నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని చెరువును ఆక్రమించారంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి నోటీసులు ఇప్పించి నాపై లేనిపోని ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు ఓ వీడియోలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే నాపై కుట్ర పండడం జరిగిందని, ధర్మవరం మండల పరిధిలోని తుంపర్తి పొలంలో తన తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో సర్వేనెంబర్ 904,905,908 లలో 25.38 ఎకరాలు పొలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఆ పొలములో చీని ఒక్క తదితర పంటలను సాగు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మా కుటుంబీకులకు చెందిన ఫామ్ హౌస్ పై అసత్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. వాస్తవంగా 1932 కు ముందే పట్టాలు పొందిన ఒరిజినల్ రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములు ఇవి అని, అయినా కూడా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా తెలపడం మంచిది కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫామ్ హౌస్ చెరువు ఆక్రమణలో ఉందని నోటీసులు ఇవ్వాలంటూ చెప్పడం జరిగిందన్నారు. హైకోర్టు నోటీసులు కూడా రద్దు చేసిందని తెలిపారు. అదేవిధంగా ఫామ్ హౌస్కు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 43-2,43-2 ఏ,43-2 బి లో ఉన్న భూమిని చట్టం ప్రకారం నుంచి ఎన్ఓసీ తెచ్చుకుని అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి ఆమోదంతో రేగులైజు చేసుకోవడం జరిగిందన్నారు. నాపై అనవసరంగా బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని తెలిపారు.(Story:నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం)