మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శం
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాయగూరల మార్కెట్ వద్ద గల వాల్మీకి విగ్రహానికి, వాల్మీకి జయంతి సందర్భంగా ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకులకు ఆరాధ్య దైవం వాల్మీకి మహర్షి అని, వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలిపారు. అధర్మం నుంచి ధర్మం వైపు అసత్యము నుంచి సత్యం వైపు సమాజాన్ని నడిపించాలన్నదే వాల్మీకి మహర్షి యొక్క ఆశయము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శం)