సమాజం పట్ల బాధ్యత సేవాగుణం అలవర్చుకోవాలి
ప్రిన్సిపాల్ ప్రశాంతి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : చదువు విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత సేవా గుణమును అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జాతీయ సేవ పథకం దినోత్సవం వేడుకలను అధ్యాపకులు, విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ
1969 సెప్టెంబరు 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు జాతిపిత గాంధీజీ శతజయంతి సందర్భంగా 37 విశ్వవిద్యాలయాలలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించారు అని తెలిపారు.చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం పెంపొందాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ జాతీయ సేవా పథకాన్ని ఎన్ఎస్ఎస్ అని పిలుస్తారు అని తెలిపారు. ఎన్ఎస్ఎస్ వల్ల విద్యార్థిలో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని తెలిపారు. “స్వప్రయోజనం ప్రజా సేవను అధిగమించినప్పుడు, సమాజం అవినీతి భారంతో కుప్పకూలిపోతుంది.” అని కెన్ పోయిరోట్ తెలపడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సి. కుళ్లయి రెడ్డి, అధ్యాపక, బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : సమాజం పట్ల బాధ్యత సేవాగుణం అలవర్చుకోవాలి)