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి.
4. జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్‌ విద్యా సంస్థలలో ఇస్తున్న 50 శాతం రాయితీ మెమోగా కాకుండా జీవో రూపంలో ఇవ్వాలి.
5. ప్రభుత్వ ప్రకటనలను చిన్నపత్రికలకు ఇచ్చి ఆదుకోవాలి.

See Also: ‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా?

మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా?

0
Koo App
Koo App

‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా?

Koo యొక్క ప్రత్యేక లక్షణాలు స్థానిక వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతున్నాయి

భాషా వైవిధ్యం కలిగిన భారతదేశంలో, ఇంటర్నెట్‌లో స్థానిక భాషలో వ్యక్తీకరించడం ఒక ముఖ్యమైన లక్షణం

‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా? భారతీయుల ప్రత్యేక లక్షణం ఏమిటంటే, వారు నాణ్యతలో అత్యుత్తమమైనప్పటికీ తక్కువ ధరలో ఉండే వస్తువులను ఇష్టపడతారు. గత 15 ఏళ్లలో భారతదేశం యొక్క సోషల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌ను మనం పరిశీలిస్తే, అది చాలా మార్పుకు గురైంది. అనేక ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యేక ఫీచర్లను అందించడం ద్వారా తమ ఉనికిని సంపాదించుకున్నాయి, మరికొన్ని అదృశ్యమయ్యాయి. భారతదేశం యొక్క మొట్టమొదటి బహుళ-భాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అయినందున, గత రెండు సంవత్సరాలలో కూ యొక్క ఆవిర్భావం చాలా ముఖ్యమైనది. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశానికి వివిధ భాషలను కలిగి ఉన్న వేదిక అవసరం. తక్కువ వ్యవధిలో, ‘కూ’ తన వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్లను అందించడం ద్వారా గొప్ప పురోగతిని సాధించింది. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

టాక్ టు టైప్

‘కూ’ యొక్క ‘టాక్ టు టైప్’ ఫీచర్ అద్భుతమైనది, ఇది వినియోగదారులు తమ అభిప్రాయాలను టైప్ చేయకుండానే పోస్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ‘కూ’ యాప్‌లో, మీరు ‘కొత్త పోస్ట్(+ కూ)’ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే, వ్యక్తిగతంగా మాట్లాడే లోగో ద్వారా సూచించబడే బటన్ ఉంటుంది. మీరు దానిపై క్లిక్ చేస్తే, మీరు ఏమి పోస్ట్ చేయాలనుకుంటున్నారో చెప్పవచ్చు మరియు స్క్రీన్‌పై పదాలు టైప్ చేయబడతాయి. కీబోర్డ్ ఉపయోగించకుండానే ఇవన్నీ చేయవచ్చు. ఈ సదుపాయం 10 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది మరియు ప్రజలు తమకు నచ్చిన భాషలో తమ భావాలను వ్యక్తీకరించేలా చేయడమే దీని లక్ష్యం.

 ‘కూ’ అనేది ప్రపంచంలోనే మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, ఇది ‘టాక్ టు టైప్’ ఫీచర్‌ను ఉపయోగిస్తోంది, అది కూడా 10 విభిన్న భాషలలో. తమ తమ ప్రాంతాల భాషలో తమ భావాలను వ్యక్తీకరించడానికి మరింత సౌకర్యవంతంగా ఉండే మిలియన్ల మంది వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. కొంతమంది వినియోగదారులు టైప్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు, ఈ ఫీచర్ వారు కోరుకున్న విధంగా తమను తాము వ్యక్తీకరించడానికి వారికి అధికారం ఇస్తుంది.

బహుభాషా కూ (MLK)’ ఫీచర్

‘కూ’ ప్రజలు తమ ఆలోచనలను తమకు నచ్చిన భాషలో పోస్ట్ చేయడానికి వీలు కల్పిస్తున్నప్పటికీ, ఒక భాషలో వ్యక్తీకరించబడిన మంచి ఆలోచనను ఇతర భాషల ప్రజలకు మరియు సంఘాలకు తీసుకెళ్లడం కూడా చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ‘కూ’ తన MLK ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఏదైనా భాషలో పోస్ట్ చేసిన సందేశాన్ని 9 ఇతర భాషలకు అనువదిస్తుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అనువాదం మూల భాషలో వ్యక్తీకరించబడిన ప్రధాన భావాలను నిలుపుకుంది. ఇది వారి ఆలోచనలను వారికి నచ్చిన భాషలో వ్యక్తీకరించే వ్యక్తులకు చేరువను పెంచుతుంది, కానీ అనువాదం కారణంగా వారి సందేశం ఇతర భాషలను ఇష్టపడే వారికి చేరుతుంది.

Koo తన వినియోగదారులకు ఈ ప్రత్యేక ఫీచర్‌ను అందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్.

లైవ్ వీడియో

‘కూ’ యాప్ యొక్క ‘లైవ్ వీడియో’ ఫీచర్ వినియోగదారులకు ఎక్కడైనా చిన్న వీడియోలను రికార్డ్ చేయడానికి మరియు సృష్టించడానికి మరియు వారి అనుచరులతో నేరుగా భాగస్వామ్యం చేయడానికి అధికారం ఇస్తుంది. విజువల్స్ వారి సందేశం యొక్క ప్రభావాన్ని పెంచుతాయి కాబట్టి వినియోగదారులు వీడియోల ద్వారా హృదయపూర్వక సందేశాలను పంపవచ్చు.

ఎక్స్‌క్లూజివ్ కూ

‘కూ’ యొక్క ‘ప్రత్యేకమైన’ ఫీచర్ వినియోగదారులకు దానిని ప్రముఖంగా ప్రదర్శించడానికి అవకాశం ఇస్తుంది. అయితే, వారు (యూజర్లు) ‘ప్రత్యేకమైన’ ట్యాబ్‌లో పోస్ట్ చేస్తున్న కంటెంట్ ఇంతకు ముందు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోనూ షేర్ చేయబడలేదని నిర్ధారించుకోవాలి. ‘ఎక్స్‌క్లూజివ్’ ట్యాబ్ దాని కింద షేర్ చేయబడిన కంటెంట్ అసలైనది మాత్రమే కాదు, మరే ఇతర ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయబడలేదు అని సూచిస్తుంది. ప్రజలు ఒరిజినల్ కంటెంట్‌ను ఇష్టపడతారు కాబట్టి ఇది వారికి మరింత ట్రాక్షన్ మరియు అనుచరులను పొందడంలో సహాయపడుతుంది.

వ్యక్తిగత చాటింగ్

‘కూ’ యొక్క మరొక క్రాకర్‌జాక్ ఫీచర్ ఏమిటంటే ఇది వినియోగదారులు మరియు వారి అనుచరుల మధ్య చాటింగ్‌ను అనుమతిస్తుంది. ఫీచర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ చాటింగ్ ప్రైవేట్‌గా ఉంటుంది. చాట్‌ని ప్రారంభించడానికి, అనుచరులు వినియోగదారు నుండి అనుమతి పొందాలి. మెసేజ్ బాక్స్‌లో యూజర్ సమ్మతి ఇచ్చినప్పుడు, వారు చాట్ చేయడం ప్రారంభించవచ్చు. ఒక వినియోగదారు ఎవరైనా అనుచరులతో లేదా తెలియని వారితో పరస్పర చర్య చేయకూడదనుకుంటే, అతను/ఆమె చాటింగ్ అభ్యర్థనను తిరస్కరించవచ్చు. వినియోగదారులు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకునే అవకాశం ఉందని ఇది నిర్ధారిస్తుంది.

డైరెక్ట్ ట్రెండింగ్ మెసేజ్

ఇది అద్భుతమైన ‘కూ’ యాప్‌లోని మరో ప్రత్యేక లక్షణం. యాప్‌లో ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్ గురించి సందేశాన్ని పంపడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, వినియోగదారులు అన్ని ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌ల ముందు అందుబాటులో ఉన్న ‘+’ బటన్‌పై క్లిక్ చేయాలి. హ్యాష్‌ట్యాగ్‌ని ఎంచుకుని, ‘+’ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారులు అనువాదం గురించి చింతించకుండా హ్యాష్‌ట్యాగ్‌కు సంబంధించిన సందేశాన్ని తమకు నచ్చిన భాషలో పోస్ట్ చేయవచ్చు.

టాప్ టాపిక్

‘కూ’లోని ‘టాపిక్’ విభాగం పూర్తిగా భిన్నమైనది మరియు అద్భుతమైనది. ‘కూ’లో ‘టాపిక్’ టాప్ సెక్షన్ అని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. ‘కూ’ హోమ్ పేజీ ఎగువన ‘టాపిక్’ చిహ్నం ఉంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారులు అన్ని ప్రస్తుత టాప్ టాపిక్‌లను చూడగలరు మరియు వాటిలో దేనినైనా అనుసరించడానికి వారికి ఎంపిక ఉంటుంది. వినియోగదారుల మధ్య ‘కూ’పై చర్చకు దారితీసే అంశాలన్నీ ఈ విభాగం కింద ఉన్నాయి. వినియోగదారు క్రిందికి స్క్రోల్ చేస్తే, అతను అంశాల వర్గాలను కూడా చూడగలడు. రోజులో జరిగిన చర్చలన్నీ ఇక్కడ చూడొచ్చు.

యూనిక్ లైక్ బటన్

ఈ బహుభాషా ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి పోస్ట్‌కు ప్రత్యేకమైన ‘లైక్’ బటన్ ఉంటుంది. ఇతర సామాజిక ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, ఈ ‘లైక్’ బటన్ బ్లింక్ అవుతుంది మరియు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త వినియోగదారుల దృష్టిని ఆకర్షించడం మరియు పోస్ట్‌ల ఎంగేజ్‌మెంట్‌ను పెంచడం దీని వెనుక కారణం. వినియోగదారులు నిర్దిష్ట పోస్ట్‌ను ఇష్టపడినప్పుడు, అది ఎక్కువ ట్రాక్షన్ మరియు శ్రద్ధను పొందుతుంది.

చాట్ రూమ్

యాప్ వినియోగదారులకు ‘చాట్ రూమ్’ ఎంపికను కూడా అందిస్తుంది. మీరు యాప్ హోమ్ పేజీలో క్రిందికి స్క్రోల్ చేస్తే ఈ ఎంపిక కనిపిస్తుంది. ఒక వినియోగదారు ఈ ఎంపికను ఎంచుకుంటే, ప్రస్తుతం చర్చించబడుతున్న అన్ని హాట్ టాపిక్‌లు అతని/ఆమె ముందు కనిపిస్తాయి. అప్పుడు ఒక వినియోగదారు ఇతర వినియోగదారులతో అంశంపై అతని/ఆమె అభిప్రాయాలను చర్చించవచ్చు లేదా పంచుకోవచ్చు. ఈ ఫీచర్ యొక్క గొప్ప నాణ్యత ఏమిటంటే వినియోగదారులు తమకు ఇష్టమైన విషయాలను ఇతర వినియోగదారులతో చర్చించగలరు. (Story: ‘కూ’ యాప్‌లో స్పెష‌ల్ ఏంటో మీకు తెలుసా?)

See Also: మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన
 

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన

0
INORBIT DURGAM CHERUVU RUN
INORBIT DURGAM CHERUVU RUN

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022 – రెండవ ఎడిషన్‌లో పాల్గొన్న మూడు వేల మందికి పైగా ఉత్సాహవంతులు

ఇనార్బిట్‌ హైదరాబాద్‌ యొక్క రన్‌ ఫర్‌ ఇన్‌క్లూజన్‌ కార్యక్రమం ద్వారా 30 లక్షల రూపాయలను సమీకరించారు. ఈ మొత్తాలను దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి , ఉపాధి కోసం వినియోగించనున్నారు

హైదరాబాద్‌ : ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022ను ఆదివారం, దుర్గం చెరువు కేబుల్‌ వంతెన దగ్గర విజయవంతంగా నిర్వహించింది. స్పోర్ట్స్‌ బ్రాండ్‌ పూమా మద్దతుతో నిర్వహించిన ఈ సంవత్సరపు 21కెరన్‌కు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌, జెండా ఊపి ప్రారంభించగా,  10కెరన్‌కు  తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (ఐ అండ్‌ సీ) మరియు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌, ఐఏఎస్‌ ; 5కె రన్‌కు  తెలంగాణా రాష్ట్ర, పురపాలక మరియు నగరాభివృద్ధి శాఖల ప్రత్యేక కార్యదర్శి శ్రీ అర్వింద్‌ కుమార్‌, ఐఏఎస్‌లు జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగుల కోసం నిర్వహించిన మారథాన్‌కు స్త్రీ, మహిళ, దివ్యాంగ  మరియు సీనియర్‌ సిటిజన్‌ శాఖల సెక్రటరీ మరియు కమిషనర్‌ శ్రీమతి దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సంవత్సరపు ఐడీసీఆర్‌ –2022లో  విభిన్న వర్గాలు, వయసు విభాగాలకు చెందిన దాదాపు 3వేల మంది పాల్గొన్నారు. ఈ రన్‌లో 90 మంది దివ్యాంగులు పాల్గొనడంతో  పాటుగా దుర్గం చెరువు కేబుల్‌ వంతెన పై 100 మీటర్లు నడవడం ద్వారా  ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగించారు.

ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రన్‌లో పాల్గొన్న ఇతర ముఖ్య అతిథుల్లో శ్రీమతి ప్రియాంక ఆల,  ఐఏఎస్‌ ; శ్రీ కె శిల్పవల్లి, డిప్యూటీ డీసీపీ, సైబరాబాద్‌ పోలీస్‌ ;  ఐటీ శాఖ ముఖ్య సంబంధాల అధికారి శ్రీ అమర్‌నాథ్‌ రెడ్డి;  కెఆర్‌సీ హెడ్‌ శ్రీ శ్రవణ్‌ గోనె తదితరులు పాల్గొన్నారు. ఈ రన్‌కు నిర్మాణ్‌ డాట్‌ ఓఆర్‌జీ  ఎన్‌జీవో మద్దతునందించింది. ఈ సంస్థ దివ్యాంగులకు నైపుణ్యాభివృద్ధి కల్పించడంతో పాటుగా  వారిని ఉద్యోగార్హులుగానూ మారుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 30 లక్షల రూపాయలను సమీకరించారు.

‘‘రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ హైదరాబాద్‌ హాఫ్‌ మారథాన్‌ను అధిక సంఖ్యలో పాల్గొన్న అభ్యర్థులతో నిర్వహించడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం మద్దతునందించిన  మా భాగస్వాములు, న్రభుత్వ అధికారులకు ధన్యవాదములు తెలుపుతున్నాము. అత్యంత కఠినమైన కోవిడ్‌ భద్రతా మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని  దీనిని నిర్వహించాము. ఈ మహోన్నత కార్యక్రమానికి సైబరాబాద్‌ పోలీసులు అపూర్వమైన సహకారం అందించారు.  ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటుగా ఫిట్‌గా ఉండేందుకు మరింతమందికి స్ఫూర్తి కలిగించిన వారందరికీ  మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను భవిష్యత్‌లో మరింతగా కొనసాగించనున్నాము’’ అని శరత్‌ బెలావడి, సెంటర్‌ హెడ్‌, ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌ అన్నారు.

ఈ ఐడీసీఆర్‌ 2022కు అప్పెరల్‌ బ్రాండ్‌ లైఫ్‌స్టైల్‌ ప్రైజ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తే, రేడియో పార్టనర్‌గా ఫీవర్‌ ఎఫ్‌ఎం, టైమింగ్‌ పార్టనర్‌గా రమేష్‌ వాచ్‌ కో, హైడ్రేషన్‌ భాగస్వామిగా కిన్లే, జ్యువెలరీ భాగస్వామిగా బ్లూస్టోన్‌, బ్రేక్‌ఫాస్ట్‌ భాగస్వామిగా పంజాబ్‌ బిస్ట్రో, మెడికల్‌ పార్టనర్‌గా కాంటినెంటల్‌ హాస్పిటల్‌, బేవరేజ్‌ భాగస్వామిగా చాయ్‌ పాయింట్‌, కుకీ పార్టనర్‌గా కుకీ మెన్‌,  రియల్‌ ఎస్టేట్‌ భాగస్వామిగా రహేజా గ్రూప్‌,  ఎకో–సిస్టమ్‌ భాగస్వామిగా హైసియా వ్యవహరించాయి.  ఈ రన్‌కు నగరాభివృద్ధి మరియు ఎంఏ; డబ్ల్యుసీడీ , హెచ్‌ఎండీఏ, ఎస్‌సీఎస్‌సీ మరియు టీఎస్‌ఐఐసీలు మద్దతునందించాయి. ఏఐఐఎంఎస్‌ ఈ రన్‌ను సర్టిఫై చేసింది.  (Story: ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన)

See Also: డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

కొత్త డిజైన్‌లను ఆవిష్కరించిన ఒర్రా

కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలలో కెఎల్‌ యూనివర్శిటీకి గుర్తింపు

0
KL University
KL University
తమ కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలకు గానూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ
 
హైదరాబాద్, వడ్డేశ్వరం/విజయవాడ: మార్చి 2022 : గ్రాడ్యుయేషన్‌ మరియు ఉన్నత విద్యలో జాతీయ స్థాయిలో అగ్రగామి ఇనిస్టిట్యూట్‌లలో ఒకటైన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ కి ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ ఎన్‌ఎస్‌ఎస్‌ (నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌) చేపట్టిన సమర్థవంతమైన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి గానూ ప్రశంసలు దక్కాయి. యూనివర్శిటీ విద్యార్థులు ఎస్‌ఎస్‌ఎస్‌ కింద చురుగ్గా పలు కార్యక్రమాలు చేపట్టి తమ సేవలనందించారు, యువజన మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ విభాగం ఎన్‌ఎస్‌ఎస్‌. తమ తాజా కార్యక్రమంలో భాగంగా 12 గ్రామాలలోని 7వేల కుటుంబాలను యూనివర్శిటీ దత్తత తీసుకుంది. దీనిలో భాగంగా గ్రామాలలో బస్టాండ్‌లు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ ఆఫీసులు, గుర్తించబడిన స్ట్రీట్స్‌ సహా గ్రామాలలో పరిశుభ్రతను ప్రోత్సహించడం చేశారు.
మహమ్మారి విజృంభణ కొనసాగినప్పటికీ, కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ నుంచి 1000 మంది మెగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంబీఏ, బీబీఏ, సీఎస్‌ఈ, న్యాయ మరియు వ్యవసాయ శాఖలకు చెందిన 900 మంది విద్యార్ధులు పాల్గొనడంతో పాటుగా 100 మంది ఫ్యాకల్టీ, మేనేజ్‌మెంట్‌ సభ్యులు సైతం ఓ మహోన్నతమైన కారణానికి తోడ్పాటునందించారు. అన్ని కార్యక్రమాలనూ ప్రభుత్వం నిర్ధేశించిన భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా చేశారు. దత్తత తీసుకున్న గ్రామాలలో గుంటూరులోని పెదపాలెం, పాతూరు, రేవెంద్రపాడు, కొలనుకొండ, వడ్డీశ్వరం, గుండిమెడ, చిర్రావు, రామచంద్రాపురం, శృంగారాపురం, మేళ్లంపూడి, ఇప్పాటమ్‌, ఆత్మకూరు వంటివి ఉన్నాయి.
ఈ డ్రైవ్‌తో పాటుగా కెఎల్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ వలెంటీర్లు ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలను ఈ 12 గ్రామాల్లోనూ నిర్వహించారు. ఓ క్రమపద్ధతిలో నిర్వహించిన కార్యక్రమాలతో పాటుగా ప్రభావవంతైన వ్యర్థ నిర్వహణ వ్యవస్ధలు , ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ప్రకృతిలో కలవకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలిపారు. యూనివర్శిటీ యొక్క ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ ఈ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలను దత్తత తీసుకున్న అన్ని గ్రామాలలోనూ అమలు చేయడంతో పాటుగా స్థిరంగా వృద్ధి చెందేందుకు సైతం భరోసా కల్పించారు. ఈ విస్తృతశ్రేణి కార్యక్రమానికి అవసరమైన నిధులను యూనివర్శిటీతో పాటుగా ఎన్‌ఎస్‌ఎస్‌ పథకం కింద యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అందించింది.
పరిశుభ్రత అభివృద్ధి , భద్రత, స్వచ్ఛత దిశగా తమ పూర్తి నిబద్ధతలో భాగంగా కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ పలు కార్యక్రమాలను క్యాంపస్‌ లోపల స్వీకరించి క్యాంపస్‌ను 100% ప్లాస్టిక్‌ రహితంగా మార్చింది. ఈ యూనివర్శిటీలో సమర్థవంతమైన మురుగునీరు శుద్ధి ప్లాంట్‌ అందుబాటులో ఉంచడంతో పాటుగా వ్యర్థాలను వేరు చేయడం, రీసైకిల్‌ చేయడం, స్మార్ట్‌ ఎనర్జీ కన్వర్షన్‌ పద్ధతులను సైతం వినియోగిస్తున్నారు.
కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల యూనివర్శిటీ నిబద్ధతను గురించి కె ఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.పి. సారధి వర్మ మాట్లాడుతూ ‘‘స్వచ్ఛత కార్యక్రమాల అమలులో మా ఎన్‌ఎస్‌ఎస్‌ వలెంటీర్ల ప్రయత్నాలు, చూపిన నిబద్ధత, చుట్టు పక్కల గ్రామాలలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ క్లీన్‌ఇండియా కార్యక్రమం కింద మా ప్రధాన లక్ష్యం, గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరచడం, బహిరంగ మూత్ర విసర్జన ప్రక్రియలను తొలగించడం, పరిశుభ్రతా ప్రక్రియలలో అధిక శాతం కుటుంబాలు పాల్గొనేలా చేయడం’’అని అన్నారు.
గతంలో ఈ యూనివర్శిటీ క్యాంపస్‌కు మొదటి ర్యాంకును యూనివర్శిటీలు (ప్రైవేట్‌) విభాగంలో ఏపీ గ్రీన్‌ అవార్డులలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో ఈ అవార్డు అందజేయగా, దక్షిణ మధ్య ప్రాంతంలో అత్యంత పరిశుభ్రమైన క్యాంపస్‌గా ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) గుర్తించింది. ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ ప్రస్తుతం కొన్ని అనాథశరణాలయాలు, వృద్ధాశ్రమాలతో కలిసి పనిచేస్తుంది. (Story: కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలలో కెఎల్‌ యూనివర్శిటీకి గుర్తింపు)

గ్లకోమా వస్తే అంధత్వం వస్తుందా?

0
Glaucoma
Glaucoma

గ్లకోమా వస్తే అంధత్వం వస్తుందా?

గ్లకోమా వలన సంభవించే అంధత్వ నివారణకు అవగాహన కల్పించడం 

వార్షిక కంటి పరీక్ష మరియు త్వరిత గుర్తింపు కీలకం

ప్రపంచ గ్లకోమా వారం 2022: మార్చి 6-12

 

గ్లకోమా వస్తే అంధత్వం వస్తుందా? : ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ) ప్రతి సంవత్సరం పెద్దలను మరియు పిల్లలను ప్రభావితం చేసే ఈ కంటి వ్యాధిపై ప్రజల దృష్టి తీసుకురావడానికి ప్రపంచ గ్లకోమా వారాన్ని పాటిస్తుంది. కంటి ఒత్తిడిలో పెరుగుదల సంబంధిత కంటి సమస్య ఇది. పునరుద్ధరించలేని అంధత్వానికి దారితీసే కంటి నరాలు దెబ్బతినడం దీని సహజ లక్షణంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధరించలేని అంధత్వానికి అతి సాధారణ కారణం గ్లకోమా. 2040 సంవత్సరం నాటికి గ్లకోమా ఉన్న రోగుల సంఖ్య 76 మిలియన్ నుంచి 111.8 మిలియన్ కు పెరుగుతుందని ప్రపంచ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ రోగులలో అత్యధికం ఆఫ్రికా మరియు ఆసియా నివాసులు.

 ప్రపంచ గ్లకోమా వారం (డబల్యూజిడబల్యూ) ప్రపంచ గ్లకోమా అసోసియేషన్ (డబల్యూజిఎ) మరియు ప్రపంచ గ్లకోమా రోగుల అసోసియేషన్ (డబల్యూజిపిఎ) ల సంయుక్త అంతర్జాతీయ కార్యక్రమం. ఈ సంవత్సరం దీనిని 2022 మార్చి 6-12 నుంచి పాటిస్తారు. ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ త్వరిత గుర్తింపు మరియు నివారణకై గ్లకోమాపట్ల ప్రజలలో అవగాహన పెంచడానికి అవగాహనా ప్రచారాలు, ఉపన్యాసాలు మరియు రోగుల పరస్పర చర్చా ఫోరంలను నిర్వహిస్తున్నది.

గ్లకోమా తీవ్రత

–          కంటిలోపలి ఒత్తిడిలో పెరుగుదల ఉన్నప్పటికీ గ్లకోమా ఉన్న చాలామందిలో తొలి లక్షణాలు లేదా నొప్పి ఉండదు

–          వారు కంటి నిపుణుడి వద్దకు వెళ్లే సరికి, అప్పటికే చూపుకు హాని జరిగిపోయి ఉంటుంది.

–          గ్లకోమా వలన చూపు ఒకసారి పోతే, దానిని పునరుద్ధరించలేము. అందుకే దానిని ‘నిశ్శబ్ద చూపు దొంగ’ అనికూడా అంటారు.

–          మంచి వార్త ఏమిటంటే, త్వరితంగా గుర్తించి, చికిత్స చేస్తే, గ్లకోమా వలన దృష్టి కోల్పోవడాన్ని నివారించవచ్చు.

–          గ్లకోమా వలన అంధత్వంలో 80% నివారించగలిగినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 మిలియన్ల మంది గ్లకోమా వలన అంధులవుతున్నారు. అందులో 2/3 వంతు మహిళలు.

–          దీనికి కారణం బహూశా అవగాహన లోపం వలన 90% గ్లకోమా కేసులు గుర్తింపబడకపోవడం.

భారతదేశంలో గ్లకోమా వ్యాప్తి

–          అందుబాటులో ఉన్న గణాంకాలు పిల్లలతో సహా 1.12 కోట్ల భారతీయులు (భారతదేశ జనాభాలో 4.5%) గ్లకోమాతో బాధపడుతున్నారు.

–          అందులో 11 లక్షలమంది గ్లకోమా వలన అంధులయ్యారు.

–          గ్లకోమా చాలావరకు సాధారణంగా 40 ఏళ్ల వయస్సు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది; 40 ఏళ్ళు పైబడిన వారిలో ఎనిమిది మందిలో ఒకరికి గ్లకోమా వచ్చే ప్రమాదం ఉన్నది.

త్వరిత నిర్ధారణ 

–          90% చూపు పోయేంత వరకూ గ్లకోమా ఉన్న వ్యక్తికి ఏ విధమైన లక్షణాలూ ఉండవు.

–          గ్లకోమావలన దృష్టి పోకుండా నివారించడానికి పరీక్ష ద్వారా త్వరిత గుర్తింపు ఒక్కటే మార్గం.

–          కళ్ళద్దాల కొరకు చేసే ప్రాధమిక కంటి పరీక్ష (వ్యాకోచించకుండా చేసే కంటి పరీక్ష) గ్లకోమాను కనిపెట్టలేదు.

–          కంటి ఒత్తిడి పరీక్ష, వ్యాకోచింపజేసి ఫండస్ పరీక్ష మరియు గోనియోస్కోపీ (నిర్ణీత కేసులలో) లతో కూడిన ఒక సమగ్ర కంటిపరీక్ష మాత్రమే గ్లకోమా నిర్ధారణ చేయగలదు.

 ఎవరు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి?

–          దాదాపు 10-20% కేసులలో గ్లకోమా రోగుల తోబుట్టువులను మరియు పిల్లలను ఈ వ్యాధి ప్రభావితం చేయగలదు. కాబట్టి, గ్లకోమా రోగుల కుటుంబ సభ్యులకు తప్పనిసరి.

–          తీవ్రమైన మయోపియా లేదా మధుమేహం ఉన్న 40 ఏళ్లకు పై బడినవారు చేయించుకోవాలి.

–          స్టెరాయిడ్లను కేవలం వైద్య పర్యవేక్షణలో జాగ్రత్తగా వాడాలి. కంటి మందు చుక్కలు, ఇన్హేలర్లు, ఆయింట్మెంట్లు లేదా మాత్రల వంటి స్టెరాయిడ్లను వాడటం తప్పనిసరి అయితే, గ్లకోమాను తోసిపుచ్చడానికి క్రమబద్ధంగా సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవాలి.

–          ఇంతకుముందు తీవ్రమైన కంటి గాయం అయినవారు లేదా కంటి శస్త్రచికిత్సలు జరిగిన వారు గ్లకోమాను తోసిపుచ్చడానికి తమ కళ్ళకు క్రమబద్ధంగా పరీక్ష చేయించుకోవాలి.

–          గ్లకోమాకు తెలిసిన ప్రమాద కారకాలు ఇవి. కానీ, పై ప్రమాద కారకాలు ఏవీ లేకుండా కూడా చాలామందికి గ్లకోమా రావచ్చు.

చికిత్స

–          రకం, తీవ్రత మరియు పూర్వ చరిత్ర ఆధారంగా, గ్లకోమాకు మందులతో (సాధారణంగా కంటి మందుచుక్కలు), లేజర్లు (వివిధరకాలు) మరియు అవసరమైతే శస్త్రచికిత్సతో చికిత్స చేయవచ్చు

–          కంటి ఒత్తిడిని నియంత్రించడం మరియు గ్లకోమావలన మరింత దృష్టి నష్టాన్ని నివారించడం గ్లకోమా చికిత్స లక్ష్యం.

–          సాధారణంగా గ్లకోమా శస్త్రచికిత్స లక్ష్యం దృష్టిని మెరుగుపరచడం కాదు, మిగిలిన చూపును భద్రపరచడం.

–          కంటికి శుక్లం ఉన్నప్పుడు, శస్త్రచికిత్స శుక్లానికి ఆపాదించే చూపును తిరిగి పొందవచ్చు.

అపోహలను తొలగించడం

1)      మేము యువకులం. మాకు గ్లకోమా రావచ్చా?

40 ఏళ్ళు పైబడినవారిలో ఓపెన్-యాంగిల్ గ్లకోమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటం నిజమైనప్పటికీ, 40 ఏళ్లకు తక్కువ వయసున్నవారిని ప్రభావితం చేయగల ఇతర గ్లకోమా రకాలు (కొన్ని చాలా తీవ్రమైనవి) ఉన్నాయి.

2)      పిల్లలకు లేదా శిశువులకు గ్లకోమా రావచ్చా?

అసాధారణమైన కంటి అభివృద్ధి కారణంగా నవజాత శిశువులు మరియు చిన్నపిల్లలకు గ్లకోమా రావచ్చు. ఈ పిల్లలకు పెద్ద నీలి కళ్ళు ఉంటాయి.

3)      నేను ఇప్పుడే నా కళ్ళకు పరీక్ష చేయించుకున్నాను, నాకు కళ్ళద్దాలుకూడా లేవు; అయినా నాకు గ్లకోమా రావచ్చా?

మీరు కళ్ళద్దాలకోసం మీ కంటిపరీక్ష చేయించుకున్నప్పటికీ, ఒక సమగ్ర కంటిపరీక్ష లేకుండా గ్లకోమాను తోసిపుచ్చలేము.

4)      గ్లకోమా వస్తే నాకు అంధత్వం వస్తుందా?

పోయిన దృష్టి తిరిగి రాదు. కానీ, త్వరిత గుర్తింపు మరియు చికిత్సటో ఒక కంటి నిపుణుడు మీ మిగిలిన చూపును కాపాడటంలో మరియు రక్షించడంలో సహాయపడగలరు. తొలి దశలలో వచ్చిన రోగులకు దృష్టి వైకల్యం ఉండదు. వారు పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపగలరు.

5)      గ్లకోమావలన కోల్పోయిన చూపును శుక్ల శస్త్రచికిత్స (లెన్స్ పెట్టడం) పునరుద్ధరించగలదా?

లెన్స్ మార్చడంవలనద్వారా పాడైన ఫిలిం (లేదా 100 మెగాపిక్సెల్ సెన్సార్) ఉన్న కెమేరాను  బాగుచేయలేనట్లే, కేవలం శుక్లం తొలగించడం మరియు ఇంట్రాఆక్యులర్ లెన్స్ పెట్టడంవలన గ్లకోమా ఉన్న కన్ను ప్రయోజనం పొందదు.

డా. శిరీషా సెంథిల్

గ్లకోమా కన్సల్టెంట్

ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ

పరుపును క్లీన్ చేయడం ఎలా?

0
How to Deep Clean Your Mattress Quickly and Easily
How to Deep Clean Your Mattress Quickly and Easily

క్లీన్ చేయడం ఎలా?

మీ పరుపును త్వరగా, సులభంగా డీప్ క్లీన్ చేయడం ఎలా?

పరుపును క్లీన్ చేయడం ఎలా? : మనం, మన జీవితంలో సరాసరి మూడోవంతు  పరుపుపైనే గడుపుతుంటాం. కానీ  అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం మనలో చాలామంది మన పరుపులను శుభ్రతా కార్యక్రమాలలో భాగం చేసుకోవడానికి ప్రాధాన్యత నివ్వడం మాత్రం కనిపించదు.  మీ పరుపులను పరిశుభ్రంగా ఉంచడం కోసం డైసన్‌ ఇంజినీర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు మరియు దుప్పట్ల  కింద దాగిన సూక్ష్మ జీవుల జీవితాన్ని ఎలా అంతం చేయాలో కూడా తెలుపుతారు…
హైదరాబాద్, 2 మార్చి 2022: చూడటానికి పరిశుభ్రంగా ఉన్నప్పటికీ.  మీ పరుపులు నిజానికి సూక్ష్మజీవులకు ఆవాసంగా ఉంటాయి. మీరు నిద్రపోయినప్పుడు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని ఇవి కలిగిస్తాయి.  ధూళికణాలు, వాటి మలం, బ్యాక్టీరియా, వైరస్‌, పొలెన్‌ మరియు ఇతర అలెర్జీ కారకాలు అతి క్లిష్టమైన సమ్మేళనంగా మారడంతో పాటుగా ఇంటిలో దుమ్ముకు కారణం కావడమే కాదు, మీ పరుపులను ఆవాసంగా అవి మలుచుకునేందుకు కూడా తోడ్పడతాయి.
నిజానికి ఒక్క పరుపుపైనే  కోట్లాది ధూళి కణాలు ఉంటాయి. నిజానికి ఇది అంతర్జాతీయంగా సమస్యగా పరిణమిస్తుంది.
ధూళికణాలు తమంతట తాముగా మనకు హాని చేయక పోవచ్చు కానీ ధూళి కణాలలో అలెర్జిన్స్‌ మాత్రం ప్రపంచవ్యాప్తం1గా అలెర్జిక్‌ వ్యాధులను పరిచయం చేస్తున్నాయి.  బాల్యంలో అధికంగా ఇండోర్‌ అలెర్జెన్స్‌ బారిన పిల్లలు పడితే, అంటే ఇంటిలోని ధూళి కణాలు వల్ల కూడా అస్తమా2 లాంటి  వ్యాధులు రావొచ్చు.
‘‘మానవ శరీరంపై నుంచి రాలిన మృత చర్మ కణాలు, పెంపుడు జంతువుల నుంచి రాలిన మృతకణాలు ప్రధానంగా ఈ ధూళి కణాలకు ఆహారంగా నిలుస్తుంది’’ డైసన్‌  వద్ద మైక్రోబయాలజీలో లీడ్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా చేస్తున్న జాన్నీ కాంగ్‌ అన్నారు. ‘‘మనం మన జీవితంలో మూడవ వంతు సమయం వెచ్చించే పరుపులపై చుండ్రు లాంటి కణాలు పేరుకుపోవడం ఏమంత ఆశ్చర్యం కాదు. నిజానికి ధూళి కణాలకు ప్రధానమైన ఆహారంగా ఇది నిలుస్తుంది. నిజానికి, మనలో చాలామంది  ధూళి కణాల మలంతో కూడిన పరుపులపైనే నిద్రిస్తుంటాము’’ అని అన్నారు.
ఇంటిలో ధూళికణాలు ప్రధానంగా మైక్రోస్కోపిక్‌ సాలిళ్లవర్గానికి చెందినవి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ ఇవి కనిపిస్తాయి. వీటి సరాసరి జీవితకాలం 65–100 రోజులు. ఈ సమయంలో అవి దాదాపు 2000 మలపు పెల్లెట్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు, ఇవి తమ సాల్వియా ద్వారా మరింత ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇవన్నీ కూడా  అలెర్జిన్లను మరింతగా పెంచడంతో పాటుగా మీ ఆరోగ్యం3 పై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఈ ధూళికణాలు ప్రధానంగా మానవ శరీరం లేదా పెంపుడు జంతువుల నుంచి రాలిన చుండ్రు లేదా మృతకణాలను ఆహారంగా తీసుకుంటాయి. సరాసరిన, మానవులు 2గ్రాముల మృతకణాలను ప్రతి రోజూ4 ఉత్పత్తి చేస్తుంటారు మరియు రాత్రి పూట ఇది మరింత అధికం కావొచ్చు. ఎందుకంటే పరుపులతో రాపిడి కారణంగా మృతకణాలు మరింతగా రాలుతుంటాయి. ఇంటిలోని ఇతర మురికి అంటే ఆహార రేణువుల5 నుంచి ఇవి మరింతగా పోషకాలు పొందుతాయి.  అందువల్ల, మీరు ఉదయం పూట  మంచంపై మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో విశ్రాంతి పొందడం లేదా రాత్రి పూట పరుపుపై మీ పెట్‌తో ఆడుకుంటే, మీరు మీ పరుపును మరింత తరచుగా శుభ్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
వేగవంతంగా పరుపులు శుభ్రపరుచుకునేందుకు సలహాలు
‘‘మీ పరుపులను శుభ్రపరచడం దగ్గరకు వస్తే, ఒకే రీతిలో అందరికీ సరిపడక పోవచ్చు. మీ పరుపు రకం,  వినియోగదారులు, ధూళి కణాల వల్ల వినియోగదారులకు కలిగే అలెర్జీలు వంటివి సైతం ప్రభావం చూపుతాయి’’ అని జోయాన్నీ అన్నారు. ‘‘తరచుగా శుభ్ర పరచడం వల్ల మీ పరుపులపై  చర్మ మృతకణాల సంఖ్య తగ్గడంతో పాటుగా ధూళి కణాలకు ఆహార వనరులు కూడా తగ్గుతాయి. దానితో పాటుగా ఇతర అలెర్జినిక్‌ పదార్ధాలు సైతం తగ్గుతాయి. ఇది మీ ఆరోగ్యానికీ మద్దతునందిస్తుంది’’ అని అన్నారు.
జోయాన్నీ కాంగ్‌ వివరించిన నాలుగు అతి సులభమైన అంశాలను అనుసరించడం ద్వారా మీ పరుపులను ఈ దిగువ రీతిలో శుభ్రపరుచుకోండి ః
1. బెడ్డింగ్‌ తొలగించాలి మరియు ఉతకాలి. పరుపు మీద గలేబీలు మరియు దుప్పట్లను వేడి నీటితో శుభ్రపరచాలి.  ఈ నీటి ఉష్ణోగ్రత 140 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ లేదా 195 డిగ్రీల ఫారిన్‌హీట్‌  ఉండాలి. ఈ వేడి నీటి కారణంగా అలెర్జిన్స్‌ తగ్గేందుకు తోడ్పడుతుంది. సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే మీ పరుపులు వాక్యూమ్‌ క్లీనింగ్‌ చేయగలుగుతారు. అందువల్ల, మీ లాండర్‌ మరియు మీ బెడ్డింగ్‌ను వారానికి ఒక్కసారి అయినా మార్చడం వల్ల కంటికి కనిపించని మృతకణాలను తొలగించడంతో పాటుగా ధూళి, అలెర్జిన్స్‌ను రాకుండా అడ్డుకోవచ్చు.
2. మృదువుగా వాక్యూమ్‌ చేయాలి కానీ శక్తివంతంగా చేయాలి.ధూళి కణాలు అతి చిన్నవిగా ఉంటాయి. కానీ అవి మొండిగా పట్టుకుని ఉంటాయి. వాటి  పంజాలు మీ పరుపులో ఫైబర్లను బలంగా పట్టుకుని ఉండేందుకు సహాయపడతాయి. వీటిని తొలగించడం కష్టం. హై పవర్‌ లేదా బూస్ట్‌ మోడ్‌లో వాక్యూమ్‌ ఉపయోగించడం వల్ల వీలైనంత ఎక్కువగా ఈ ధూళి కణాలు, చర్మపు మృతకణాలు మరియు అలెర్జిన్స్‌ తొలగించడం సాధ్యమవుతుంది. మినీ మోటరైజ్డ్‌ టూల్‌ను హ్యాండ్‌హెల్డ్‌ మోడ్‌లో ఉపయోగించండి. ఇది మీ  పరుపుల ఉపరితలం నాశనం చేయదు. కానీ మీ ధృడమైన నైలాన్‌ బ్రిస్టెల్స్‌ మీ పరుపులోని ఫైబర్స్‌ను  కదిలిస్తుంది మరియు ధూళి కణాలు మరియు ఇతర చెత్తను వదిలిస్తుంది.  మీరు ఉపయోగించే వాక్యూమ్‌, పూర్తి స్ధాయిలో ఫిల్టరేషన్‌ వ్యవస్ధను కలిగి ఉందని నిర్ధారించుకోండి. తద్వారా  శుభ్రపరిచేటప్పుడు మీ మొహంపై పడే  ధూళికణాలను నివారించడమూ సాధ్యమవుతుంది.
3. చేరుకవడానికి కష్టమైన ప్రాంతాలపై దృష్టి సారించండి. మీ పరుపుల ఉపరితలాలను పూర్తిగా శుభ్రపరిచేటప్పుడు పగుళ్లుపై అధికంగా శ్రద్ధ చూపాలి లేదా ధూళి, అలెర్జిన్స్‌  చేరేందుకు అధికంగా ఆస్కారం కలిగిన ప్రాంతాలపై దృష్టి సారించాలి. మీ పరుపుల అంచుల చుట్టూ శుభ్రపరిచేటప్పుడు క్రెవైస్‌ టూల్‌ ను హ్యాండ్‌హెల్డ్‌ మోడ్‌లో ఉపయోగించడం ద్వారా దాగి ఉన్న  ధూళిని సైతం తొలిగించవచ్చు.  మీ మంచం కింద కూడా శుభ్ర పరచడం మరువవద్దు. ధూళి కణాలు ాకట్లో, వేడి ప్రాంతాలు, తేమ ప్రాంతాలతో పాటుగా మృతకణాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అధికంగా ఉంటాయి.
4. తిప్పండి, పునరావృతం చేయండి, మరలా నిర్మించండి. మీ పరుపులను తిరగేయండి. మరో వైపు కూడా వాక్యూమ్‌ చేయండి.తద్వారా కంటికి కనిపించని అలెర్జిన్స్‌ను వీలైంతగా తగ్గించండి. ఒకవేళ మీరు ఏదైనా మరకను శుభ్రపరచాలనుకుంటే, ఆ మరకలు పూర్తిగా పొడిగా మారాయని నిర్ధారించుకున్న తరువాత బెడ్‌ను తిరిగి వేయాలి. తమ కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.  అంతేకాదు, మీ పరుపులపై ధూళి కణాల  వేగంగానూ పెరుగుతాయి. మీరు పరుపులను కాపాడే ప్రొటెక్టర్ల వినియోగం కూడా ఆలోచించవచ్చు.  ఇది అధిక చెమట మరియు ధూళి కణాలను త్వరగా పీల్చుకోవడం వల్ల అతి సులభంగా శుభ్రపరచవచ్చు.
మరకలను ఎలా తొలగించాలంటే…
అప్పుడప్పుడూ పరుపులు ఉపరితల శుభ్రతను మించిన శుభ్రతను కోరుకుంటాయి. పరుపులపై మరకలను తొలిగించే పని చూసీ చూడనట్లు వదిలేయడం లేదంటే వాటిని తొలగించలేమంటూ మిమ్మల్ని మీరు నిరుత్సాహ పరుచుకునే ముందు మీరు కొన్నిఅంశాలను  ప్రయత్నించి చూడాల్సిందే. ఇవి మీ పరుపులను  తాజాగా ఉంచడంతో పాటుగా సంవత్సరాల తరబడి వినియోగం తరువాత కూడా తాజాగానే నిలుపుతాయి.
మరకల రకాలను అర్థం చేసుకోవడంతో పాటుగా మీరు ఆ మరకలను తొలగించడానికి ప్రయత్నిస్తుంటే , మీ పరుపులపై తీవ్ర అసహనం లేదంటే కఠినతను ప్రదర్శించకుండానే తగిన చికిత్స ఎలా అందించాలంటే…
1. ఎంజైమాటిక్‌ మరకలు. వీటిలో రక్తం, స్వేదం మరియు మూత్రం వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్స్‌తో తయారైన మరకలు.  పెద్ద అణువులను చిన్న అణువులుగా మార్చడంలో ఎంజైమ్స్‌ చేయడంతో పాటుగా అవి త్వరగా కరిగేందుకు సైతం తోడ్పడతాయి. వేడి నీళ్లు లేదంటే బయోలాజికల్‌ లాండ్రీ డిటర్జెంట్‌ను వీలైనంత త్వరగా వాడటం వల్ల ఈ మరకలను తొలగించడం సులభ సాధ్యమవుతుంది.
2. ఆక్సిడైజబల్‌ మరకలు. ఈ మరకలు టీ, కాఫీ లేదా రెడ్‌ వైన్‌ పడటం వల్ల కలుగుతాయి. వీటిని ఆక్సిడైజబల్‌ మరకలుగా పేర్కొంటారు. సాధారణంగా బ్లీచ్‌ ఆధారిత ఉత్పత్తులలో లభ్యమవుతాయిఆక్సిడైజింగ్‌ ఏజెంట్లు వినియోగించి , మరకలను తొలగించడం  అతి చక్కటి విధానం.  ఈ ఆక్సిడైజబల్‌ ఏజెంట్లు రంగు మరకలను రంగు లేని రీతిలో మారుస్తుంది. బ్లీచ్‌ ఆధారిత ఉత్పత్తులను ఓపికగా మరియు పొదుపుగా వాడటం వల్ల  మీ పరుపులో మరకలతో పాటుగా డైస్‌లలో తిరిగి పొందలేనటువంటి రంగులను కలిగిస్తాయి. (Story: పరుపును క్లీన్ చేయడం ఎలా?)

అమరావతే రాజధాని!

0
Amravati AP Capital
Amravati AP Capital

అమరావతే రాజధాని!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని దాదాపుగా తేలిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా అమరావతిని గుర్తించింది. ఇటువైపు హైకోర్టు కూడా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో అమరావతి ఉద్యమకారుల్లో ఒక్కసారిగా ఉత్సాహం రేకెత్తింది. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. 24 గంటల వ్యవధిలో అమరావతికి అనుకూలంగా జరిగిన పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. గురువారంనాడు ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోర్టు తేల్చిచెప్పింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని, దానికి అనుగుణంగానే నిర్మాణం పూర్తికావాలని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెల్సిందే. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం(యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనతో వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 75 కేసుల్లో వేర్వేరుగా త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించినట్లయింది.
ఇతర అవసరాలకు అమరావతి భూములు తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు చెప్పడం కీలకంగా మారింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పైగా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించవద్దని కూడా క్లియర్‌గా చెప్పింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలని కోర్టు పేర్కొంది. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని కూడా తేల్చిచెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా పేర్కొంది. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇదిలావుండగా, ఏపీ రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. బడ్జెట్‌లో అంచనా వ్యయం కింద అమరావతికి నిధులను ప్రతిపాదించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేవలం లక్ష రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. ఈ లక్ష రూపాయలతో అమరావతి రాజధాని పూర్తికాదని అందరికీ తెలుసు. కాకపోతే ఈ నిధుల కేటాయింపును బట్టి కేంద్రం కూడా అమరావతినే రాజధానిగా గుర్తించినట్లు స్పష్టమవుతున్నది. సచివాలయ నిర్మాణానికి రూ. 1,214 కోట్లు, ఉద్యోగుల నివాస గృహాలకు రూ.1,126 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ అంచనాల్లో స్పష్టం చేసింది. జీపీవోఏకి భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. 2020`21, 2021`22 బడ్జెట్‌లలో మొత్తం రూ.4.48 కోట్లను కేంద్రం ఖర్చుచేసినట్లు వివరించింది. అలాగే 300 ఏజీస్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఏదేమైనప్పటికీ, అమరావతికి మంచిరోజులు వచ్చినట్లేనని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. (Story: అమరావతే రాజధాని!)

See Also: ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై

 I love doing different characters

Photo Gallery

error: Content is protected !!