మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) ‘కళావతి’ సాంగ్ అదిరిపోయింది. సర్కారువారి పాట (Sarkaru Vari Paata) చిత్రంలోని ‘కళావతి’ పాటను ఆదివారంనాడు చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో సాంగ్‌లో సిడ్ శ్రీరామ్ పాడుతున్నట్లు, సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నట్లు ఉంటూనే మరోవైపు మహేష్‌బాబు, హీరోయిన్ కీర్తిసురేష్‌తో డ్యాన్స్ చూస్తుంటే సాంగ్ అద్భుతంగా వుంది. ఎందుకంటే ఈ పాటను విడుదల చేసిన కొన్ని క్షణాలకే యూట్యూబ్‌లో ఇది మిలియన్ల వ్యూయర్స్‌ను దాటిపోయింది. మాంగళ్యం తంతునా అంటూ సాకీ మొదలైన తర్వాత వందో..ఒక వెయ్యో అని పాట పల్లవి మొదలవుతుంది. ఇలాంటివి నాకు అలవాటు లేదంటూనే నిను జగపడమంటూ తెగ మనసు పిలుస్తున్నదని హృద్యంగా పాట సాగుతుంది. నువ్వే గతీ నువ్వే గతీ కళావతీ అంటూ మహేష్‌బాబు తన హీరోయిన్ చుట్టూ తిరుగుతూ అతను వేసిన స్టెప్పుల్లో కొత్తదనం కన్పించింది. పాట మాత్రం అదిరింది! (Story : మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!)
‘కళావతి’ పాట సాహిత్యం చదువుతూ పాడుకోండి ఇలా…!
మాంగళ్యం తంతున అనేనా
మమ జీవన హేతున
కంటే బద్నామి శుభగే
త్వం జీవ శరదా శతం
వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు..
మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా
ముందో.. అటు పక్కో.. ఇటు దిక్కో..
చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా
ఇట్టాంటివన్నీ.. అలవాటే లేదే
అట్టాంటి నాకి.. తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువ్వేగతే నువ్వేగతీ
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువు లేకుంటే అదోగతీ
మాంగళ్యం తంతున అనేనా
మమ జీవన హేతున
కంటే బద్నామి శుభగే
త్వం జీవ శరదా శతం
వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు..
మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా
అన్యాయంగా.. మనసుని కెలికావే
అన్నం మానేసి.. నిన్నే చూసేలా
దుర్మార్గంగా.. సొగసుని విసిరావే
నిద్ర మానేసి.. నిన్నే తలచేలా
రంగా ఘోరంగా.. నా కలలని కదిపావే
దొంగ అందంగా.. నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళా అవీ! కళావతీ
కల్లోలమైందె.. నా గతీ
కురులా అవీ.. కళావతీ
కుల్లబొడిసింది.. చాలు తీ!
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువ్వేగతే నువ్వేగతీ
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువు లేకుంటే అదోగతీ
మాంగళ్యం తంతున అనేనా
మమ జీవన హేతున
కంటే బద్నామి శుభగే
త్వం జీవ శరదా శతం
వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు..
మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా
ముందో.. అటు పక్కో.. ఇటు దిక్కో..
చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా!