ఘనంగా గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ జాషువా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాలు అధ్యక్షులు సిహెచ్ జాన్ సుందర రావు చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు జాషువా కళా ప్రాంగణం వద్దగల విగ్రహానికి శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళా ప్రాంగణం నందు ఏర్పాటుచేసిన సభలో పాల్గొని “”2024 రాష్ట్రస్థాయి జాషువా విశిష్ట సాహితి మరియు కళా రంగ పురస్కార ప్రధానము”” వినుకొండ వాసి ( బంగారు కంకణ గ్రహీత) ప్రముఖ రంగస్థలం కళాకారుడు షేక్. సత్తార్, మరియు కందుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత నంది అవార్డు గ్రహీత సూరపోగు ఏసుదాసు వీరికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పురస్కార ప్రధానము మరియు ప్రశంసా పత్రం షీల్డ్ పూలమాలలతో దుశ్యాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుర్రం జాషువా ఆంధ్రప్రదేశ్ శాసన మండల సభ్యునిగా నియమితుడయ్యాడని ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందజేశారు. కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గిజం ,నవయుగ కవి చక్రవర్తి ,మధుర శ్రీనాథ్, విశ్వ కవి సామ్రాట్, గా ప్రసిద్ధుడయ్యాడని మన వినుకొండ ఆణిముత్యం విశ్వనరుడయ్యాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక సమస్య కోశాధికారి భాగవతుల రవికుమార్, కార్యదర్శి రెడ్డి బోయిన ప్రసన్నకుమార్, ప్రోగ్రాం కన్వీనర్ పిడుగు విజయ్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాలు)