అవగాహన లేని రోడ్ల నిర్మాణంతోనే రాజప్రసాదం లోకి వర్షపు నీరు
ఎన్ని ఇబ్బందులు ఉన్న రాజప్రసాదన్ని కాపడుకుంటాం
ఎమ్మెల్యే మేఘా రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాకే తల మాణికంగా ఉండే రాజప్రసాదం (రాజా గారి బంగ్లా) పాలిటెక్నిక్ కళాశాలలో ముందస్తు ఆలోచన, అవగాహన లేకుండా ఏర్పాటు చేసిన సిసి రోడ్లు నేడు రాజప్రసాదానికే ఇబ్బందిగా మారాయని, వాటి నిర్మాణంతో వర్షపు నీరు పూర్తిగా రాజమహల్ లోకి చేరి రాజమహల్ కి ముప్పు వాటిల్లేల ఉందని, గొప్ప చరిత్ర కలిగిన రాజప్రసాద్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మేఘా రెడ్డి గారు పేర్కొన్నారు
శనివారం ఆయన, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి రాజభవనాన్ని సందర్శించి పరిశీలించారు.
రాజ భవనంలోకి నీరు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే నీటిపారుదల శాఖ డ్యామ్ సేఫ్టీ అధికారి వనపర్తి వాస్తవ్యుడైన శ్రీనివాస్ రెడ్డి గారి సహకారం తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు
గత ప్రభుత్వ పాలకూడా లాగా ఇష్టానుసారంగా పనులు చేయకూడదని, హిస్టారికల్ ప్లేస్ లైన్ ఇలాంటి వాటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఎంఎల్ఏ సూచించారు
త్వరలోనే రాజ ప్రసాదానికి పూర్వపుకల వచ్చేలా తీర్చిదిద్దుతామని అయన అన్నారు.
పట్టణ వాసులు, జిల్లా వాస్తవ్యులు, మేధావులు విజ్ఞులు, పెద్దలు సైతం హిస్టారికల్ ప్లేస్ లను కాపాడుకునేందుకు తమ వంతుగా సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చుక్క రాజు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : అవగాహన లేని రోడ్ల నిర్మాణంతోనే రాజప్రసాదం లోకి వర్షపు నీరు)