మట్టి గణపతినే పూజించాలి
పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : వినాయకచవితి రోజున మట్టి గణపతి ప్రతిమనే పూజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. మట్టి గణపతి విగ్రహాల ఆవశ్యకతను వివరిస్తూ జిల్లా కాలుష్య నియంత్రణశాఖ రూపొందించిన పోస్టర్‌ను, తమ ఛాంబర్‌లో గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మట్టి గణపతి ప్రతిమను జిల్లా కాలుష్య నియంత్రణ ఇంజనీర్ సరిత కలెక్టర్‌కు బహూకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్‌డి అనిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నేడు మట్టి విగ్రహాల పంపిణీ
విజయనగరంలో ఆర్టిసి కాంప్లెక్స్, పైడితల్లి అమ్మవారి కోవెల, కలెక్టర్ ఆఫీస్, న్యూపూర్ణా జంక్షన్, ఆర్ అండ్‌బి రైతు బజార్ జంక్షన్ల వద్ద శుక్రవారం మట్టి విగ్రహాల పంపిణీ చేయనున్నట్లు పొల్యూషన్ ఇంజనీర్ సరిత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. (Story : మట్టి గణపతినే పూజించాలి)