Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జ‌గ‌న్‌..జ‌స్ట్ ఫైవ్ మినిట్స్‌! అలా వచ్చి..ఇలా వెళ్లి..!

జ‌గ‌న్‌..జ‌స్ట్ ఫైవ్ మినిట్స్‌! అలా వచ్చి..ఇలా వెళ్లి..!

0

జ‌గ‌న్‌..జ‌స్ట్ ఫైవ్ మినిట్స్‌! అలా వచ్చి..ఇలా వెళ్లి..!

ఎట్టకేలకు అసెంబ్లీకి జగన్‌
5 నిముషాలకే పరిమితం
పతిపక్ష హోదా కోసం నినాదాలు
గవర్నర్‌ ప్రసంగం బాయ్‌కౌట్‌

న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సోమవారం నుంచి ఈ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనుకున్నట్లుగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం కొనసాగింపు సమయంలో కేవలం ఐదు నిముషాలపాటే ఉండి..ఆ తర్వాత వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గవర్నరు ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేశారు. జగన్‌ రాకతో అసెంబ్లీలో మంచి వేడి, వాడి చర్చ కొనసాగుతుందని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. దానికి విరుద్ధంగా జగన్‌ టీమ్‌ వ్యవహరించింది. గవర్నరు ప్రసంగం ప్రారంభమైన ఐదు నిముషాల్లోనే వెనక్కి రావడం చర్చానీయాంశమైంది. గవర్నర్‌ ప్రసంగానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతూ.. కాసేపు గంద‌ర‌గోళం సృష్టించారు. వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు చేరుకొని, నిరసనలు తెలిపారు. ఏపీ ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నుంచి ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని నినదించారు. ఆ తర్వాత సభను వాకౌట్‌ చేశారు. ఐదు నిముషాలు నినాదాలు చేసిన అనంతరం వైఎస్‌ జగన్‌తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ వెలుపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వానికి చిన్న చూపని, ప్రతిపక్ష హోదా కల్పించాలని మొదటి నుంచి కోరుతున్నామని చెప్పారు. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం అని గుర్తుంచుకోవాలని, రైతుల సమస్యలపై గొంతు విప్పాలంటే మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందని, రైతు సమస్యలపై పోరాడుతుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ పేరుతో కేసులు పెడుతున్నారని, అదే మ్యూజికల్‌ నైట్‌లకు ఎన్నికల కోడ్‌ వర్తించదా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని, ప్రభుత్వం చొక్కా పట్టుకుని నిలదీస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి, తాలిబాన్లకు పెద్ద తేడాలేదని, వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్‌ కీలక సమావేశాన్ని నిర్వహించారు. గవర్నర్‌ అనంతరం అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు. (Story: అలా వచ్చి..ఇలా వెళ్లి..!)

Follow the Stories:

జగన్‌ టీమ్‌కు అనర్హత భయం!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version