Home Blog Page 957

దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

0
The Ghost
The Ghost

దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందుతోన్న `ది ఘోస్ట్` భారీ షెడ్యూల్ దుబాయ్లో ప్రారంభం

దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌! కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల హై బడ్జెట్  యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` షూటింగ్ దుబాయ్ లో తిరిగి ప్రారంభమైంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. సినిమాలోని ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ లో నాగార్జున సరసన కథానాయిక గా నటించడానికి ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా బృందం తో జాయిన్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ను కూడా టీమ్ ఆవిష్కరించింది.

నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్లు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో భాగం కావడం ఆనందం గా ఉంది. ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ పాత్రలో నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రం లో ప్రధాన తారాగణం. ముఖేష్ జి కెమెరా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ స్టంట్ డైరెక్టర్లు.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
యాక్షన్: రాబిన్ సుబ్బు మరియు నభా మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
PRO: వంశీ-శేఖర్, BA రాజు (Story: దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!)

Pushpa becomes an iconic movie!

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’

0
Puneeth Raj Kumar James Movie
Puneeth Raj Kumar James Movie

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’

పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజున గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ‘జేమ్స్’

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’ : కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డే‌కి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్‌ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మార్చి 17న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని.. హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.

పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్,
సంగీతం: చరణ్ రాజ్,
సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ,
ఆర్ట్: రవి శాంతేహైక్లు,
పీఆర్వో: బి. వీరబాబు
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్,
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
దర్శకత్వం: చేతన్ కుమార్. (Story: పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’)

See Also: Do You Know About Koo Innovative Features

Bacardi’s Good Man Brandy Out Now

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!

0
69 Samskar Colony
69 Samskar Colony

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగే ఉద్వేగభరితమైన ప్రేమ కథ #69 సంస్కార్ కాలనీ చిత్రం – సునీల్ కుమార్ రెడ్డి

సమాజంలో జరిగే విషయాలు వాటి సమస్యలు ప్రధాన కథగా తీసుకుని ఒక అందమైన కథనం తో మంచి చిత్రాలు అందించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. ఆయన గతంలో తీసిన వలస, గల్ఫ్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందితే రొమాంటిక్ ఇతివృత్తాలు తీసినప్పుడు ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. ఇప్పుడు #69 సంస్కార్ కాలనీ పేరుతో మరో కథా చిత్రం తో మార్చి 18న మన ముందుకు వస్తున్నారు. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “#69 సంస్కార్ కాలనీ . ఈ చిత్రం మార్చి 18న విడుదల కు సిద్ధంగా ఉంది.

చిత్ర వివరాలు తెలియజేస్తూ “సినిమా చాలా బలమైన మీడియం. సమాజంలో జరుగుతున్న విషయాలను మంచి కథనం తో చెప్తే ప్రేక్షకులకు బాగా అర్థం అవుతుంది. రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులు అయిన ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమా ఆ సంకల్పంతో చేసినవే. ఈ #69 సంస్కార్ కాలనీ చిత్రం కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. సంస్కార్ కాలనీ చిత్రం ఆడవాళ్ళ సున్నిత మానసిక చిత్రంగా చూపించే ఒక సినిమా అందుకే స్వాతి అనే అమ్మాయి ని మా స్టోరీ డిపార్ట్మెంట్ లోకి తీసుకున్నాము.

ఈ చిత్రం మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల గురించి , సమాజంలో జరుగుతున్న వింత పోకడలు గురించి చెప్పే సినిమా.  ఇందులో ఒక టీనేజ్ కుర్రాడికి  ఒక పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన ప్రేమ కథ. దానికి అనుకూలించిన కారణాలు వాటి వల్ల వస్తున్న సమస్యల గురించి చెప్పేదే ఈ సినిమా.

ఇలాంటి కథలు వచ్చాయి కానీ కొత్త కోణం లో చూపించాము. ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించని విషయాలను ఈ చిత్రంలో చుపించాము. కొన్ని విషయాలను ఓపెన్ గానే బలంగా చెప్పాను.

నా చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చింది. పరిణతి చె౦దిన ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది .

అజయ్ గారు భర్త పాత్ర చేశారు. ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఆయన పాత్రకి బాగా న్యాయం చేశారు. ప్రేక్షకులకి అజయ్ గారి పాత్ర బాగా నచ్చుతుంది.

కథ కథనం పూర్తి అయిన తర్వాత ఎస్తర్ గారిని కలిసాను. ఆడిషన్ చేశారు, తాను క్యారెక్టర్ కి బాగా సరిపోతుంది అని తనని మేము తీసుకున్నాము. ఎస్తర్ గారు కూడా కథ విని కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు.

మా నిర్మాత బాపి రాజు గారు నాకు మంచి స్నేహితుడు. బాపి రాజు 17 ఎళ్లగా నా చిత్రాలను డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేశారు. తర్వాత నిర్మాతగా రొమాంటిక్ క్రిమినల్స్ మరియు ఈ సంస్కార్ కాలనీ చిత్రాలు నిర్మించారు. నాతో పని చేసే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గా కలిసిపోతున్నారు. ప్లాప్ వచ్చినా సక్సెస్ వచ్చినా కలిసే ఉన్నారు. ప్రతి సినిమా కి సహాయం గా ఉన్నారు.

ఈ చిత్రం తర్వాత చదలవాడ శ్రీనివాస్ రావు గారు నిర్మాతగా మా నాన్న నక్సలైట్ అనే చిత్రం చేస్తున్నాను. 1995 బ్యాక్ డ్రాప్ లో సాగే తండ్రి కొడుకుల సినిమా. తర్వాత డాక్టర్ ఎల్ ఎన్ రావు, యక్కలి  రవీంద్ర బాబు నిర్మించిన వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం జూలైలో విడుదల చేస్తున్నాము. (Story: టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!)

See Also: Do You Know About Koo Innovative Features

Bacardi’s Good Man Brandy Out Now

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.సోమసుందర్ ఎన్నిక

0
D.Somasundar
D.Somasundar

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.సోమసుందర్ ఎన్నిక

సీనియర్ పాత్రికేయుడు, ఐ.జే.యూ. జాతీయకార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

గుంటూరులో జరిగిన ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర 17 వ మహాసభల ముగింపు సందర్భంగా మార్చ్ 8 వ తేదీ రాత్రి
నూతనకార్యవర్గ ఎన్నికలు జరిగాయి.

21 మంది ఆఫీస్ బేరర్స్ ,61 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు!

రాష్ట్రకమిటీలోని ఎనిమిది మంది ఉపాధ్యక్షులలో ఒకరిగా డి.సోమసుందర్ ఎన్నికయ్యారు.

పాత్రికేయునిగా ,సామాజికకార్యకర్త గా చిరపరిచితులైన
డి.సోమసుందర్ కు 1980 వ దశకం నుంచి కార్మికోద్యమంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి!

తాడేపల్లిగూడెం ప్రాంతంలోని 12 కార్మికసంఘాలకు సోమసుందర్ ప్రత్యక్షంగా సారథ్యం వహిస్తున్నారు!

వేతనఒప్పందాలు చేయడంలో , కార్మికసమస్యల పరిష్కారంలో ఎంతో అనుభవం ఉన్న సోమసుందర్ కార్మిక సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎన్నో సృజనాత్మక ఆలోచనలను ఆచరణలోకి తెచ్చారు!

1999 నుండి ఏ.ఐ.టి.యు.సి. తాడేపల్లిగూడెం ఏరియాకమిటీ ప్రధానకార్యదర్శిగా , 2010 నుండి ఏరియాకమిటీ అధ్యక్షునిగా, 2019 నుండి పశ్చిమగోదావరి జిల్లా శాఖ గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు!

మార్చ్ 6,7,8, తేదీల్లో గుంటూరులో జరిగిన రాష్ట్రమహాసభలో డి. సోమసుందర్ రాష్ట్ర బాధ్యతలకు ఎన్నికయ్యారు!

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కార్మికనాయకుడు రేకా భాస్కరరావు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు!

జిల్లానుండి సీనియర్ కార్మికనేతలు నెక్కంటి సుబ్బారావు, కోనాల భీమారావు, కెల్లా అప్పారావు ,తాడికొండ శ్రీనివాసరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు!

విశాలాంధ్ర దినపత్రికలో 1975 నుండి మూడుదశాబ్దాల పాటు విలేఖరిగా పనిచేసిన డి. సోమసుందర్ ప్రస్తుతం “జనబలం” మాసపత్రిక వర్కింగ్ ఎడిటర్ గా ,”జాతీయస్ఫూర్తి” సంపాదకవర్గ సభ్యుని గా కొనసాగుతున్నారు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర అధ్యక్షునిగా మూడుసార్లు ఎన్నికైన డి.సోమసుందర్ , ప్రస్తుతం ఐ.జే.యు. జాతీయకార్యవర్గ సభ్యునిగా వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నారు! (Story: ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.సోమసుందర్ ఎన్నిక)

See Also: తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

చిన్న ప‌త్రిక‌లే శాంతి క‌పోతాలు : కె.శ్రీ‌నివాస్‌రెడ్డి

ఏప్రిల్ 22న `కృష్ణ వ్రింద విహారి`

0
Krishna Vrinda Vihari
Krishna Vrinda Vihari

నాగ శౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ చిత్రం `కృష్ణ వ్రింద విహారి` ఏప్రిల్ 22న విడుదల

వైవిధ్యమైన సబ్జెక్ట్లతో విభిన్న పాత్రలు పోషిస్తున్న అందమైన నటుడు నాగ శౌర్య. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బేనర్లో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రామ్-కామ్ చిత్రంలో నటిస్తున్నాడు.

సోమవారం నాడు సినిమా విడుదల తేదీని మేకర్స్  ప్రకటించారు. కృష్ణ వ్రింద విహారి వేసవి కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదల తేదీని ప్రకటించిన పోస్టర్లో నాగ శౌర్య, చిత్ర నాయిక షిర్లీ సెటియా స్కూటర్ పై వెళుతున్నట్లు కనిపిస్తోంది. శౌర్య,  షిర్లీ సెటియా ఇద్దరూ సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగా ఉన్నారు. పోస్టర్ని బట్టి చూస్తే, సినిమాలో వీరిద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీ ని పంచుకున్నట్లు కనిపిస్తోంది.

గతంలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

తొలిసారిగా నాగ శౌర్య ఈ చిత్రంలో ఇటువంటి పాత్రను పోషిస్తున్నాడు. ఇంతకుముందు  సినిమాలలో అతని పాత్రలకు భిన్నంగా,  వినోదభరితమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

స్టార్ కమెడియన్లు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య నటించడం వల్ల ఈ సినిమా హాస్యభరితంగా ఉంటుందని అర్థం అవుతోంది.

తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: అనీష్ ఆర్ కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పకులు : శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్
DOP: సాయి శ్రీరామ్
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ – రామ్కుమార్
డిజిటల్ హెడ్: M.N.S.గౌతమ్
PRO: వంశీ శేఖర్ (Story: ఏప్రిల్ 22న `కృష్ణ వ్రింద విహారి`)

See Also: సూర్య `ఇ టీ` ట్రైలర్‌ విడుదల

See Also: మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన

ఓటీటీలో రౌడీబాయ్స్ వ‌చ్చేసింది!

0
Rowdy Boys
Rowdy Boys

ఓటీటీలో రౌడీబాయ్స్ వ‌చ్చేసింది!

మార్చి 11నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవ్వబోతున్న యూత్ ఫుల్ లవ్ స్టొరీ  “రౌడీ బాయ్స్”

‘ZEE 5 … ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో… అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ‘ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న  థియేటర్లలో విడుదలై యూత్ లో మంచి క్రెజ్ ను సంపాదించుకొని బస్టర్ మూవీ గా నిలిచిన సినిమా “రౌడి బాయ్స్”.ఈ సినిమా మార్చి 11 నుండి’. ZEE5 లో స్ట్రీమ్ అవ్వబోతోంది. ZEE5ని సబ్‌స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే ZEE5ని డౌన్‌లోడ్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి

దిల్ రాజు,శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీ కు ప‌రిచ‌యం అయిన ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు) హీరోగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్ గా నటించిన సినిమా ‘రౌడి బాయ్స్’. ‘శ్రీహ‌ర్ష కొనుగంటి  దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది ‘ZEE 5’. మార్చి 11 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ZEE 5 లో ప్రతినెలా సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజ్‌ చేస్తూ..  ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ZEE 5 లో విడుదలైన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ”, “లూజర్”, “లూజర్ 2”, హీరో సుమంత్ “మళ్లీ మొదలైంది”, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ల “బంగార్రాజు” వంటివి మా ZEE 5 లో విడుదలై పెద్ద విజయం సాధించాయి.వీటి ద్వారా ప్రేక్షకులకు ZEE 5 ఎంతో దగ్గరైంది. అలాగే  చాలా రోజుల తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ “రౌడి బాయ్స్”  ఔట్ అండ్ ఔట్ కాలేజ్ సినిమా. యూత్ అందరు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు , హాయిగా మీ కుటుంబ సభ్యులతో & స్నేహితులు అందరితో కలిసి ఈ సినిమా ని మార్చి 11 నుండి ZEE5 లో ఎంజాయ్ చేయండి. (Story: ఓటీటీలో రౌడీబాయ్స్ వ‌చ్చేసింది!)

See Also: మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన

షకలక శంకర్ ‘దళారి’ టైటిల్ లోగో

0
Dalari
Dalari

షకలక శంకర్ ‘దళారి’ టైటిల్ లోగో

షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రదారులుగా
‘దళారి’ టైటిల్ లోగో విడుదల  

ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దళారి’. షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ – ఎమోషనల్ యాక్షన్ డ్రామా టాకీ పార్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ వేడుకలో నటులు శ్రీ తేజ్, షకలక శంకర్, శ్రీ తేజ్, దర్శకుడు గోపాల్ రెడ్డి, నిర్మాతలు సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దళారి’ సినిమాను వేగవంతంగా పూర్తి చేసుకున్నాం. దానికి సహకరించిన నిర్మాతలు వెంకట్ రెడ్డి గారికి సురేష్ కొండేటి గారికి గుండె లోతుల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్ని విధాలుగా సహకరించిన శంకర్ గారు, శ్రీ తేజ్ గారు అలాగే మిగతా అందరు టెక్నీషియన్స్ సహా పూర్తి స్థాయిలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా వంతుగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశామని ఆయన అన్నారు.

షకలక శంకర్ మాట్లాడుతూ సురేష్ కొండేటి గారు వెంకట్ రెడ్డి గారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారని, దర్శకుడు గోపాల్ రెడ్డి అద్భుతంగా సినిమా తెరకెక్కించారు అని అన్నారు. నటుడు శ్రీ తేజ్ కూడా ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారని, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల సినిమా మొత్తానికి ఒక కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది అని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మరోసారి ముందుకు వస్తానని శంకర్ పేర్కొన్నారు.

నటుడు శ్రీతేజ్ మాట్లాడుతూ ఇప్పటికే టాకీ పార్ట్ అంతా పూర్తయిందని, డైరెక్షన్ పరంగా గోపాల్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తెరకెక్కించారని అన్నారు. స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అవసరమైతే రాత్రి దాటాక కూడా స్క్రీన్ ప్లే కరెక్షన్స్ చేసుకుంటూ చాలా పకడ్బందీగా షూటింగ్ చేశారని అన్నారు. ఇది ఒక సోషల్ కాజ్ తో ఉన్న అమేజింగ్ థ్రిల్లర్ అని శ్రీతేజ్ వెల్లడించారు. ఫస్ట్ కాపీ వచ్చాక మరోసారి మీ ముందుకు వస్తామని అన్నారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని వారికి ముందుగానే శుభాకాంక్షలు అని అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘శంభో శంకర’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మరోసారి షకలక శంకర్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు రాని పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అన్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనిపించిందని ఆయన అన్నారు.  అందుకే ఈ సినిమాలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశానని అన్నారు. ఈ సినిమాకు తనతో పాటు నిర్మాతగా వ్యవహరించిన వెంకట్ రెడ్డి గారు మంచి అభిరుచి కలిగిన నిర్మాత అని, ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు కావాలని అన్నారు.  రాజీవ్ కనకాల మరియు  శ్రీ తేజ్ పాత్రలు కూడా ఈ సినిమాలో కీలకంగా ఉంటాయని శంకర్ శంభో శంకర కంటే ఈ సినిమా చూసిన తర్వాత  మాస్ ఎలిమెంట్స్ సస్పెన్స్ యాక్షన్ అన్ని కలగలిపిన సినిమా అని సురేష్ కొండేటి పేర్కొన్నారు.

నిర్మాత ఎడవెల్లి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సురేష్ కొండేటి గారితో కలిసి సినిమా చేయడం శుభ పరిణామమని అన్నారు. శంకర్, రాజీవ్ కనకాల, శ్రీతేజ్, పృథ్వి, గారు జబర్దస్త్ ఆర్టిస్టులు, గబ్బర్ సింగ్ టీం ఇలా దాదాపు 40 మంది ఆర్టిస్టులతో ‘దళారి’ సినిమా చేయడం జరిగిందని అన్నారు. కంటెంట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశామని సినిమాను కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఓవర్ టైం పని చేసి సినిమా పూర్తి చేసేందుకు సహకరించారని వాళ్లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
నిర్మాతలు : సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి, బ్యానర్: ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్, సినిమాటోగ్రఫీ : మెంటెం సతీష్, ఎడిటింగ్ : నందమూరి హరి, సంగీతం :  గౌరహరి, రచన, దర్శకత్వం :గోపాల్ రెడ్డి, (Story: షకలక శంకర్ ‘దళారి’ టైటిల్ లోగో)

See Also: మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన

హీరో చైతన్య రావు-డైరక్టర్ చందు ముద్దు కొత్త చిత్రం

0
Chaitanya Rao
Chaitanya Rao New Movie

హీరో చైతన్య రావు-డైరక్టర్ చందు ముద్దు కొత్త చిత్రం

హీరో చైతన్య రావు-డైరక్టర్ చందు ముద్దు- నిర్మాత యశ్ రంగినేని కలయికలో
కొత్త చిత్రం.

పెళ్లి చూపులు”, “డియర్ కామ్రేడ్”, “దొరసాని”, “ఏబీసీడీ” వంటి పలు సూపర్
హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్, భారత జాతీయ
అవార్డు గ్రహింపుతో మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థగా గుర్తింపు
తెచ్చుకుంది. కొత్త తరహా చిత్రాలతో, కొత్త దర్శకులకు అవకాశమిస్తూ
సినిమా మీద తనకున్న ప్యాషన్ చూపిస్తున్నారు నిర్మాత యశ్  రంగినేని.

ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా “భాగ్ సాలే” అనే చిత్రాన్ని సురేష్
ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సంస్థ మరో కొత్త చిత్రాన్ని
నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇది బిగ్ బెన్ సినిమాస్ సోలో
ప్రాజెక్ట్ గా నిర్మితం కానుంది.

ఈ చిత్రంలో “30 వెడ్స్ 21” ఫేమ్ చైతన్య రావ్ మాధాడి హీరోగా  “ఓ పిట్ట కథ”
చిత్ర దర్శకుడు చెందు  ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ  కామెడీ ఎంటర్ టైనర్ గా ఒక
విల్లేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుంది . త్వరలో ఈ చిత్రాన్ని
లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

ఈ సినిమాలో నటించే నటీనటులు మరియు మిగతా సాంకేతిక నిపుణుల వివరాలను
త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. (Story: హీరో చైతన్య రావు-డైరక్టర్ చందు ముద్దు కొత్త చిత్రం)

See Also: మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన

విశ్వక్ సేన్  `దాస్ కా ధమ్కీ` షురూ!

0
Das Ka Dhumki
Das Ka Dhumki

విశ్వక్ సేన్  `దాస్ కా ధమ్కీ` షురూ!

విశ్వక్ సేన్  హీరో గా నటిస్తున్న `దాస్ కా ధమ్కీ` చిత్రం ప్రారంభం

విశ్వక్ సేన్  `దాస్ కా ధమ్కీ` షురూ! ఫలక్నుమా దాస్, పాగల్, హిట్  ,చిత్రాల హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం `దాస్ కా ధమ్కీ` బుధవారం నాడు ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో ఆహ్లాదకరమైన వాతావరణం లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్ పై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. `ఎఫ్3` దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా స్క్రిప్ట్ను నిర్మాత, దర్శకుడి కి రచయిత ప్రసన్నకుమార్ అందజేశారు. అనంతరం అల్లు అరవింద్ టైటిల్ లోగో ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, యంగ్ హీరోలలో నా కిష్టమైన వారిలో విశ్వక్ ఒకరు. విశ్వక్ తొలి సినిమా నుంచి పరిశీలిస్తున్నాను. సంతోషం వచ్చినా ఏది వచ్చినా తట్టుకోలేడు. ఈ సినిమా మంచి విజయాన్ని చేకూర్చాలి. నివేత పేతురాజ్ కూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. `ధమ్కీ` టైటిల్కు తగినట్లే కథ వుంటుందనీ, అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాని అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ, హీరోగా విశ్వక్ సేన్ స్వంత నిర్మాణం లో చేస్తున్న రెండో సినిమా ఇది. దాస్ కా ధమ్కీ అనేది చాలా బాగుంది. రచయిత ప్రసన్నకుమార్ నాకు దిల్రాజు గారి సినిమాల కు పనిచేసినప్పటి నుంచీ తెలుసు. మంచి స్క్రీన్ ప్లే రచయిత. పాగల్ దర్శకుడు నరేశ్ చేస్తున్న రెండవ సినిమా ఇది. విశ్వక్సేన్ మంచి స్నేహితుడు. మంచి విజయం చేకూరాలని ఆశిస్తున్నానని తెలిపారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, సినిమా రంగంలో పోటీ వున్నా ప్రేక్షకులు నన్ను గుర్తించి విజయాలు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ కోసం వెతుకుతూ తిరిగే స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగే స్థాయికి వచ్చేలా చేశారు. ఈ సినిమాకు అన్ని వనరులు సమకూరాయి. మంచి టీమ్ దొరికింది. మంచి సినిమాలనే నేను తీస్తాను. మాస్ అప్పీల్ వుండే సినిమా ఇది. థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఊగిపోయేలా వుండే కథ ఇది. కృష్ణదాస్గాడి జీవితంలో జరిగే కథే ఈ సినిమా. ఈనెల 14నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు.

హీరోయిన్ నివేత పేతురాజ్ మాట్లాడుతూ, విశ్వక్ సేన్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా వుంది. కథ చాలా ఆసక్తిగా వుంది. అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించానని అన్నారు.

చిత్ర నిర్మాత కరాటే రాజు వ్యాఖ్యానిస్తూ, ఫలక్నుమా దాస్ చిత్రం తర్వాత సేమ్ టీమ్తో చేస్తున్న సినిమా ఇది. మా బేనర్లో మంచి వినోదాత్మకమైన సినిమాలను తీయాలనే ప్రయత్నిస్తున్నామని అన్నారు.

`ఈ సినిమా మంచి కథాంశంతో రూపొందుతోందనీ, అందరికీ ఈ చిత్రం మంచి పేరు తేవాలని` రచయిత ప్రసన్నకుమార్ ఆకాంక్షించారు.
చిత్ర దర్శకుడు నరేశ్ కుప్పిలి తెలుపుతూ, పాగల్ సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రచయిత ప్రసన్న ఈ సినిమాకు ఎసెట్. లియో బాణీ లు చక్కగా వచ్చాయని` తెలిపారు.

`ఈ సినిమాకు మంచి పాటలు కూడా కుదిరాయనీ, సంగీతం బాగా అమరిందని, పాగల్ తర్వాత చేస్తున్న చిత్రమిదని` సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ పేర్కొన్నారు. `విశ్వక్ హీరోగా మరింత పై స్థాయికి ఎదగాలని` చిన్న శ్రీశైలం యాదవ్ ఆకాంక్షించారు.
రంగస్థలం మహేష్ మాట్లాడుతూ, నరేశ్ ప్రతిభగల దర్శకుడు. చాలా కాలం నుంచి తెలుసు. పాగల్ తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు రచయిత ప్రసన్నకుమార్ తో పాటు అందరూ మంచి టీమ్ కుదిరిందని తెలిపారు.
నటీనటులు- విశ్వక్ సేన్, నివేత పేతురాజ్
సాంకేతిక సిబ్బంది-
నిర్మాతః కరాటే రాజు,
దర్శకత్వం : నరేశ్ కుప్పిలి,
రచయితః ప్రసన్నకుమార్ బెజవాడ,
కెమెరాః దినేష్ కె.బాబు,
సంగీతం: లియోన్ జేమ్స్,
ఎడిటర్ః అన్వర్ అలీ,
ఆర్ట్ః ఎ. రామాంజనేయులు,
పి.ఆర్.ఓ. వంశీ, శేఖర్,
పబ్లిసిటీ డిజైనర్ః పద క్యాసెట్ట్ (Story: విశ్వక్ సేన్  `దాస్ కా ధమ్కీ` షురూ!)

See Also: మార్కెట్‌లోకి కొత్త బ్రాందీ గుడ్‌మ్యాన్‌!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

మహిళకు నూతన జీవితాన్ని అందించిన వైద్యులు

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌కు భారీ స్పందన

విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’

0
HATYA
HATYA

విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’

ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ నిర్మాణంలో విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’

విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’ : డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న
తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ‘హత్య’ తో తెలుగు ప్రేక్షకుల
ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ
చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య
అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి
ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా,
జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ
దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు
కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన
నేపథ్యంగా ‘హత్య’  సినిమా సాగనుంది. అందమైన మోడల్ లీల తన ఇంట్లో హత్యకు
గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు అనేది మిస్టరీగా మారుతుంది.
డిటెక్టివ్, పోలీస్ కోణంలో ఈ కేసు ఛేదనలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది.
ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ,
సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు
నటిస్తున్నారు.

ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’
అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో ‘హత్య’ సినిమా
నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు.
శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్
బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం
సమకూరుస్తున్నారు. (Story: విజయ్ ఆంటోనీ హీరోగా ‘హత్య’)

See Also: మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!

Bheemla Nayak creates a wild storm

‘రాధే శ్యామ్’ రిలీజ్ ట్రైలర్

Photo Gallery

error: Content is protected !!