UA-35385725-1 UA-35385725-1

గ్లకోమా వస్తే అంధత్వం వస్తుందా?

గ్లకోమా వస్తే అంధత్వం వస్తుందా?

గ్లకోమా వలన సంభవించే అంధత్వ నివారణకు అవగాహన కల్పించడం 

వార్షిక కంటి పరీక్ష మరియు త్వరిత గుర్తింపు కీలకం

ప్రపంచ గ్లకోమా వారం 2022: మార్చి 6-12

 

గ్లకోమా వస్తే అంధత్వం వస్తుందా? : ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ) ప్రతి సంవత్సరం పెద్దలను మరియు పిల్లలను ప్రభావితం చేసే ఈ కంటి వ్యాధిపై ప్రజల దృష్టి తీసుకురావడానికి ప్రపంచ గ్లకోమా వారాన్ని పాటిస్తుంది. కంటి ఒత్తిడిలో పెరుగుదల సంబంధిత కంటి సమస్య ఇది. పునరుద్ధరించలేని అంధత్వానికి దారితీసే కంటి నరాలు దెబ్బతినడం దీని సహజ లక్షణంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధరించలేని అంధత్వానికి అతి సాధారణ కారణం గ్లకోమా. 2040 సంవత్సరం నాటికి గ్లకోమా ఉన్న రోగుల సంఖ్య 76 మిలియన్ నుంచి 111.8 మిలియన్ కు పెరుగుతుందని ప్రపంచ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ రోగులలో అత్యధికం ఆఫ్రికా మరియు ఆసియా నివాసులు.

 ప్రపంచ గ్లకోమా వారం (డబల్యూజిడబల్యూ) ప్రపంచ గ్లకోమా అసోసియేషన్ (డబల్యూజిఎ) మరియు ప్రపంచ గ్లకోమా రోగుల అసోసియేషన్ (డబల్యూజిపిఎ) ల సంయుక్త అంతర్జాతీయ కార్యక్రమం. ఈ సంవత్సరం దీనిని 2022 మార్చి 6-12 నుంచి పాటిస్తారు. ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ త్వరిత గుర్తింపు మరియు నివారణకై గ్లకోమాపట్ల ప్రజలలో అవగాహన పెంచడానికి అవగాహనా ప్రచారాలు, ఉపన్యాసాలు మరియు రోగుల పరస్పర చర్చా ఫోరంలను నిర్వహిస్తున్నది.

గ్లకోమా తీవ్రత

–          కంటిలోపలి ఒత్తిడిలో పెరుగుదల ఉన్నప్పటికీ గ్లకోమా ఉన్న చాలామందిలో తొలి లక్షణాలు లేదా నొప్పి ఉండదు

–          వారు కంటి నిపుణుడి వద్దకు వెళ్లే సరికి, అప్పటికే చూపుకు హాని జరిగిపోయి ఉంటుంది.

–          గ్లకోమా వలన చూపు ఒకసారి పోతే, దానిని పునరుద్ధరించలేము. అందుకే దానిని ‘నిశ్శబ్ద చూపు దొంగ’ అనికూడా అంటారు.

–          మంచి వార్త ఏమిటంటే, త్వరితంగా గుర్తించి, చికిత్స చేస్తే, గ్లకోమా వలన దృష్టి కోల్పోవడాన్ని నివారించవచ్చు.

–          గ్లకోమా వలన అంధత్వంలో 80% నివారించగలిగినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 మిలియన్ల మంది గ్లకోమా వలన అంధులవుతున్నారు. అందులో 2/3 వంతు మహిళలు.

–          దీనికి కారణం బహూశా అవగాహన లోపం వలన 90% గ్లకోమా కేసులు గుర్తింపబడకపోవడం.

భారతదేశంలో గ్లకోమా వ్యాప్తి

–          అందుబాటులో ఉన్న గణాంకాలు పిల్లలతో సహా 1.12 కోట్ల భారతీయులు (భారతదేశ జనాభాలో 4.5%) గ్లకోమాతో బాధపడుతున్నారు.

–          అందులో 11 లక్షలమంది గ్లకోమా వలన అంధులయ్యారు.

–          గ్లకోమా చాలావరకు సాధారణంగా 40 ఏళ్ల వయస్సు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది; 40 ఏళ్ళు పైబడిన వారిలో ఎనిమిది మందిలో ఒకరికి గ్లకోమా వచ్చే ప్రమాదం ఉన్నది.

త్వరిత నిర్ధారణ 

–          90% చూపు పోయేంత వరకూ గ్లకోమా ఉన్న వ్యక్తికి ఏ విధమైన లక్షణాలూ ఉండవు.

–          గ్లకోమావలన దృష్టి పోకుండా నివారించడానికి పరీక్ష ద్వారా త్వరిత గుర్తింపు ఒక్కటే మార్గం.

–          కళ్ళద్దాల కొరకు చేసే ప్రాధమిక కంటి పరీక్ష (వ్యాకోచించకుండా చేసే కంటి పరీక్ష) గ్లకోమాను కనిపెట్టలేదు.

–          కంటి ఒత్తిడి పరీక్ష, వ్యాకోచింపజేసి ఫండస్ పరీక్ష మరియు గోనియోస్కోపీ (నిర్ణీత కేసులలో) లతో కూడిన ఒక సమగ్ర కంటిపరీక్ష మాత్రమే గ్లకోమా నిర్ధారణ చేయగలదు.

 ఎవరు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి?

–          దాదాపు 10-20% కేసులలో గ్లకోమా రోగుల తోబుట్టువులను మరియు పిల్లలను ఈ వ్యాధి ప్రభావితం చేయగలదు. కాబట్టి, గ్లకోమా రోగుల కుటుంబ సభ్యులకు తప్పనిసరి.

–          తీవ్రమైన మయోపియా లేదా మధుమేహం ఉన్న 40 ఏళ్లకు పై బడినవారు చేయించుకోవాలి.

–          స్టెరాయిడ్లను కేవలం వైద్య పర్యవేక్షణలో జాగ్రత్తగా వాడాలి. కంటి మందు చుక్కలు, ఇన్హేలర్లు, ఆయింట్మెంట్లు లేదా మాత్రల వంటి స్టెరాయిడ్లను వాడటం తప్పనిసరి అయితే, గ్లకోమాను తోసిపుచ్చడానికి క్రమబద్ధంగా సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవాలి.

–          ఇంతకుముందు తీవ్రమైన కంటి గాయం అయినవారు లేదా కంటి శస్త్రచికిత్సలు జరిగిన వారు గ్లకోమాను తోసిపుచ్చడానికి తమ కళ్ళకు క్రమబద్ధంగా పరీక్ష చేయించుకోవాలి.

–          గ్లకోమాకు తెలిసిన ప్రమాద కారకాలు ఇవి. కానీ, పై ప్రమాద కారకాలు ఏవీ లేకుండా కూడా చాలామందికి గ్లకోమా రావచ్చు.

చికిత్స

–          రకం, తీవ్రత మరియు పూర్వ చరిత్ర ఆధారంగా, గ్లకోమాకు మందులతో (సాధారణంగా కంటి మందుచుక్కలు), లేజర్లు (వివిధరకాలు) మరియు అవసరమైతే శస్త్రచికిత్సతో చికిత్స చేయవచ్చు

–          కంటి ఒత్తిడిని నియంత్రించడం మరియు గ్లకోమావలన మరింత దృష్టి నష్టాన్ని నివారించడం గ్లకోమా చికిత్స లక్ష్యం.

–          సాధారణంగా గ్లకోమా శస్త్రచికిత్స లక్ష్యం దృష్టిని మెరుగుపరచడం కాదు, మిగిలిన చూపును భద్రపరచడం.

–          కంటికి శుక్లం ఉన్నప్పుడు, శస్త్రచికిత్స శుక్లానికి ఆపాదించే చూపును తిరిగి పొందవచ్చు.

అపోహలను తొలగించడం

1)      మేము యువకులం. మాకు గ్లకోమా రావచ్చా?

40 ఏళ్ళు పైబడినవారిలో ఓపెన్-యాంగిల్ గ్లకోమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటం నిజమైనప్పటికీ, 40 ఏళ్లకు తక్కువ వయసున్నవారిని ప్రభావితం చేయగల ఇతర గ్లకోమా రకాలు (కొన్ని చాలా తీవ్రమైనవి) ఉన్నాయి.

2)      పిల్లలకు లేదా శిశువులకు గ్లకోమా రావచ్చా?

అసాధారణమైన కంటి అభివృద్ధి కారణంగా నవజాత శిశువులు మరియు చిన్నపిల్లలకు గ్లకోమా రావచ్చు. ఈ పిల్లలకు పెద్ద నీలి కళ్ళు ఉంటాయి.

3)      నేను ఇప్పుడే నా కళ్ళకు పరీక్ష చేయించుకున్నాను, నాకు కళ్ళద్దాలుకూడా లేవు; అయినా నాకు గ్లకోమా రావచ్చా?

మీరు కళ్ళద్దాలకోసం మీ కంటిపరీక్ష చేయించుకున్నప్పటికీ, ఒక సమగ్ర కంటిపరీక్ష లేకుండా గ్లకోమాను తోసిపుచ్చలేము.

4)      గ్లకోమా వస్తే నాకు అంధత్వం వస్తుందా?

పోయిన దృష్టి తిరిగి రాదు. కానీ, త్వరిత గుర్తింపు మరియు చికిత్సటో ఒక కంటి నిపుణుడు మీ మిగిలిన చూపును కాపాడటంలో మరియు రక్షించడంలో సహాయపడగలరు. తొలి దశలలో వచ్చిన రోగులకు దృష్టి వైకల్యం ఉండదు. వారు పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపగలరు.

5)      గ్లకోమావలన కోల్పోయిన చూపును శుక్ల శస్త్రచికిత్స (లెన్స్ పెట్టడం) పునరుద్ధరించగలదా?

లెన్స్ మార్చడంవలనద్వారా పాడైన ఫిలిం (లేదా 100 మెగాపిక్సెల్ సెన్సార్) ఉన్న కెమేరాను  బాగుచేయలేనట్లే, కేవలం శుక్లం తొలగించడం మరియు ఇంట్రాఆక్యులర్ లెన్స్ పెట్టడంవలన గ్లకోమా ఉన్న కన్ను ప్రయోజనం పొందదు.

డా. శిరీషా సెంథిల్

గ్లకోమా కన్సల్టెంట్

ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1