బాబా ఖాదర్ వలి ఉరుసు మహోత్సవం షురూ!
విజయనగరం (న్యూస్ తెలుగు): విజయనగరం అధ్యాత్మిక చక్రవర్తి, హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలి ర.అ. 65వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలువాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు మంగళవారం ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్ షరీఫ్ పఠనంతో ఉరుస్ మహోత్సవం ప్రారంభమయ్యాయి. అనంతరం ఖాదర్ బాబా దర్భార్ నుంచి ఖాదర్ బాబా ప్రియ శిష్యులు హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదర్ బాబా వారి సూఫీ ఆధ్యాత్మిక వారసులైన చీమల పాడు సూఫీ పీఠాధిపతి మొహమ్ముద్ ఖ్వాజా మోహియునుద్దీన్ షా తాజ్ ఖాదరి, విజయనగరం దర్గా, దర్బార్ షరీఫ్ ముతవల్లి డా. మొహమ్ముద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ నేత్రుత్వంలో అశేష బాబా భక్తులు, ప్రేమికులతో కలిసి ఫకీర్ మేళా, డప్పు వాయిద్యాలతో ఖాదర్ బాబా దర్గాకు ఊరేగింపుగా వెళ్లి బాబా దివ్య సమాధికి సుగంధ పరిమళ ద్రవ్యాలను, పూలు, గజమాలలుతో చాదర్ సమర్పణ గావించారు. విశ్వ శాంతి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేసి దర్గా సన్నిధిలో జెండా స్థాపన చేసి ఉరుసు మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. భారీగా తరలి వచ్చిన భక్తుల కోసం దర్బార్లో ఏర్పాటు చేసిన బారీ లంగర్ ఖానాలో దివ్య అన్న సమారాధనను ఖ్వాజా బాబా ప్రారంభించి అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్బంగా సూఫీ పీఠాధిపతి సజ్జాద నషీన్ ముహమ్మద్ ఖాజా మోహియుద్దీన్ షా ఖాదరి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఉరుసులో ప్రధాన ఘట్టం బుధవారం జరుగుతుందని తెలిపారు. బాబా ఖాదర్ వలి జీవించి ఉన్న కాలంలో చిత్రీకరించిన ఆయన చిత్ర పటాన్ని చాదర్, పూలు, సుగంధ ద్రవ్యాలతో ఒక ప్రత్యేక వాహనంపై ఉంచి నషాన్, చాదర్, సందల్ షరీఫ్ లతో, ఫకీర్ మేళా ఖవ్వాలీలతో దర్బార్ షరీఫ్ నుంచి నగర పుర వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం అశేష భక్తుల కోసం భారీ లంగర్ ఖానాలో దివ్య అన్న సమారాధన అర్ద రాత్రి వరకు నిర్వీరామంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం జరిగే చాదర్ సమర్పణ, దస్తార్ బందీ, భక్తులకు తబరుక్ ప్రసాదాల పంపిణీ, సలామ్ ఖుల్ షరీఫ్ తో ఉరుస్ సమాప్తం అవుతుందన్నారు.
ఖాదర్ బాబా ఆధ్యాత్మిక విప్లవ కారుడు : ఖ్వాజా మోహియునుద్దీన్
భారత్ దేశంలో 850 ఏళ్ళ క్రితం హజరత్ బాబా ఖ్వాజా మోహియునుద్దీన్ ద్వారా సూఫీ సంప్రదాయమనే ఆధ్యాత్మిక విప్లవం వచ్చిందని ఆ మార్గంలో ఉద్భవించిన అధ్యాత్మిక విప్లవకారుడు హజరత్ బాబా ఖాదర్ వలి అని కీర్తించారు. ఆయన ద్వారా 1900 నుంచి 1961 వరకు విజయనగరంలో అధ్యాత్మిక విప్లవం పురుడుపోసుకుందన్నారు. ఈ ఆధ్యాత్మిక విప్లవం ద్వారా ఖాదర్ బాబా అనేక మంది ముస్లిం, ముస్లిమేతరులను సూఫీ పరంపర వారసులుగా తీర్చిదిద్దారని అన్నారు. అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తిని ఫరీద్ మస్తాన్ అవులియాగాను , ఖమ్మంలో బెల్లంకొండ లక్ష్మి నారాయణను బాబా అజీమ్ ఖాన్ గా, మారుమూల కృష్ణా జిల్లా చీమలపాడులో ఒక బాలుడిపై తన కృపా కటాక్షాల నుంచి అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబాగాను తయారు చేసారని అన్నారు. విజయనగరం ఖాదర్ బాబా దర్గా విశ్వ శాంతికి నిలయమని, జాతీయ సమైక్యతకు చిరునామా అని, ప్రేమ, సత్యం, దయ అనే అధ్యాత్మిక పునాదు రాళ్లతో ఈ పుణ్య క్షేత్రం నిర్మితమైందని అన్నారు. విశ్వ విస్పోటనంకి అణు బాంబులు, హైడ్రోజన్ బాంబులు కారణం కాదని, మనుషుల్లో ఉన్న కోపం, అసహనమే అతిపెద్ద కారణమని బాబా ఉద్భోదించారు. మనిషిలో ఉన్న కోపమే కుటుంబాలను, జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రాంతాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. వ్రతాలు, యగ్జయాగాలు చేసి చోట కన్నా సహనంతో ఉన్న వారి పక్కనే భగవంతుడు నెలవై ఉంటాడని ప్రవచించారు. సాటి మనిషిని ప్రేమతో చూడాలని, అదే భగవంతుడుని చేరుకునే సరళమైన మార్గమని విశ్వ సమాజానికి పిలుపునిచ్చారు. (Story: బాబా ఖాదర్ వలి ఉరుసు మహోత్సవం షురూ!)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!