సాలూరులో సర్పంచుల సన్మానం
ప్రభుత్వ వైఫల్యాలపై నాయకుల ఘాటు విమర్శలు
న్యూస్ తెలుగు /సాలూరు : గ్రామాల్లో అధికారులు ప్రభుత్వం సహకరించకపోయినా నిధులు ఇవ్వకపోయినా సర్పంచులందరూ ప్రజల పక్షాన నిలబడి వైయస్సార్ పార్టీలో ఉండి గ్రామాల్లో అభివృద్ధి చేశారని అందుకు ప్రతి ఒక్కరిని అభినందించి ఈ సన్మానం బాధ్యత వైయస్సార్ పార్టీ నాయకులు పై ఉందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర స్వగృహంలో సాలూరు నియోజకవర్గం సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని సర్పంచులందరినీ సన్మానించారు.. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాసేవలో పదవీ విరమణ లేదని ప్రజలకు అన్ని సహాయ సహకారాలు చేయడమే నిజమైన ప్రజా సేవ అని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న రాష్ట్రంలో అప్పులు చేయడం తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని అన్నారు. స్థానిక మంత్రి సంధ్యారాణి గిరిజనుల, ప్రజలను పట్టించుకోకుండా దొరికింది దోచుకోవడమే ఆమె పని అని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన సచివాలయాలు, హాస్పిటల్స్, రోడ్లు ప్రారంభించడం తప్ప ఈ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు గానీ ఒక హాస్పెటల్ గానీ నిధులు మంజూరు చేయలేదని అన్నారు. మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి రాజన్న దొర హయయాంలో పరిపాలన ఎలా ఉందో ఇప్పటి మంత్రి సంధ్యారాణి పరిపాలన ఎలా ఉందో ప్రజలకు తేట తెల్లం అయిందని అన్నారు. రాజన్న దొర హాయాయంలో సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది తప్ప ఆమె వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న అభివృద్ధి చేయలేదని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రజల తరఫున సమావేశులకు రాకుండా పార్వతీపురంలో చాటుమాటున సమావేశలు పెట్టుకుని ప్రజా ప్రతినిధులుగా మమ్మల్ని పిలకుండా సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుందని అన్నారు మమ్మల్ని పిలిస్తే నిడదీస్తామని భయంతో ఇలా చాటుమాటున సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుందన్నారు.రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. మొక్కజొన్న 2400 మద్దతు ధర ఉంటే ప్రైవేటు వ్యాపారస్తులు 1600 నుంచి 1700 రూపాయలకే కొనుగోలు చేయడం వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో మన కార్యకర్తలందరూ సైనికుల పనిచేసే సాలూరులో వైయస్సార్ పార్టీ జెండాను ఎగరవేయలని అన్నారు.
మాడుగుల మాజీ శాసనసభ్యులు మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం పనిచేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం ఈ పార్టీలో ఉన్నందుకు గర్వకారణంగా ఉందని అన్నారు. అధికారులు ప్రభుత్వం సహకరించకపోయినా సర్పంచులు ప్రజల కోసం పోరాడి గ్రామాల్లో అభివృద్ధి చేయడం మీరందరినీ అభినందించవలసిన బాధ్యత మాపై ఉందని అన్నారు. గ్రామాల్లో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇల్లు పట్టాలు, సామాజిక పెన్షన్లు గ్రామ సచివాలయాల ద్వారా అభివృద్ధి చేసామ అని తెలియజేశారు. ఈ అభివృద్ధి జరగడానికి గల కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు.
రాజన్న దొర మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అబద్ధపు పునాదులతో ప్రజలన్నీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క మహిళకు సంవత్సరానికి 18000 ఇస్తామని చెప్పి ఆ మాట నెరవేర్చలేదని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి ఆ వాగ్దానము తుంగలో తొక్కిరనన్నారు. 50 సంవత్సరాలు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ వారికి సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. నేను అధికారంలో ఉండేటప్పుడు ఒక ఉద్యోగస్తులు కూడా తొలగించలేదని స్థానిక మంత్రి సంధ్యారాణి వచ్చిన తర్వాత సాలూరు నియోజకవర్గంలో వందలాదిమంది నిరుద్యోగులను తొలగించి రాక్షసనందాన్ని పొందుతున్నారని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి సేవచేసిన ప్రతి ఒక్క సర్పంచ్ కి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాననీ ఆయన తెలిపారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజారాణి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు రాజకీయాలోనికి ప్రజలు సేవ చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ , మాజీ కౌన్సిలర్లు, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. (Story:సాలూరులో సర్పంచుల సన్మానం)

