సీడ్ మొక్కజొన్న కంపెనీల ఆగడాలను అరికట్టండీ
న్యూస్ తెలుగు/చాట్రాయి : సీడ్ మొక్కజొన్న కంపెనీల ఆగడాలను ప్రభుత్వం అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా నాయకులు నిమ్మగడ్డ నరసింహా డిమాండ్ చేశారు.గురువారం సాయంత్రం ఆయన చాట్రాయి లో మాట్లాడుతూ. కొన్ని సీడ్ మొక్కజొన్న కంపెనీలు నేటికీ రైతులకు పంట డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వల్ల సీడ్ మొక్కజొన్న కంపెనీలు రైతుల్ని నిలువునా మోసం చేస్తున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఆయా సీడ్ మొక్కజొన్న కంపెనీలు తప్పనిసరిగా విత్తనం వెరైటీ, పంట దిగుబడి వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ సీడ్ మొక్కజొన్న కంపెనీ అయినా రైతుల్ని మోసం చేయకుండా ప్రభుత్వం సీడ్ ఆర్గనైజరలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేయాలని డిమాండ్ చేశారు.విత్తన చట్టం అమలు చేయించాలని డిమాండ్ చేసారు.గ్రామస్తాయిలో విత్తన కంపెనీలు కమీషన్ ఏజెంట్ల ద్వారా మాయమాటలు చెప్పించి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ద్వజమెత్తారు.(Story:సీడ్ మొక్కజొన్న కంపెనీల ఆగడాలను అరికట్టండీ)