ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.సోమసుందర్ ఎన్నిక
సీనియర్ పాత్రికేయుడు, ఐ.జే.యూ. జాతీయకార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
గుంటూరులో జరిగిన ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర 17 వ మహాసభల ముగింపు సందర్భంగా మార్చ్ 8 వ తేదీ రాత్రి
నూతనకార్యవర్గ ఎన్నికలు జరిగాయి.
21 మంది ఆఫీస్ బేరర్స్ ,61 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు!
రాష్ట్రకమిటీలోని ఎనిమిది మంది ఉపాధ్యక్షులలో ఒకరిగా డి.సోమసుందర్ ఎన్నికయ్యారు.
పాత్రికేయునిగా ,సామాజికకార్యకర్త గా చిరపరిచితులైన
డి.సోమసుందర్ కు 1980 వ దశకం నుంచి కార్మికోద్యమంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి!
తాడేపల్లిగూడెం ప్రాంతంలోని 12 కార్మికసంఘాలకు సోమసుందర్ ప్రత్యక్షంగా సారథ్యం వహిస్తున్నారు!
వేతనఒప్పందాలు చేయడంలో , కార్మికసమస్యల పరిష్కారంలో ఎంతో అనుభవం ఉన్న సోమసుందర్ కార్మిక సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎన్నో సృజనాత్మక ఆలోచనలను ఆచరణలోకి తెచ్చారు!
1999 నుండి ఏ.ఐ.టి.యు.సి. తాడేపల్లిగూడెం ఏరియాకమిటీ ప్రధానకార్యదర్శిగా , 2010 నుండి ఏరియాకమిటీ అధ్యక్షునిగా, 2019 నుండి పశ్చిమగోదావరి జిల్లా శాఖ గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు!
మార్చ్ 6,7,8, తేదీల్లో గుంటూరులో జరిగిన రాష్ట్రమహాసభలో డి. సోమసుందర్ రాష్ట్ర బాధ్యతలకు ఎన్నికయ్యారు!
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కార్మికనాయకుడు రేకా భాస్కరరావు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు!
జిల్లానుండి సీనియర్ కార్మికనేతలు నెక్కంటి సుబ్బారావు, కోనాల భీమారావు, కెల్లా అప్పారావు ,తాడికొండ శ్రీనివాసరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు!
విశాలాంధ్ర దినపత్రికలో 1975 నుండి మూడుదశాబ్దాల పాటు విలేఖరిగా పనిచేసిన డి. సోమసుందర్ ప్రస్తుతం “జనబలం” మాసపత్రిక వర్కింగ్ ఎడిటర్ గా ,”జాతీయస్ఫూర్తి” సంపాదకవర్గ సభ్యుని గా కొనసాగుతున్నారు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర అధ్యక్షునిగా మూడుసార్లు ఎన్నికైన డి.సోమసుందర్ , ప్రస్తుతం ఐ.జే.యు. జాతీయకార్యవర్గ సభ్యునిగా వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నారు! (Story: ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.సోమసుందర్ ఎన్నిక)
See Also: తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details