ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!
Cash Transfer: తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా బియ్యం అందజేస్తున్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడూ కందిపప్పు, పంచదార కూడా ఇచ్చేవారు. అయితే చాలా మంది బియ్యాన్ని అమ్ముకుంటున్నారని, తినడం లేదని ఆరోపణలు విన్పించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బియ్యానికి బదులుగా నగదు బదిలీ పథకాన్ని తీసుకురావాలని యోచించింది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నది. దీని ప్రకారం కిలో బియానికి 15 నుంచి 20 రూపాయల వరకు నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమచేయాలని అనుకున్నది. నిజానికి చాలామంది లబ్ధిదారులు తమకు వచ్చిన బియ్యాన్ని కిలో 5 నుంచి 8 10 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఇది ప్రతిచోటా జరిగేదే. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సర్కారు బియ్యాన్ని అసలు తినడం లేదు. పాలిష్‌డ్ బియ్యానికి అలవాటు పడిన ప్రజలు రేషను బియ్యాన్ని నిరాకరిస్తున్నారు. పల్లెటూళ్లలో రేషన్ బియ్యాన్ని మెజారిటీ ప్రజలు తింటున్నారు. పంటపొలాల్లో పనిచేసే పల్లెటూరి ప్రజలకు రేషన్ బియ్యం విలువ తెలుసు. పాలిష్‌డ్ బియ్యం కన్నా రేషన్ బియ్యమే ఆరోగ్యానికి మంచివి. చాలామంది అక్రమ వ్యాపారులు జనం వద్ద రేషన్ బియ్యాన్ని కొనుక్కొని వాటిని రెండోసారి, మూడోసారి పాలిష్ చేసి కిలో 48 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇదొక రకమైన దందా. దీన్ని అడ్డుకోవాలంటే, నగదు బదిలీ పథకమే బెస్ట్ అని ప్రభుత్వం భావించింది. ఒక విధంగా ఈ పథకం మంచిదే. అయితే తాజాగా ఏపీ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా సమాచారం. కాకపోతే నగదు బదిలీ పథకాన్ని ఆపడమనేది తాత్కాలికమే అంటున్నప్పటికీ, పూర్తిగా దీనిపై వెనక్కి తగ్గవచ్చని భావిస్తున్నారు. బియ్యానికి బదులు నగదు బదిలీని ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేశారు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించిన యాప్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేశామని ఆయన తెలిపారు. నగదు బదిలీపై తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటే సమాచారం తెలియజేస్తామన్నారు. విజయవాడలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ విషయం తెలిపారు. ఇది తాత్కాలికమే అంటున్నప్పటికీ, శాశ్వతంగా ఈ నగదు బదిలీ నిర్ణయానికి స్వస్తిచెప్పడానికి ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లుగా వినికిడి. (Story: ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!)
See Also:
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి