Home Blog Page 956

`మైఖేల్`లో వరుణ్ సందేశ్

0
Varun Sandesh
Varun Sandesh

`మైఖేల్`లో వరుణ్ సందేశ్

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీ `మైఖేల్`లో వరుణ్ సందేశ్

`మైఖేల్`లో వరుణ్ సందేశ్! మైఖేల్ చిత్రం గురించి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది గురించి  నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచీ చిత్రంపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వారంతా ఈ సినిమాలో ప‌నిచేయ‌డం పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

హ్యాండ్సమ్,  టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మ‌రోసా రి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే పాత్ర‌ను పోషిస్తున్నారు.స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా ప్ర‌తిభ‌గ‌ల న‌టీమ‌ణుల్లో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం విశేషం.

ఇప్పు, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన తర్వాత వరుణ్ సందేశ్ అంగీక‌రించిన  మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది.

మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

మైఖేల్ చిత్రం భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.

తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: రంజిత్ జయకోడి

నిర్మాతలు: భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు

సమర్పకుడు: నారాయణ్ దాస్ కె నారంగ్

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, కరణ్ సి ప్రొడక్షన్స్ LLP

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ చెర్రీ

PRO: వంశీ-శేఖర్ (Story: `మైఖేల్`లో వరుణ్ సందేశ్)

See Also: మెగాస్టార్ మేడే!

మెగాస్టార్ మేడే!

0
Megastar-Chiranjeevi May Day
Megastar-Chiranjeevi May Day

మెగాస్టార్ మేడే!

మే ఒకటిన హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ లోని అన్ని విభాగాలు (24 క్లాప్స్ ) తో  కలిసి మేడే ఉత్సవాలు

మెగాస్టార్ మేడే! మే ఒకటిన హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ లోని అన్ని విభాగాలు (24 క్లాప్స్ ) తో  కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. దాదాపు పది వేలమంది తో భారీస్థాయి లో మేడే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఈ సందర్బంగా శనివారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఉపాధ్యక్షుడు దొరై, సెక్రెటరీ సురేష్, దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్ లతో పాటు 24 క్రాఫ్ట్ కు సంబందించిన అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ..

దర్శకుల సంఘం అధ్యక్షుడు కాసి విశ్వనాధ్ మాట్లాడుతూ .. అందరికి పండగలు ఉంటాయి ఆలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ కలిసి నిర్వహించే ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అన్నది ప్రసిడెంట్ అనిల్ గారు తెలియచేస్తారు అన్నారు.

ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ .. తెలుగు సినిమా పరిశ్రమ అంటే హీరోలు, ఆడియో ఫంక్షన్లు , రిలీజ్ లు కాదు.. సినిమా పరిశ్రమ అంటే ఎంప్లాయిస్ ఫిలిం ఫెడరేషన్, దానికింద పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్, జూనియర్ ఆర్టిస్ట్, టెక్నీషియన్, లైట్ బాయ్.. ఇలా అందరు కలిసి పనిచేస్తేనే ఒక సినిమా వస్తుంది. దీని కింద చాలా మంది కార్మికులు ఉన్నారని చాలా మంది మరచిపోయారు. ఈ ఫిలిం ఫెడరేషన్ కొత్త కార్యవర్గం ఎన్నికైన తరువాత 24 క్రాఫ్ట్ వారిని కలుపుకుని ముందుకు సాగుతున్నాం. ఇక్కడ 24 క్రాఫ్ట్ కార్మికులం ఉన్నాం అంటూ మేడే వేడుకను అందరం కలిసి గ్రాండ్ గా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా అనుకున్నాం కానీ కోవిద్ కారణంగా జరపలేదు .కానీ ఇప్పుడు 24 శాఖలకు సంబందించిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం సహకారముతో కార్మికులకు మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. మన కార్మికులకు మేడే దినోత్సవం ఉంటుంది.. దాన్ని సినిమా రంగంలో ఉన్న ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా మేడే జరుపుకుందాం. చెన్నై నుండి సినిమా పరిశ్రమ  హైద్రాబాద్ వచ్చాకా కూడా కార్మికులందరూ ఐక్యతగా, ఒకే దగ్గర ఉంటున్నారో లేదో కూడా తెలియదు. కోవిద్ సమయంలో ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు. మన కష్ట నష్టాలూ కూడా ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలి, మన పరిశ్రమలో 24 వేల మంది కార్మికులు ఉన్నారు. మన దగ్గర సరిపోకపోతే పక్క రాష్ట్రాలనుండి తెచ్చుకుంటున్నాం. మనదగ్గర చాలా కార్మిక శక్తి ఉంది. ఈ రోజు తెలుగు సినిమా, తెలుగు హీరోలంటే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే మన తెలుగు పరిశ్రమలోని ఫిల్మ్ల్ ఫెడరేషన్ అందరం కలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక దినోత్సవం జరుపుకుందాం. మన వర్కర్స్ లో ఔన్నత్యం పెరగాలి, ఐక్యత పెరగాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కార్మికులందరికి చాలా కష్ఠాలు ఉన్నాయి.. వాటిని ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ఈ పండగ ఉపయోగపడుతుంది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అథితిగా పాల్గొంటారు. అయన ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను, అందరితో కలిసి సహపంక్తి భోజనం చేసి వెళ్తాను అని అయన అన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కార్మికులకు అండగా ఉంటామని అన్నారు, ఇది మంచి కార్యక్రమం అని చెప్పడం. అలాగే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు, సినిమా పెద్దలు, హీరోలు, అలాగే అన్ని యూనియన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో సినిమా రంగంలో ఉన్న పలువురు ప్రముఖులను సన్మానించుకుందాం. కోవిడ్ సమయంలో ఎంతగానో కష్టపడ్డాం. ఆ సమయంలో సీసీసీ ద్వారా చిరంజీవిగారు ఆదుకున్నారు.. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒకరోజు 24 క్రాఫ్ట్స్ అందరికి స్వయంగా సహాయం అందించారు. అమితాబ్ గారి సహాయం, చదలవాడ శ్రీనివాస్ గారు అందించారు. వారందరిని కూడా సన్మానించుకుందాం. ఫెడరేషన్ కొరకు కష్టపడ్డ పూర్వ లీడర్లు ను, యూనియన్ లు పటిష్టం కావడానికి కష్టపడ్డ వర్కర్స్ ని గౌరవించుకుందాం.. మమ్మల్ని చిన్నచూపు చూడొద్దని కోరుకుంటున్నాను. సినిమా రంగానికి ఫెడరేషన్ ద్వారా మేము ఎప్పుడు ముందుంటాం.. కార్మికుల కష్టాలను తీర్చేందుకు అనుక్షణం పనిచేస్తాం అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి ఎంతగానో అండగా ఉంటుంది. వారి సహకారంతో ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలని… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కూడా ఫెడరేషన్ ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను అన్నారు.

ఫిలిం ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దొరై మాట్లాడుతూ .. సినిమా రంగానికి సంబందించిన ఓ పెద్ద పండగ జరగాలి. ఈ కరోనా సమయంలో చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఇక్కడ బతకలేక ఊరు వెళ్లిపోయారు. అలా కష్టాలనుండి ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటపడుతున్నాం . సినిమా రంగంలో ఎలాంటి కష్ఠాలు వచ్చినా మనకు దేవుడిలాగా ఉండే దాసరి గారి లోటు కనిపిస్తుంది. అయన ఎక్కడున్నా మా కార్మికులకు అండగా ఉంటారు.. ఇప్పుడు కార్మికులకు అండగా ఉండేందుకు చిరంజీవిగారు సపోర్ట్ అందివ్వడం. కరోనా సమయంలో సీసీసీ ద్వారా ఎంతోమందికి సపోర్ట్ అందించారు . ఇప్పుడు సినిమా రంగంలోని 24 శాఖల ఆధ్వర్యంలో కలిసి గొప్పగా ఈ మేడే పండగను జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను అన్నారు.

ఫెడరేషన్ సెక్రేటర్ సురేష్ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా బిఫోర్.. కరోనా ఆఫ్టర్ అన్న విధంగా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరు మళ్ళీ మంచి దశలోకి వస్తున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కరొనను దాటాం మనం అందరు. ఈ కరోనా సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. కరోనా సమయంలో నిత్యావసరాలు దొరకని పరిస్థితిలో చిరంజీవిగారు సీసీసీ ద్వారా నిత్యావసరాల సరుకులు అందించిన ఆయనకు సినిమా రంగ పెద్దలకు, తలసాని గారు కూడా ఎంతో సహకారం అందించారు. వారికీ మా ధన్యవాదాలు. కరోనా తరువాత పరిశ్రమ ఏదైనా పెద్ద పండగ అందరం కలిసి జరుపుకోవాలని ఈ ప్లాన్ చేసాం. తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం అన్నారు. (Story: మెగాస్టార్ మేడే!)

సీపీఐ జాతీయ కార్యవర్గం కీలక భేటీ : ఏం చర్చించారంటే?

0
CPI National Executive
CPI National Executive

సీపీఐ జాతీయ కార్యవర్గం కీలక భేటీ : ఏం చర్చించారంటే?

న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యవర్గం ఢిల్లీలో శనివారంనాడు సమావేశమైంది. మూడు రోజుల పాటు జరిగే జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా తొలి రోజు కార్యవర్గం భేటీ అయింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యదర్శులు కె.రామకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌), చాడా వెంకటరెడ్డి (తెలంగాణ) కూడా హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు 80 శాతం బీజేపీకి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. పంజాబ్‌లో ఆప్‌ గెలవడమొక్కటే జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఆకాంక్షించే వామపక్షాలకు ఊరట కలిగించింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో బీజేపీ గెలిచింది. బీజేపీకి సీట్లు తగ్గినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటంత గెలుపు లభించడంతో కాషాయవర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. పైగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఈ ఐదు రాష్ట్రాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొత్తగా జాతీయ ఫ్రంట్‌ ఏర్పాటైతే దానికి కాంగ్రెస్‌ నేతృత్వం వహించాలని ఆరాటపడుతున్నప్పటికీ, ఈ తాజా ఫలితాలు ఆ పార్టీకి షాకిచ్చాయి. అందుకే బీజేపీ, కాంగ్రెస్సేతర పక్షాలు ఒక దారిలో వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోపే తృతీయ శక్తులన్నీ ఒక చోటకు రావడానికి ప్రయత్నాలు మొదలుకావాలి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంత ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ, యూపీ ఫలితాలతో కాస్త ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు అధికారంలో వున్నందున జాతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఢోకా లేదు. ఈ పరిణామాలన్నీ ఢల్లీిలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మూడు రోజులపాటు జరిగే పార్టీ కౌన్సిల్‌ సమావేశాలు 14వ తేదీ సాయంత్రం ముగియనున్నాయి. అక్టోబరులో విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల ఏర్పాట్లపై కూడా ఈ కార్యవర్గంలో చర్చించినట్లు తెలిసింది. (<¸Š=@‚z|˜Ÿ సీపీఐ జాతీయ కార్యవర్గం కీలక భేటీ : ఏం చర్చించారంటే?)

See Also: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌-Full Details

ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?

దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

Pushpa becomes an iconic movie!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌-Full Details

0
Ap Budget
Ap Budget

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌-Full Details

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌-పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌-Full Details

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌-Full Details ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర బడ్జెట్‌ రానేవచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక భారీ బడ్జెట్‌. ఎవరూ ఊహించని విధంగా మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు అంచనా రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లు.

2022-23 ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు…
వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.18వేల కోట్లు కేటాయింపు
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖకు రూ.1,568 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,014 కోట్లు కేటాయింపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండిరతల కేటాయింపులు పెంపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ.20,962 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌, సహకార శాఖకు – రూ.11,387 కోట్లు
ఇరిగేషన్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ రూ 11,482 కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ.17,109 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630 కోట్లు
ఇంధన రంగానికి రూ.10,281 కోట్లు
జనరల్‌ ఏకో సర్వీసెస్‌ రూ.4,420 కోట్లు
ఇండస్ట్రీ అండ్‌ మినరల్స్‌ రూ.2,755 కోట్లు
విద్యుత్‌ – రూ.10,281.04 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్‌ – రూ.27,706.66 కోట్లు
వ్యవసాయం – రూ.11,387.69 కోట్లు
పశు సంవర్ధకం – రూ.1,568.83 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.20,962.06 కోట్లు
పర్యావరణ, అటవీ – రూ.685.36 కోట్లు
ఉన్నత విద్య – రూ.2,014.30 కోట్లు
ఆర్థిక సేవల రంగానికి రూ.69,306 కోట్లు

ఎస్సీ సబ్‌ ప్లాన్‌ః రూ. 18, 518 కోట్లు-గతేడాది రూ. 13,835 కోట్లు
ఎస్టీ సబ్‌ ప్లాన్‌ః రూ. 6, 145 కోట్లు -గతేడాది రూ. 5,318 కోట్లు
బీసీ సబ్‌ ప్లాన్‌ః రూ. 29, 143 కోట్లు-గతేడాది రూ. 28,238 కోట్లు
మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌ః రూ. 3,532 కోట్లు-గతేడాది రూ. 3,306 కోట్లు
ఈబీసీల సంక్షేమంః రూ. 6, 639 కోట్లు-గతేడాది రూ. 3, 743 కోట్లు
వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకః రూ.18,000 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతు భరోసాః రూ. 3,900 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాః రూ.1802.04 కోట్లు
ప్రకృతి వైపరీత్యాల నిధిః రూ. 2000 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనః రూ. 1750 కోట్లు
-కృషియోన్నతిః రూ. 760 కోట్లు
రైతులకు విత్తన సరఫరాః రూ. 200 కోట్లు
జీరో బేస్డ్‌ వ్యవసాయంః రూ. 87.27 కోట్లు
అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ః రూ. 50 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి కోసంః రూ. 500 కోట్లు(మొత్తం నిధిః రూ. 3000 కోట్లు)
జగనన్న విద్యా కానుకః రూ. 2,500 కోట్లు
జగనన్న వసతి దీవెనః రూ. 2,083.32 కోట్లు
డ్వాక్రా సంఘాలకు(రూరల్‌) వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలుః రూ. 600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు(అర్బన్‌) వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలుః రూ. 200 కోట్లు
రైతులకు వడ్డీ లేని రుణాల కోసంః రూ. 500 కోట్లు
వైఎస్‌ఆర్‌ కాపు నేస్తంః రూ. 500 కోట్లు
జగనన్న చేదోడుః రూ. 300 కోట్లు
వైఎస్‌ఆర్‌ వాహనమిత్రః రూ. 260 కోట్లు
నేతనన్న నేస్తంః రూ. 199.99 కోట్లు
మత్స్యకార భరోసాః రూ. 120.49 కోట్లు
మత్స్యకారుల డీజిల్‌ సబ్సిడీః రూ. 50 కోట్లు
జగనన్న తోడుః రూ. 20 కోట్లు
ఈబీసీ నేస్తంః రూ. 590 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఆసరాః రూ. 6,400 కోట్లు
వైఎస్‌ఆర్‌ చేయూతః రూ. 4,235 కోట్లు
అమ్మ ఒడిః రూ. 6,500 కోట్లు
కాపుల సంక్షేమంః రూ. 3,531.68 కోట్లు
మైనార్టీల సంక్షేమంః రూ. 1750.50 కోట్లు
ఏపీ స్టేట్‌ క్రిష్టియన్‌ కార్పొరేషన్‌ః రూ. 113.4 కోట్లు
బ్రాహ్మణ కార్పొరేషన్‌ః రూ. 455. 23కోట్లు- ఇందులో అర్చకుల కోసంః రూ.122 కోట్లు
ఏపీ రెడ్డీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ః రూ. 3, 088.99 కోట్లు
ఏపీ కమ్మ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ః రూ. 1,899.74 కోట్లు
వైశ్య వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ః రూ. 915. 49 కోట్లు
క్షత్రియ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ః రూ. 314.02 కోట్లు
ఈబీసీ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌ మెంటుః రూ. 139.18 కోట్లు
బీసీ కార్పొరేషన్‌ః రూ. 6345.82 కోట్లు

ఆరోగ్యం..

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీః రూ. 2000 కోట్లు
ఆసుపత్రుల్లో నాడు-నేడు కోసంః రూ. 1603 కోట్లు
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ః రూ. 2462.03 కోట్లు
మెడికల్‌ కాలేజీలలో పనుల కోసంః రూ. 753.84 కోట్లు
కొత్త మెడికల్‌ కాలేజీలు-ఆసుపత్రుల కోసంః రూ. 320 కోట్లు
ఇదివరకే ఆసుపత్రులు ఉండి, మెడికల్‌ కాలేజీలుగా మార్చడానికి రూ. 250.45 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరాః రూ. 300 కోట్లు
ట్రైబల్‌ ఏరియాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసంః రూ. 170 కోట్లు

104 సర్వీసులుః రూ. 140 కోట్లు
108 కోసంః రూ. 133.19 కోట్లు
గవర్నమెంటు మెడికల్‌ కాలేజీల్లో సీట్ల పెంపు కోసంః రూ. 100 కోట్లు
ఆసుపత్రుల్లో నాడు-నేడు కోసంః రూ. 500 కోట్లు
ఎన్‌ హెచ్‌ ఎం ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ. 695.88 కోట్లు
ఆశా వర్కర్ల గౌరవ వేతనంః రూ. 343.97 కోట్లు
ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్స్‌ఃరూ. 218 కోట్లు
ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ రూ. 250 కోట్లు
రేషన్‌ బియ్యం కోసంః రూ,3100 కోట్లు
బియ్యం డోర్‌ డెలివరీ కోసంః రూ. 200.02 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం ఎగుమతులు..

ఎంఎస్‌ఎంఈలకుః రూ. 450 కోట్లు
ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ కు ఇన్సెంటీవ్‌ లుః రూ. 411.62 కోట్లు
విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ః రూ. 236. 86 కోట్లు
ఎస్సీ పారిశ్రామిక వేత్తల ఇన్సెంటీవ్‌ లుః రూ. 175 కోట్లు
ఐటీ ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ ఇన్సెంటీవ్‌ లుః రూ. 60 కోట్లు
వైఎస్‌ఆర్‌ బీమాః రూ. 372.12 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ..

అంగన్‌ వాడీలు కోసంః రూ. 1,517.64 కోట్లు
అంగన్‌ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసంః రూ. 1200 కోట్లు
సంపూర్ణ పోషణ కోసంః రూ. 901.56 కోట్లు
సంపూర్ణ పోషణ ప్లస్‌ కోసంః 201.82 కోట్లు
వీటికి సంబంధించి మరిన్ని పోషణ కార్యక్రమాల కోసంః రూ.330 కోట్లు
ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ అండ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ః రూ. 988.98 కోట్లు
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కోసంః రూ. 5000 కోట్లు
వడ్డీ లేని రుణాలుః రూ. 600 కోట్లు
నేషనల్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ః రూ. 389.06 కోట్లు
గ్రామీణ తాగునీటి సరఫరా కోసంః రూ. 1,149.93 కోట్లు
స్వచ్ఛ భారత్‌ కోసంః రూ. 500 కోట్లు2022-23.

బడ్జెట్‌పై ఆర్థికమంత్రి బుగ్గన పూర్తి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

See Also: ఆగని యుద్ధం!

See Also: దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

Pushpa becomes an iconic movie!

ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం కన్నేసిందా?

0
North Koria
North Koria

ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం కన్నేసిందా?

సియోల్‌ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి కారణం అమెరికా, దాని నాయకత్వంలోని ‘నాటో’ అని అందరికీ తెల్సిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా ఏదో ఒకటి చేయాలని అగ్రరాజ్యం అమెరికా తపిస్తోంది. ఈ దిశగా దక్షిణ కొరియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా దక్షిణ కొరియా కొత్త అధినేత చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర కొరియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ప్రకటించారు. అమెరికాతో బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంటామని కూడా చెప్పకనే చెప్పారు. సైన్యాన్ని మరింత శక్తిమంతమైనదిగా చేసుకొని ఉత్తర కొరియాపై కఠిన వైఖరిని అవలంభిస్తామని చెప్పారు. అంటే దానర్థం యుద్ధానికి సిద్ధమే అన్నట్లుగా స్పష్టమవుతోంది. దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడుగా పీపుల్‌ పవర్‌ పార్టీ అభ్యర్థి యూన్‌ సుక్‌ యోల్‌ ఇటీవలనే ఎన్నికయ్యారు. ఎన్నికైన కొన్ని గంటలకే ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన యూన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ కొరియా భద్రత విషయంలో అమెరికా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా బైడెన్‌ నొక్కిచెప్పారు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాల ద్వారా పొంచివున్న ప్రమాదాలను నివారించే క్రమంలో రెండు దేశాలు సమన్వయంతో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటన పేర్కొంది. యూన్‌ ఎన్నికపై ఉత్తర కొరియా స్పందించలేదు. దక్షిణ కొరియాలో బుధవారం ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోరులో యూన్‌ సుక్‌ 48.56శాతం ఓట్లతో లిబరల్‌ ప్రత్యర్థిని ఓడిరచినట్లు గురువారం జాతీయ ఎన్నికల కమిషన్‌ ఫలితాలు విడుదల చేసింది. అధికార డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన లీ జే ముయుంగ్‌కు 47.83శాతం ఓట్లు రాగా ప్రోగ్రెసివ్‌ జస్టిస్‌ పార్టీ అభ్యర్థి సిమ్‌ శాంగ్‌ జంగ్‌కు 2.23శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జాతీయ అసెంబ్లీ భవనంలో పార్టీవారితో కలిసి యూన్‌ తన విజయాన్ని వేడుక చేసుకున్నారు. యూన్‌ సుక్‌ యోల్‌ మీడియాతో మాట్లాడుతూ, బలమైన సైనిక సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు. ఉత్తర కొరియా చట్టవిరుద్ధమైన ప్రవర్తన విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని, ఆ దేశంతో చర్చలకు సిద్ధంగా ఉంటానని యూన్‌ అన్నారు. అయితే ఈయన మేనెలలో బాధ్యతలను చేపడతారు. అప్పటి నుంచి ఐదేళ్ల అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుత అధ్యక్షడు మూన్‌ జే ఇన్‌పై యూన్‌ ఆరోపణలు చేశారు. ఈయన అమెరికాకు దూరంగా ఉంటూ చైనా, ఉత్తర కొరియా వైపు మొగ్గు చూపారని విమర్శించారు. ద్వైపాక్షిక చారిత్రక విభేదాల నేపథ్యంలో టోక్యోతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం వ్యూహాత్మకంగా ముఖ్యమని గుర్తించాల్సిన అవసరం ఉందని యూన్‌ నొక్కిచెప్పారు. అమెరికా`దక్షిణ కొరియా మధ్య సంబంధాలను పటిష్టపరుస్తానని, వ్యూహాత్మక సమగ్ర కూటమిని ఏర్పాటు చేస్తానని, ఉదారవాద ప్రజాస్వామిక విలువలే ఇక్కడ కీలకమని, మార్కెట్‌ ఎకానమీ, మానవహక్కులపైనా దృష్టి పెడతానని ప్రకటించారు. ఏదేమైనప్పటికీ, ఈ పరిణామాలన్నీ ఉత్తర కొరియా టార్గెట్‌గా చేసుకున్నవేనని తెలుస్తోంది. దక్షిణ కొరియాను అడ్డంపెట్టుకొని ఉత్తరకొరియాపై యుద్ధం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా రెచ్చగొట్టే చర్యలే ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధానికి దారితీసిన విషయం తెల్సిందే. (Story: ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం కన్నేసిందా?)

See Also: ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?

ఆగని యుద్ధం!

See Also: దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

Pushpa becomes an iconic movie!

ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?

0
Ukraine Bio Weapons
Ukraine Bio Weapons

ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?

మాస్కో : ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా కచ్చితంగా జీవాయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉందని పశ్చిమ దేశాల మీడియా సంస్థలు, వాటిని నమ్ముకున్న ఇండియన్‌ మీడియా సంస్థలు ఘోషిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఉక్రెయిన్‌లోనే బయో బాంబ్స్‌ ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రష్యా వెల్లడిరచడం ద్వారా సంచలన ప్రకటన చేసింది. అతిపెద్ద, బలమైన రష్యాతో ఢీ అంటే ఢీ అనడానికి ఉక్రెయిన్‌కు అంత ధైర్యం ఎలా వచ్చింది? అమెరికా, నాటో దేశాల అండదండలతోపాటు జీవాయుధాలు (బయో వెపన్స్‌) కూడా ఉక్రెయిన్‌ వద్ద ఉండటమే అందుకు కారణమని రష్యా చెపుతోంది. ఉక్రెయిన్‌ జీవ ప్రయోగశాలల్లో ప్లేగు, ఆంత్రాక్స్‌తో కూడిన జీవాయుధాల అభివృద్ధి జరుగుతోందని, ఈ తయారీలో అమెరికా ప్రమేయం ఉందని కచ్చితంగా వుందని రష్యన్‌ గూఢచార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లో పలు నగరాలను రష్యా ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ జీవాయుధాల తయారీపై అమెరికా స్పష్టత ఇవ్వాలని రష్యా డిమాండు చేసింది. ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌, ఇతర రోగకారకాలతో కూడిన బయో బాంబులను ఉక్రెయిన్‌ ల్యాబుల్లో అమెరికా అభివృద్ధి చేస్తుందంటూ రష్యా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా చెప్పారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాము ప్రయత్నించడం లేదని, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరిగిన మూడు దశలో చర్చల్లో కొంత పురోగతి ఉందని ఆమె ప్రకటించారు. ఉక్రెయిన్‌లో బయో వెపన్‌లు అమెరికా అభివృద్ధి చేస్తున్నట్లు పత్రపూర్వక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వీటి కోసం అమెరికా రక్షణ శాఖ నిధులు సమకూరుస్తోందన్నారు. బయో వెపన్స్‌ తయారీ గురించి అమెరికా రక్షణ శాఖ, పరిపాలనా యంత్రాంగం అధికారికంగా వివరణ ఇవ్వాలని రష్యా డిమాండు చేస్తోందన్నారు. అయితే, బయో ఆయుధాల తయారీ ఆరోపణలను అమెరికా, ఉక్రెయిన్‌ దేశాలు ఖండిరచాయి. సామాన్యులపై మాస్కో దాడులు చేయడం లేదని, ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం లక్ష్యం కాదని మారియా జఖరోవా చెప్పారు. ఆ దేశాన్ని డీనాజిఫై చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఉక్రెయిన్‌ వల్లే అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కీవ్‌ అధికారులు ప్రజల తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని జఖరోవా తెలిపారు. మానవతా కారిడార్‌ల గురించిన సమాచారాన్ని కావాలనే ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆరోపించారు. (Story: ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్‌?)

See Also: ఆగని యుద్ధం!

See Also: దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

Pushpa becomes an iconic movie!

ఆగని యుద్ధం!

0
Ukraine-Russia War
Ukraine-Russia War

ఆగని యుద్ధం!

రష్యా`ఉక్రెయిన్‌ చర్చలు మళ్లీ విఫలం

మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగురతూనే వుంది. ఉక్రెయిన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రష్యా దూకుడు వెరసి యుద్ధం కొనసాగడానికి దారితీసింది. బాంబుల మోతతో ఉక్రెయిన్‌ నగరాలు దద్దరిల్లుతున్నాయి. సయోధ్యకు టర్కీ జరిపిన రాయబారం విజయవంతంగా ఒక అడుగు ముందుకు పడినప్పటికీ యుద్ధం మాత్రం ఆగలేదు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు రెండు దేశాల విదేశాంగ మంత్రులు శాంతి చర్చలు జరిపారు. టర్కీలో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భేటీ అయ్యారుగానీ చర్చలు మరలా అసంపూర్ణంగానే ముగిశాయి. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మాస్కో, కీవ్‌ ఉన్నత దౌత్యాధికారుల మధ్య చర్చలు ఫలించలేదని కులేబా తెలిపారు. గురువారం టర్కీలో జరిగిన సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. యుద్ధాన్ని ముగించే విషయంలో రాజీ కుదరలేదని అన్నారు. మానవతా కారిడార్లు, కాల్పుల విరమణపై చర్చించామన్నారు. రష్యాలో మరికొందరు నిర్ణేతలు ఉన్నారని, వారితోనూ సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని చెప్పారు. యుద్ధం కారణంగా నెలకొన్న మానవతా సమస్యలకు పరిష్కారం కోసం అంగీకరించినట్లు తెలిపారు. కాల్పుల విరమణకు మాస్కో సిద్ధంగా లేదని చెప్పారు. ఉక్రెయిన్‌ లొంగుబాటును కోరుకుంటున్నట్లు తెలిపారు. అది జరిగేలా లేదని, సురక్షితంగా నగరాల నుంచి బయట పడతామన్న ఉక్రెయిన్‌ ప్రజల ఆశలను నీరుగార్చే ఉద్దేశం లేదని కులేబా చెప్పారు. టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్‌ కావుసోగ్లు కూడా చర్చల్లో పాల్గొన్నారు. మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని టర్కీ చాలా వారాలుగా చెబుతూనే ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో నేరుగా మాట్లాడటం ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని ఇజ్రాయిల్‌ భావిస్తోంది. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ కూడా తరచూ క్రెమ్లిన్‌ చీఫ్‌కు ఫోన్లు చేస్తున్నారు. పరిస్థితి ఆశాజనకంగాలేదని ఫ్రాన్స్‌ యూరప్‌ మంత్రి క్లీమెంట్‌ బ్యూనే వెల్లడిరచారు. యుద్ధం ఆగాలన్నదే లక్ష్యమని, ఇందుకోసం రష్యాపై తీవ్ర ఒత్తిడి అవసరమని అన్నారు. కాగా, తాజా పోరులో ఉక్రెయిన్‌ సేనలు చెల్లాచెదురవుతున్నాయి. రష్యా సేనలకు కూడా చాలా వరకు నష్టం వాటిల్లుతోందని పశ్చిమ దేశాల మీడియా పేర్కొంది.(Story: ఆగని యుద్ధం!)

See Also: దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

Pushpa becomes an iconic movie!

దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

0
The Ghost
The Ghost

దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందుతోన్న `ది ఘోస్ట్` భారీ షెడ్యూల్ దుబాయ్లో ప్రారంభం

దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌! కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల హై బడ్జెట్  యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` షూటింగ్ దుబాయ్ లో తిరిగి ప్రారంభమైంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. సినిమాలోని ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ లో నాగార్జున సరసన కథానాయిక గా నటించడానికి ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా బృందం తో జాయిన్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ను కూడా టీమ్ ఆవిష్కరించింది.

నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్లు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో భాగం కావడం ఆనందం గా ఉంది. ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ పాత్రలో నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రం లో ప్రధాన తారాగణం. ముఖేష్ జి కెమెరా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ స్టంట్ డైరెక్టర్లు.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
యాక్షన్: రాబిన్ సుబ్బు మరియు నభా మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
PRO: వంశీ-శేఖర్, BA రాజు (Story: దుబాయిలో ది ఘోస్ట్ హ‌ల్‌చ‌ల్‌!)

Pushpa becomes an iconic movie!

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’

0
Puneeth Raj Kumar James Movie
Puneeth Raj Kumar James Movie

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’

పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజున గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ‘జేమ్స్’

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’ : కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డే‌కి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్‌ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మార్చి 17న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని.. హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.

పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్,
సంగీతం: చరణ్ రాజ్,
సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ,
ఆర్ట్: రవి శాంతేహైక్లు,
పీఆర్వో: బి. వీరబాబు
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్,
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
దర్శకత్వం: చేతన్ కుమార్. (Story: పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’)

See Also: Do You Know About Koo Innovative Features

Bacardi’s Good Man Brandy Out Now

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!

0
69 Samskar Colony
69 Samskar Colony

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!

టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగే ఉద్వేగభరితమైన ప్రేమ కథ #69 సంస్కార్ కాలనీ చిత్రం – సునీల్ కుమార్ రెడ్డి

సమాజంలో జరిగే విషయాలు వాటి సమస్యలు ప్రధాన కథగా తీసుకుని ఒక అందమైన కథనం తో మంచి చిత్రాలు అందించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. ఆయన గతంలో తీసిన వలస, గల్ఫ్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందితే రొమాంటిక్ ఇతివృత్తాలు తీసినప్పుడు ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. ఇప్పుడు #69 సంస్కార్ కాలనీ పేరుతో మరో కథా చిత్రం తో మార్చి 18న మన ముందుకు వస్తున్నారు. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “#69 సంస్కార్ కాలనీ . ఈ చిత్రం మార్చి 18న విడుదల కు సిద్ధంగా ఉంది.

చిత్ర వివరాలు తెలియజేస్తూ “సినిమా చాలా బలమైన మీడియం. సమాజంలో జరుగుతున్న విషయాలను మంచి కథనం తో చెప్తే ప్రేక్షకులకు బాగా అర్థం అవుతుంది. రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులు అయిన ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమా ఆ సంకల్పంతో చేసినవే. ఈ #69 సంస్కార్ కాలనీ చిత్రం కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. సంస్కార్ కాలనీ చిత్రం ఆడవాళ్ళ సున్నిత మానసిక చిత్రంగా చూపించే ఒక సినిమా అందుకే స్వాతి అనే అమ్మాయి ని మా స్టోరీ డిపార్ట్మెంట్ లోకి తీసుకున్నాము.

ఈ చిత్రం మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల గురించి , సమాజంలో జరుగుతున్న వింత పోకడలు గురించి చెప్పే సినిమా.  ఇందులో ఒక టీనేజ్ కుర్రాడికి  ఒక పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన ప్రేమ కథ. దానికి అనుకూలించిన కారణాలు వాటి వల్ల వస్తున్న సమస్యల గురించి చెప్పేదే ఈ సినిమా.

ఇలాంటి కథలు వచ్చాయి కానీ కొత్త కోణం లో చూపించాము. ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించని విషయాలను ఈ చిత్రంలో చుపించాము. కొన్ని విషయాలను ఓపెన్ గానే బలంగా చెప్పాను.

నా చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చింది. పరిణతి చె౦దిన ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది .

అజయ్ గారు భర్త పాత్ర చేశారు. ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఆయన పాత్రకి బాగా న్యాయం చేశారు. ప్రేక్షకులకి అజయ్ గారి పాత్ర బాగా నచ్చుతుంది.

కథ కథనం పూర్తి అయిన తర్వాత ఎస్తర్ గారిని కలిసాను. ఆడిషన్ చేశారు, తాను క్యారెక్టర్ కి బాగా సరిపోతుంది అని తనని మేము తీసుకున్నాము. ఎస్తర్ గారు కూడా కథ విని కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు.

మా నిర్మాత బాపి రాజు గారు నాకు మంచి స్నేహితుడు. బాపి రాజు 17 ఎళ్లగా నా చిత్రాలను డిస్ట్రిబ్యూటర్ గా విడుదల చేశారు. తర్వాత నిర్మాతగా రొమాంటిక్ క్రిమినల్స్ మరియు ఈ సంస్కార్ కాలనీ చిత్రాలు నిర్మించారు. నాతో పని చేసే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గా కలిసిపోతున్నారు. ప్లాప్ వచ్చినా సక్సెస్ వచ్చినా కలిసే ఉన్నారు. ప్రతి సినిమా కి సహాయం గా ఉన్నారు.

ఈ చిత్రం తర్వాత చదలవాడ శ్రీనివాస్ రావు గారు నిర్మాతగా మా నాన్న నక్సలైట్ అనే చిత్రం చేస్తున్నాను. 1995 బ్యాక్ డ్రాప్ లో సాగే తండ్రి కొడుకుల సినిమా. తర్వాత డాక్టర్ ఎల్ ఎన్ రావు, యక్కలి  రవీంద్ర బాబు నిర్మించిన వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం జూలైలో విడుదల చేస్తున్నాము. (Story: టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య…!)

See Also: Do You Know About Koo Innovative Features

Bacardi’s Good Man Brandy Out Now

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

Photo Gallery

error: Content is protected !!