UA-35385725-1 UA-35385725-1

మున్సిపల్ టీచర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించండి

మున్సిపల్ టీచర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించండి

సత్యాగ్రహ దీక్ష లో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రారెడ్డి డిమాండ్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కేంద్రం పిలుపుమేరకు ధర్మవరం పట్టణ యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికై సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, తదుపరి వారు మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి సుమారు 10 సం.లు కావస్తున్నది అని, ఈ నాటికీ ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ ఉపాధ్యా యులకు వర్తించే అన్ని సౌకర్యాలు, ఉత్తర్వులు, ఇదే విద్యా వ్యవస్థలో ఉన్న మున్సిపల్‌ టీచర్లకు మాత్రం వర్తించడం లేదు అని మండిపడ్డారు.
మున్సిపల్‌ హైస్కూల్స్‌లో ఇప్పటికీ తగినంత మంది సబ్జెక్టు టీచర్లు లేరు. 3,4,5 తరగతులను విలీనం చేశారే తప్ప, ఆ తరగతులు బోధించడానికి స్కూల్‌ అసిస్టెంట్‌ లను ఇవ్వలేకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.ప్రమోషన్లు, బదిలీలు కూడా రెగ్యులర్‌గా జరగడం లేదు అని, ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు అని, అయోమయ పరిస్థితిలో ఉండడం జరుగుతోంది అన్నారు. ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ టీచర్లకు ఇచ్చినట్లే మున్సిపల్‌ టీచర్లకు అర్బన్‌ ఎంయిఓ పోస్టులు ఇవ్వాల్సి వుంది అని తెలిపారు. ఇక మున్సిపల్‌ టీచర్ల పిఎఫ్‌ ఖాతాలు మున్సిపాలిటీలలో నిరుపయోగంగా పడి ఉన్నాయి అని, జీతాల నుండి మినహాయించే సొమ్ము వారి ఖాతాలకు జమ చేసేందుకు గాని, ఖాతాలలో ఉన్న సొమ్ము అవసరాలకు వినియోగించు కునేందుకు గాని అవకాశం లేకుండా పోవడం దారుణమన్నారు.
ఈ సమస్యలపై ఎన్నిమార్లు ప్రాతినిధ్యం చేసినా, అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ టీచర్ల ఆందోళన రోజు రోజుకూ తీవ్రమవుతున్నది అని, ఈ నేపథ్యంలో వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్యాచరణ చేపట్టామని తెలియచేసారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష విజయవంతం అయిందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మున్సిపల్‌ హైస్కూళ్ళలో తగినంత మంది సబ్జెక్టు టీచర్లను నియమించేందుకు వీలుగా ఎస్‌జిటి, పండిట్‌, పియిటి పోస్టులను అప్‌ గ్రేడ్‌ చెయ్యాలి అని, నవంబర్‌లోగా అప్‌గ్రేడెడ్‌ పోస్టులలో మున్సిపల్‌ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అని, మున్సిపల్‌ ప్రధానోపాధ్యాయుల్లో అర్హులైన వారిని అర్బన్‌ ఎంయిఓలుగా నియమించాలి అని, మున్సిపల్‌ టీచర్లకు జిపిఎఫ్‌ ఖాతాలు తెరిపించాలి అని, మున్సిపల్‌ పాఠశాలల్లో నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమించేలా తగిన చర్యలు వెంటనే చేపట్టాలి అని, మున్సిపల్‌ టీచర్ల బదిలీలు వెంటనే చేపట్టాలని ప్రకభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో జిల్లా యుటిఎఫ్ అడిట్ కమిటీ మెంబర్ రామకృష్ణనాయక్, ధర్మవరం పట్టణ, అధ్యక్ష, ప్రధాన, కార్యదర్శులు హరికృష్ణ , సాయి గణేష్, నాయకులు లక్ష్మయ్య రాంప్రసాద్, రామాంజనేయులు ఆంజనేయులు , మేరీ వర కుమారి ,లతా దేవి, నాగేంద్రమ్మ, మణిమాల, విజయ రాణి , నాగేంద్ర కుమార్, సకల చంద్రశేఖర్, సురేష్, వినయ్ కుమార్, గోపాల్ రెడ్డి ,హరి శంకర్ , అమర్ నారాయణరెడ్డి లక్ష్మీనారాయణ , కృష్ణ కిషోర్, రామకృష్ణారెడ్డి, రాము నాయక్ ,సాయినాథ్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఖాజా మొహిద్దీన్, ఆంజనేయులు, నాగరాజు, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఆదిశేషు, చంద్రశేఖర్ రెడ్డి , సిఐటియు నాయకులు జె.వి రమణ మద్దతును, సంఘీభావాన్ని తెలియజేశారు అని తెలిపారు. (Story : మున్సిపల్ టీచర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించండి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1