Homeవార్తలుకిర్లోస్కర్ తక్కువ వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్స్ విడుద‌ల‌

కిర్లోస్కర్ తక్కువ వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్స్ విడుద‌ల‌

“అధిక సామర్ధ్యంతో తక్కువ వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్స్” ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన కిర్లోస్కర్ మోటార్స్

పూనేమార్చి 29, 2022; కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ (కేఓఈఎల్), ఈ సంస్థ ఇంజిన్లు, పవర్ జనరేటర్ సెట్లు, మరియు వ్యవసాయ పరికరాల తయారీలో పరిశ్రమ లీడర్‌గా ఉంటూ, అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ప్రజల జీవితాలలో మార్పు తీసుకొస్తోంది. కొత్త ఉత్పత్తులు, సేవలను ప్రారంభించడం ద్వారా కస్టమర్ల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాలనే లక్ష్యంతో, పరిశ్రమల వ్యాప్తంగా అన్ని అప్లికేషన్‌లలో యంత్రాలకు శక్తినిచ్చే అధిక సామర్ధ్యంతో కూడిన తక్కువ వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్‌లను కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ సగర్వంగా లాంచ్ చేసింది.

ఉన్నత శ్రేణి ప్రదర్శన మరియు సామర్ధ్యాన్ని నిర్ధారించేందుకు, ఈ మోటార్లు ఉత్తమ-గ్రేడ్ కాపర్‌తో తయారు చేయబడతాయి, అలాగే బీఐఎస్ ఆమోదం పొందిన, ఎన్ఏబీ గుర్తింపు పొందిన పరీక్షా ల్యాబ్‌లో టెస్ట్ చేయబడతాయి. నాణ్యమైన ఉత్పత్తుల శ్రేణికి, అద్భుత విక్రయ మరియు సేవా నెట్‌వర్క్ మద్దతు అందించగా, “అంచనాలకు మించిన ప్రదర్శన చేయడం” అనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ మోటార్ల మార్కెట్లోకి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ ఘనంగా ప్రవేశిస్తోంది.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మిఅతుల్ కిర్లోస్కర్ మాట్లాడుతూ, మేము మా వినియోగదారులను సంతృప్తి పరిచే ప్రొడక్ట్‌లుసొల్యూషన్స్‌ అందించేందుకుఅలాగే వారికి ఖర్చు ఆదా చేయడంలో సహాయపడేందుకు ఎప్పుడూ ముందడుగు వేస్తాముఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూకిర్లోస్కర్ మోటార్స్ అందించే కొత్త శ్రేణిని పరిచయం చేయడంపై మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాముఇవాళ విడుదల చేస్తున్న ఉత్పత్తుల శ్రేణి లాంచ్‌ను మా విస్తృత డీలర్ల నెట్‌వర్క్‌కుమరియు మేము ఈ చర్య చేపట్టాలని ఆతృతగా ఎదురుచూస్తున్న మా వినియోగదారులకు అంకితం చేస్తున్నాముమేము కొత్త విస్తరణ ప్రణాళికలను నిర్వహిస్తున్నాముశక్తివంతమైన పరిశోధన మరియు అభివృద్ధి ప్లాట్‌ఫామ్‌లను రూపొందిస్తున్నాముమరియు కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాముమా కొత్త శ్రేణి మోటార్లకు ఉన్న అధిక సామర్ధ్యం కారణంగాశ్రేణిలో ఉత్తమ ప్రదర్శన చేస్తాయి మరియు విద్యుత్ వినియోగం తగ్గిస్తాయి,”అన్నారు. 

ఈ సందర్భంగా కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్కుమారీ గౌరి కిర్లోస్కర్ మాట్లాడుతూ, మేము అవలంబించే నిరంతరమైన చురుకైన ప్రణాళిక మరియు వ్యూహాత్మక చర్యలుమిమ్మల్ని ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌ అందించడంలో గుర్తింపు పొందిన సంస్థగా మార్చాయిడీజిల్ ఇంజిన్లలో ప్రధాన భూమిక పోషిస్తున్నాఎలక్ట్రిక్ మోటార్ల విభాగంలో మేము వేసిన ఈ ముందడుగు మా ఉనికిని మెరుగుపరచడమే కాకుండాస్థిరత్వం అందిస్తుంది,”అని తెలిపిన ఆమె ఈ అంశాన్ని కూడా జోడించారు, ఈ మోటార్లు అసాధారణమైన నాణ్యత కలిగి ఉంటాయిఅలాగే ఇవి అత్యధిక స్థాయిలో విశ్వసనీయతమన్నిక మరియు సామర్ధ్యం కలిగి ఉంటాయి.

ఈ మోటార్ శ్రేణి ప్రారంభించడం ద్వారా, తమ అపరిమిత వ్యాపార దృక్పథానికి అనుగుణంగా, వినూత్న ఉత్పత్తులను అందించడంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ చొరవను నిర్ధారిస్తుంది. (Story: కిర్లోస్కర్ తక్కువ వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్స్ విడుద‌ల‌)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!