నిబంధనలను పాటించుకుంటే చర్యలు తప్పవు
రెండవ పట్టణ సి ఐ టి శ్రీనివాసరావు
న్యూస్‌తెలుగు/విజయనగరం : రానున్న వినాయక చవితి ఉత్సవాలలో నిబంధన లు పాటించకుంటే చర్యలు తప్పవని రెండవ పట్టణ సిఐ టి. శ్రీనివాసరావు హెచ్చరించారు గురువారం ఆయన మాట్లాడుతూ శనివారం నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగల్ విండో విధానానికి సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా ఉత్సవాలకు సంబంధించిన కమిటీ సభ్యుల వద్ద ఉండాలన్నారు. ఇప్పటివరకు తమ పరిధిలో సుమారు 200 వరకు ఉత్సవానికి సంబంధించిన అప్లికేషన్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. దీనికి సంబంధించిన అధికారులతో చర్చించి వీరికి అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనుమతి ఇచ్చిన వినాయక బొమ్మని నిలబెట్టిన మండపాలలో తప్పనిసరిగా సభ్యులు 24 గంటలు ఉండేలా చూసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయానికి మించి మైకులు వాడ రాదన్నారు. వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు గొడవలు అల్లర్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత సంబంధిత కమిటీ సభ్యులపై ఉంటుందన్నారు. డిజే బాక్స్, బాణసంచా వినియోగం నిషిద్ధమన్నారు. నిమజ్జనం సమయంలో రంగులు జల్లుకోవడం తదితర చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా రాత్రి 11 దాటిన తర్వాత అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావదన్నారు. వినాయక చవితి పండుగకు సంబంధించి ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు. (Story : నిబంధనలను పాటించుకుంటే చర్యలు తప్పవు)