తహశీల్దార్, ఆర్డివో పై చర్యలు తీసుకోండి
– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జర్నలిస్టు యన్.నాగార్జున
న్యూస్‌తెలుగు/బాపట్ల: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అతని రక్తసంబందీకులు, ప్రధాన అనుచరుల నుండి నాకు ప్రాణహాని నుండి రక్షణ కల్పించమని దాఖలు చేసిన ఫిర్యాదులను ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేసి వరుస భౌతిక దాడులు, హత్యాప్రయత్నలకు సహకరించిన తహశీల్దార్, ఆర్.డి.ఓ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగానూ, సంబంధిత అధీకారుల నుండి నష్టపరిహారం ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలనీ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ జేవి మురళి కలిసి జర్నలిస్ట్ నాగార్జున ఫిర్యాదు చేశారు. గత 15 సంవత్సరాలుగా ఆమంచి కృష్ణమోహన్ అధికార పార్టీల పంచన చేరుతూ చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, భూకబ్జాలు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, హత్యాప్రయత్నాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చేస్తున్న అనేక నేరాలు – అవినీతిని ఒక జర్నలిస్టుగా బహిర్గతం చేశానని నా పై కక్షగట్టి, నన్ను పలుమార్లు హత్య చేయడానికి ప్రయత్నించిన విషయమై చేసిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని నాగార్జున ఫిర్యాదుల పేర్కొన్నారు. నాకు ప్రాణహాని ఉన్నదని తెలిపినప్పటికీ వ్యవస్తీకృత నేరస్తుడు ఆమంచి కృష్ణమోహన్ ప్రలోభాలకు లొంగి, భారత రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు భంగం కలిగించారనీ , పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, సదరు నేరస్తులతో ప్రభుత్వ యంత్రాంగం కుమ్మక్కు అయిన కారణంగా పలుమార్లు వారి చేతిలో దాడులకు గురై ప్రాణాపాయ స్థితి నుండి బయట పడిన పడినప్పటికీ, ఆరోగ్యపరంగా- ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాననీ నాగార్జున ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన పలు దాడుల్లో కనీసం ప్రధాన నేరస్తులపై కేసు నమోదు చేయడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం కనీసం ప్రయత్నం చేయకపోగా సదరు కేసులను నీరుకార్చారన్నారు. ఆమంచి కృష్ణమోహన్, అతని రక్తసంబందీకులు, ప్రధాన అనుచరుల నుండి రక్షణ కల్పించమని దాఖలు చేసిన ఫిర్యాదులను ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేసి, నాపై జరిగిన వరుస భౌతిక దాడులు, హత్యాప్రయత్నలకు సహకరించిన తహశీల్దార్, ఆర్.డి.ఓ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవలనీ, ఫిర్యాదులపై ఉద్దేశ్యపూర్వకంగా, నిర్లక్ష్యంగా, కుట్రపూరితంగా వ్యవహరించి అధికార విధులను దుర్వినియోగం చేసిన తహసిల్దార్, ఆర్డీవోలపై చట్టపరమైన చర్యలు తోపాటు, వ్యక్తిగతంగా నష్టపరిహారం ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను జర్నలిస్టు నాగార్జున కోరారు. (Story : తహశీల్దార్, ఆర్డివో పై చర్యలు తీసుకోండి)