UA-35385725-1 UA-35385725-1

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

47 కిలోల భారీ కణితిని తొలగించడం ద్వారా మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

– భారతదేశంలో ఇప్పటివరకు విజయవంతంగా తొలగించబడిన అతిపెద్ద నాన్‌-ఓవేరియన్‌ ట్యూమర్‌ ఇదే

– మహిళ గత 18 సంవత్సరాలుగా కణితితో బాధపడుతున్నది

Doctors give new lease of life to woman : అహ్మదాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన వైద్య బృందం 56 ఏళ్ల మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి 47 కిలోల భారీ కణితిని తొలగించడం ద్వారా ఆమెకు సరికొత్త జీవితాన్ని అందించింది – ఇది ఇప్పటివరకు భారతదేశంలో విజయవంతంగా తొలగించబడినటువంటి అతిపెద్ద అండాశయ కణితి కావడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దేవ్‌గఢ్‌ బరియా నివాసి అయిన ఈ మహిళ 18 సంవత్సరాలుగా ఈ కణితితో బాధపడుతున్నది మరియు గత కొన్ని నెలలుగా ఆమె మంచానికే పరిమితం అయ్యింది.

చీఫ్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ చిరాగ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని నలుగురు సర్జన్లతో సహా ఎనిమిది మంది వైద్యుల బృందం శస్త్రచికిత్స సమయంలో ఆమెకున్న కణితితో పాటు కడుపులోని గోడ కణజాలం మరియు 7 కిలోల బరువున్న అదనపు చర్మాన్ని కూడా తొలగించింది. శస్త్రచికిత్స తర్వాత మహిళ శరీర బరువు 49 కిలోలకు పడిపోయింది. ఆమె నిటారుగా నిలబడలేకపోవడంతో శస్త్రచికిత్సకు ముందు ఆమె యొక్క శరీర బరువును లెక్కించలేదు.

‘‘కడుపు గోడలో కణితి సృష్టించిన ఒత్తిడి కారణంగా మహిళ యొక్క అంతర్గత అవయవాలైనటువంటి కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు గర్భాశయం స్థానభ్రంశం కావడం వలన, దీనిని చాలా ప్రమాదకరమైన శస్త్రచికిత్సగా చెప్పవచ్చు. కణితి యొక్క పరిమాణం సి.టి. స్కాన్‌ యంత్రం యొక్క గ్యాంట్రీ (వంతెనలాంటి ద్వారం)ను కూడా అడ్డుకోవడంతో సి.టి. స్కాన్‌ చేయడం కూడా కష్టంగా మారింది.’’ అని డాక్టర్‌ దేశాయ్‌ చెప్పారు.

రక్తనాళాలు బిగుసుకుపోవడం వల్ల మహిళ రక్తపోటులో మార్పు వచ్చిందని, కణితిని తొలగించిన తర్వాత రక్తపోటు తగ్గడం వల్ల ఆమె కుప్పకూలిపోకుండా శస్త్రచికిత్సకు ముందే ఆమెకు ప్రత్యేక చికిత్సను మరియు మందులను అందించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

వైద్య బృందంలో భాగంగా ఉన్న అంకో-సర్జన్‌ డాక్టర్‌ నితిన్‌ సింఘాల్‌ మాట్లాడుతూ, ‘‘మహిళలకు తమ పునరుత్పత్తి వయస్సులో వారిలో ఫైబ్రాయిడ్లు ఏర్పడడం అనేది సాధారణమే, కానీ చాలా అరుదుగా మాత్రమే అది పెద్దదిగా పెరుగుతుందని’’ ఆయన అన్నారు. శస్త్రచికత్సలో కీలక పాత్ర పోషించిన వైద్యబృందంలో అనెస్తీయస్ట్‌ డాక్టర్‌ అంకిత్‌ చౌహాన్‌, జనరల్‌ సర్జన్‌-డాక్టర్‌ స్వాతి ఉపాధ్యాయ్‌ మరియు  క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ జే కొఠారిలు కూడా ఉన్నారు.

మహిళకు ఈ సమస్య 18 సంవత్సరాల క్రితం ఉదర ప్రాంతంలో అసాధారణ బరువు పెరగడంతో ప్రారంభమైంది. ప్రారంభంలో, ఆమె ఆయుర్వేద చికిత్సను తీసుకుంది, కానీ చికిత్స ఫలించలేదు. 2004లో, ఆమె సోనోగ్రఫీ చేయించుకుంది, ఇది ఒక నిరపాయమైన కణితి అని వైద్య పరీక్షలో తేలింది మరియు కుటుంబం శస్త్రచికిత్స చేయించాలనే ఆప్షన్‌ను ఎంచుకుంది. అయితే, డాక్టర్లు శస్త్రచికిత్సను ప్రారంభించినప్పుడు, కణితి అంతర్గత అవయవాలతో కలిసి పోయిందని తేలింది. ఇందులో ఉన్న ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు శస్త్రచికిత్సను పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపివేసి ఆమెకు కుట్లువేశారు.

అప్పటి నుండి, ఆ మహిళ యొక్క కుటుంబం అనేక మంది వైద్యులను సంప్రదించింది, కానీ ఫలించలేదు. ఈ సమయంలో, కడుపులోని కణితి యొక్క పరిమాణం పెరుగుతూనే ఉన్నది మరియు గత రెండు సంవత్సరాలలో, ఆమె దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేసే పరిమాణంలో దాదాపు రెండిరతలుగా కణితి పెరిగింది. చివరికి, కుటుంబం అపోలో హాస్పిటల్స్‌ను సంప్రదించింది, అక్కడ వైద్యులు, కేసును క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత, జనవరి 27న శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతర సంరక్షణ మరియు పునరావాసం తర్వాత, మహిళ ఫిబ్రవరి 14న హాస్పిటల్‌ నుండి ఆమె డిశ్చార్జ్‌ చేయబడింది. (Story: మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు)

See Also: డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1