Home Blog

స్ఫూర్తిని ర‌గిలించిన స‌న్మానం

0

స్ఫూర్తిని ర‌గిలించిన స‌న్మానం

శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ దస్తగిరి రెడ్డిని సన్మానించిన స్పిరిట్ మూవీ నరసమ్మ

న్యూస్‌తెలుగు/నంద్యాల: స్పిరిట్ మూవీ నరసమ్మ తనయుడు శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నుంచి రూరల్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించాడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి.దస్తగిరి రెడ్డిని వారు హృదయపూర్వకంగా సత్కరించారు. కోచింగ్ సెంట‌ర్ విద్యార్థుల హ‌ర్ష‌ధ్వానాల న‌డుమ న‌ర‌స‌మ్మ‌, ఆయ‌న కుమారుడు, ద‌స్త‌గిరి చేసిన ప్ర‌సంగాలు స్ఫూర్తిని ర‌గిలించాయి. కాగా, నరసమ్మ తనయుడికి ఉద్యోగం రావటంతో నరసమ్మ త‌న‌ స్పిరిట్ చిత్రం (స్పిరిట్‌-ఇట్స్ నాట్ వ‌న్‌) నుంచి ఒక పాటని పి.దస్తగిరి రెడ్డి చేతుల మీదుగా శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో విడుద‌ల చేస్తామని ప్ర‌క‌టించారు. ఈ చిత్ర‌ నిర్మాత నరసమ్మ కావ‌డం విశేషం. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె భ‌ర్త వెంక‌టేశ్వ‌ర్లు కూడా పాల్గొన్నారు. (Story: స్ఫూర్తిని ర‌గిలించిన స‌న్మానం)

దర్గాను దర్శించుకున్న చిన్న శ్రీను, బేబీ నాయిన‌

0

దర్గాను దర్శించుకున్న చిన్న శ్రీను, బేబీ నాయిన‌

న్యూస్‌తెలుగు/విజయనగరం: హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా వారి 66 వ ఉరుసు మహోత్సవంలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ను సందర్శించి తమ భక్తి భావనను చాటుకున్నారు. ఉరుసు ప్రారంభం రోజున రాష్ట్ర ఎంఎస్ఎంఈ, పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు సాయంత్రం బాబామెట్టలోని ఖాదర్ బాబా దర్గా, దర్బార్ ను సందర్శించారు. ఆది, సోమవారాల్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు(చిన్న శ్రీను) ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, బొబ్బిలి రాజా బేబీ నాయినా, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డివిజీ శంకర్ రావు, జనసేన యువ నాయకులు అవనాపు విక్రమ్, గురానా అయ్యలు, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ, డీఎస్పీ చక్రవర్తి, చీపురుపల్లి వైసిపి నేత వలిరెడ్డి శ్రీను, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కాళ్ళ గౌరీశంకర్ తదితరులు ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. వీరికి చీమలపాడు దర్గా సూఫీ పీఠాధిపతి సజ్జదా నషీన్ మొహమ్మద్ ఖాజా మొహియుద్దీన్, విజయనగరం దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబు దర్బార్ సంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో, ఫకీరు కవ్వాళీ నడుమ సాదర స్వాగతం పలికారు. ఖాదర్ బాబా దర్శనం అనంతరం భారీ లంగర్ ఖానాలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఉత్సవాలకు విచ్చేసిన అతిథులు తమ చేతుల మీదుగా ప్రారంభించి, భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. సోమవారం నిర్వహించిన కుల్, సలాంతో జాతీయ సమైక్యతను చాటే హజరత్ ఖాదర్ బాబా వారి 66 వ ఉరుసు సుగంధ మహోత్సవాలు ముగిశాయి. (Story: దర్గాను దర్శించుకున్న చిన్న శ్రీను, బేబీ నాయిన‌)

మన్యం బంద్‌కు అనుమతుల్లేవ్‌

0

మన్యం బంద్‌కు అనుమతుల్లేవ్‌

చింతూరు(న్యూస్ తెలుగు): చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో 11, 12 తేదీల్లో తల పెట్టిన బంద్ కు ఎటువంటి అనుమతులు లేవని చింతూరు ఎస్ఐ రమేష్ ఒక తెలిపారు. ఎం.ఎల్.సి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి అనుమతులు ఇవ్వబడవని తెలిపారు. ఇందుకు భిన్నంగా బలవంతంగా షాపులు మూయించడం, రోడ్డు పూర్తిగా మూసివేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దగ్ధం చేయటం నేరమని పేర్కొన్నారు. ఈ విధమైన పనులు చేస్తే చట్ట రీత్యా చర్యలకు బాధ్యులు కాగలరని ఎస్ఐ తెలిపారు. (Story: మన్యం బంద్‌కు అనుమతుల్లేవ్‌)

జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల ర్యాలీ

0

జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల ర్యాలీ

న్యూస్‌తెలుగు/చింతూరు: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి15 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా చింతూరులో సోమవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రంపేటలోని ఎంవిఐ కార్యాలయం నుండి చింతూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టాటా మ్యాజిక్ లు, ఆటోల ఓనర్లు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు మాట్లాడుతూ డ్రైవర్లు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని, నిర్దేశించిన స్పీడ్ లోనే వాహనాలు నడపాలని కోరారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని నడిపితే అలా భారీ జరిమానాలు అధికారులు విధిస్తారని అన్నారు. పరిమితి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించే అలవాటు మానుకోవాలని సూచించారు. లారీలలో ఓవర్ లోడ్ వేయరాదని జరిమానాలు వేయించకుండా పరిమితిలోనే లోడు ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు, లారీ ఓనర్స్ అసోసియేషన్, సభ్యులు, మ్యాజిక్ ఓనర్లు, ఆటో ఓనర్లు, కాలేజీ విద్యార్థులు, భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. (Story: జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల ర్యాలీ)

మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ

0

మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ

న్యూస్ తెలుగు/వినుకొండ: అస్నా తుఫాను సమయంలో విజయవాడ పట్టణంలో పారిశుధ్య పనులు నిర్వహించి విజయవాడ పట్టణంను యధా స్థితి కి తీసుకు వచ్చిన, కృషి చేసిన వినుకొండ పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ సిబ్బంది కి మున్సిపల్ కమిషనర్ యం.సుభాష్ చంద్రబోస్, షేక్ ఇస్మాయిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ , పి.ఆది నారాయణ, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ దుస్తులు పంపిణీ చేశారు. (Story: మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ)

మంత్రి అనితను కలిసిన జీవి, కూటమి నేతలు

0

మంత్రి అనితను కలిసిన జీవి, కూటమి నేతలు

న్యూస్ తెలుగు/వినుకొండ: వినుకొండలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనితను భారతీయ జనతా పార్టీ తరఫున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి జిల్లా సెక్రెటరీ మేడం రమేష్, వినుకొండ నియోజకవర్గ బిజెపి నాయకులు యార్లగడ్డ లెనిన్ కుమార్ పాల్గొన్నారు. (Story: మంత్రి అనితను కలిసిన జీవి, కూటమి నేతలు)

డా.మతుకుమల్లి శారదకు శ్రీ సాయి సేవ భగవాన్ పురస్కారం

0

డా.మతుకుమల్లి శారదకు శ్రీ సాయి సేవ భగవాన్ పురస్కారం

న్యూస్ తెలుగు/వినుకొండ: పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద కు శ్రీ సాయి సేవా భగవాన్ ఉత్తమ జాతీయ పురస్కారం అవార్డును అందజేశారు. చిలకలూరిపేట కు చెందిన జై సాయి ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ పూసపాటి బాలాజీ ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక ,భక్తి భావం, సామాజిక సేవతో పాటు సమాజం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచే వారికి జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయి సేవా భగవాన్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం అవార్డును అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మిక సామాజిక రంగాలతో పాటు నవ సమాజం కోసం శ్రమిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న వినుకొండకు చెందిన మనం ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మతుకుమల్లి శారద కి ఆదివారం చిలకలూరిపేటలో జై జై సాయి ట్రస్ట్ కార్యక్రమంలో జరిగిన సేవా పురస్కారం అవార్డును మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ పూసపాటి బాలాజీ మరికొందరు ప్రముఖులు డా. మతుకుమల్లి శారద ని శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ జాతీయ పురస్కారం అవార్డును అందుకున్న శారద ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బాలాజీ , జాగృతి మండలి వ్యవస్థాపకురాలు పిడతల రమాదేవి, నవతరం పార్టీ అధ్యక్షురాలు కంచర్ల సుజాత, పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, సయ్యద్ షకీల, ఎలమంచిలి వరుణ్ తదితరులు పాల్గొన్నారు. (Story: డా.మతుకుమల్లి శారదకు శ్రీ సాయి సేవ భగవాన్ పురస్కారం)

నాసరయ్య సంస్మరణ స‌భ‌లో జీవి

0

నాసరయ్య సంస్మరణ స‌భ‌లో జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ: వినుకొండ పట్టణం సీతయ్య నగర్లో నాయి బ్రాహ్మణ సంఘం యూనిట్ ఇంచార్జ్ వల్లూరి మురళీకృష్ణ తండ్రి నాసరయ్య సంస్మరణ కార్యక్రమం సోమ‌వారం జ‌రిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యుల మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొని, నివాళులర్పించారు. (Story: నాసరయ్య సంస్మరణ స‌భ‌లో జీవి)

వినుకొండ పారిశ్రామికాభివృద్ధిలో కీలకంగా లెదర్‌పార్కు

0

వినుకొండ పారిశ్రామికాభివృద్ధిలో కీలకంగా లెదర్‌పార్కు

లెదర్‌ పార్కు భూమి చదును పనులు పర్యవేక్షించిన జీవీ, మక్కెన

న్యూస్‌తెలుగు/వినుకొండ: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా వినుకొండలో ఏర్పాటు కాబోతున్న లెదర్‌ పార్కు ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేయనుందన్నారు చీఫ్‌ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఇచ్చిన మాట ప్రకారం మల్టీ నేషనల్ కంపెనీలతో కొలువుదీరనున్న లెదర్ పార్క్‌ ఇక్కడి పారిశ్రామిక ప్రగతిలో కీలకంగా మారనుందన్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద లెదర్ పార్కు ఏర్పాటు కాబోతుందని తెలిపారు. సోమవారం అందుకు సంబంధించి కేటాయించిన భూముల్ని ఆయన పరిశీలించారు. వెంకుపాలెం వద్ద సర్వే నెంబర్ 1లో కేటాయించిన 98.20 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూములను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలసి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సందర్శించారు. యంత్రాలతో ముమ్మరంగా సాగుతున్న భూముల చదును పనుల్ని పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవీ లెదర్‌ పార్క్‌లో రీబాక్, పుమా, నైక్ వంటి పలు దిగ్గజ సంస్థలు తమ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయన్నారు. ఈ పార్కు నిర్మాణం ద్వారా 20 వేల నుంచి 30 వేలమంది చర్మకారులకు ఉపాధి లభించబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, తాను ఎంతోకాలంగా ఈ పార్క్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఇలా కార్యరూపం దాల్చుతూ ఉండడం చాలా సంతోషం అందిస్తోన్నట్లు తెలిపారు. చర్మకార వృత్తిదారుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎప్పటి నుంచో ఈ పార్క్‌ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఉన్నా మధ్యలో వైకాపా ప్రభుత్వంలో కనీసం పట్టించుకోలేదన్నారు. లెదర్ పార్క్‌ వస్తే ఆ వృత్తిలోని యువతకు ఆధునిక, సాంకేతిక శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంచే అవకాశం ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం విషాదమని వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబా బు దృష్టి సారించడం, కేంద్రంతో సమన్వయం, సహకారంతో ఇలా లెదర్ పార్క్‌ స్వప్నం సాకారం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. (Story: వినుకొండ పారిశ్రామికాభివృద్ధిలో కీలకంగా లెదర్‌పార్కు)

కార్పొరేట్ల‌కు తొత్తుగా మారిన కేంద్ర ప్ర‌భుత్వం

0

కార్పొరేట్ల‌కు తొత్తుగా మారిన కేంద్ర ప్ర‌భుత్వం

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రథ‌మ మహాసభలో వ‌క్త‌లు

న్యూస్ తెలుగు/వినుకొండ: పల్నాడు జిల్లా, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రధమ మహాసభ రైల్వే స్టేషన్ రోడ్డులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో ఈ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభ కి తోట ఆంజనేయులు అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు ఎన్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి బి. బంగా రావు , ఐఫా రాష్ట్ర కార్యదర్శి నాగమణి, రాష్ట్ర నాయకులు రాందేవ్, ఉదయ్ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడుతూ భారత దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరిగిందని, మతాల మధ్య ఘర్షణలు పెంచి ఉన్మాదాన్ని రెచ్చ కొట్టి ప్రజా సమస్యలు పక్క దారి పట్టిస్తూ, దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపాదన కార్పొరేట్లకు అప్ప చెప్పి ప్రజలపై పనుల భారాన్ని పెంచుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టంలో పూర్తిగా విఫలమయ్యారని , బిజెపి ఎజెండా అని పవన్, బాబు ఇద్దరు ఆంధ్రాలో అమలు చేస్తున్న దానివల్ల దక్షిణ భారతదేశంలో కూడా మతోన్మాద రాజకీయాలు ఏర్పడుతూ ఉన్నాయని సిపిఐ ఎంఎల్ పార్టీ ప్రజల సమస్యలపై అజెండాగా తీసుకొని మార్చి ఏప్రిల్ లో పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ ఉద్యమంలో పల్నాడు జిల్లా అగ్రభాగంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బి బంగారరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు, వలసరాజకీయాలు పెంచి పోషిస్తున్నారు. ఇటువంటి రాజకీయాలను ప్రజలు త్వరలోనే గమనించి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా కార్యదర్శిగా తోట ఆంజనేయులు
అనంతరం రాష్ట్ర కార్యదర్శి నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. పల్నాడు జిల్లా కార్యదర్శిగా తోట ఆంజనేయులు, కమిటీ సభ్యులుగా షేక్ ఫిరోజ్, ధూపాటి నాని, పల్నాడు శ్రీనివాసరావు, ఓబులాపురం ఆంజనేయులు, కామా వెంకటేశ్వర్లు, సిబ్బంది నాయక్, హరికృష్ణ, చెన్న కృష్ణయ్య లను ప్రకటించారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం ఆమోదించారు. అనంతరం వినుకొండ మండల కార్యదర్శిగా ధూపాటి నాని, వినుకొండ టౌన్ కార్యదర్శిగా ఎస్కే ఫిరోజ్, బొల్లాపల్లి కార్యదర్శిగా డి. సిబ్బంది నాయక్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు తొమ్మిది మంది తోటి మండల కమిటీ టౌన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ ఎంఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story: కార్పొరేట్ల‌కు తొత్తుగా మారిన కేంద్ర ప్ర‌భుత్వం)

error: Content is protected !!