అనుదీప్ హత్యపై సమగ్ర విచారణ జరపాలి: చందు జనార్దన్
న్యూస్‌తెలుగు/ఏలూరు: అంబటి అనుదీప్ హత్యపై విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను శుక్రవారం ఏలూరులో వారి కార్యాలయంలో రాష్ట్ర కాపు జేఏసి అధ్యక్షులు చందు జనార్దన్ కలిశారు. విచారణ త్వరిత గతిన పూర్తి చేయాలని దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చందు జనార్ధన్ డిమాండ్ చేశారు. అనంతరం చందు జనార్దన్ మాట్లాడుతూ, అంబటి అనుదీప్‌ను చంపుతామంటూ ఇంటికి వచ్చి బెదిరించిన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం, సంఘటన జరిగిన నాటినుండి నేటి వరకు అనేక అనుమానాలు ఉన్నదృష్ట్యా అవి నివృత్తి జరిగే పరిస్థితి లేదని అన్నారు. వీటన్నిటి దృష్ట్యా ఆదివారం సాయంత్రం చాట్రాయ్‌లో దివంగత అంబటి అనుదీప్ నివాసంలో సమావేశం అయి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు చందు జనార్దన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చాట్రాయ్ జనసేన నాయకులు తుమ్మల జగన్, అనుదీప్ తండ్రి అంబటి గోపి, జే ఏ సి నాయకులు ఏ వి శ్రీనువాస్, జగదీష్, కడవకొల్లు సాగర్, శ్రీనివాస్, చాట్రాయ్ యువ నాయకత్వం పాల్గొన్నారు. (Story: అనుదీప్ హత్యపై సమగ్ర విచారణ జరపాలి: చందు జనార్దన్)
Note:

