‘ఐప్సో’జిల్లా సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం లిటిల్ బర్డ్స్ స్కూల్లో ప్రపంచ శాంతి సంఘీభావ సంఘం(ఐప్సో) వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 155 వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ శాంతి అహింస మార్గాల ద్వారా స్వాతంత్రం సాధించారని అదే స్ఫూర్తితో ప్రతి వ్యక్తి ప్రపంచశాంతికి ఐక్యంగా కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఐప్సో జిల్లా అధ్యక్షుడు వనగంటి నాగేశ్వర్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు,ఐప్సో జిల్లా ప్రధాన కార్యదర్శి శివ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్న రాములు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు తదితరులు మాట్లాడారు. సీ.ఎన్ శెట్టి, శ్రీరామ్, రమణ, కుతుబ్, మహేష్, విష్ణు, చంద్రశేఖర్, రవి, వెంకటేశ్వర్లు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ‘ఐప్సో’జిల్లా సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు)