ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డి.ఎస్.పి కి బీఆర్ఎస్ పార్టీ వినతిపత్రం సమర్పించారు.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకులు,తెలంగాణ జాతిపితగా రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు ని రాజ్యాంగ పదవిలో ఉండి శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సి.ఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ యువత,విద్యార్థి నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్,బి.లక్ష్మయ్య,వాకిటి.శ్రీధర్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,కురుమూర్తి యాదవ్,వేణు గోపాల్ సార్,బండారు.కృష్ణ, నాగన్న యాదవ్, ఉంగ్లమ్. తిరుమల్,ఎర్ర.శ్రీను, డ్యానియాల్, ఎన్.సుబ్బు,A.k.పాషా,కరుణాకర్, దెవర్లా.నరసింహ,బాబు నాయక్ సురువంశపు.గిరి,హేమంత్ ముదిరాజ్, జోహేబ్బ్హు స్సేన్,చిట్యాల.రాము,స్టార్.రహీమ్,రామస్వామి,క్రాంతి,ఖాదర్షా తదితరులు ఉన్నారు.(Story:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి)