UA-35385725-1 UA-35385725-1

94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం!

94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం!

మహిళల్లో విటమిన్ ‘డి’ లోపం వ్యాప్తి అంచనాలు 50% నుండి 94% వరకు ఉన్నాయి –  నిర్ధారణ అయిన సంఖ్య మొత్తంలో అతి కొద్ది భాగం మాత్రమే!

ఇంటిలోనే ఉండడం మరియు అనారోగ్యకరమైన ఆహార జీవనశైలి వ్యాధికి శాపంగా మారుతున్నాయి.

94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం! : ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (FOGSI) పల్స్ ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి భారతీయ మహిళల్లో విటమిన్ ‘డి’ లోటును తగ్గించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాయి. ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్, డాక్టర్ శాంతకుమారి మరియు పల్స్ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ రాంబాబు ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంలో వివిధ సూచనలతో విటమిన్ ‘డి’ తగిన స్థాయిలపై అవగాహన కల్పిస్తూ, చికిత్సకు సంబంధించిన సైంటిఫిక్ ప్రాక్టీస్ పాయింట్లను రూపొందించడం ద్వారా ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించారు.

భారతదేశంలో స్త్రీల ఆరోగ్యం నానాటికీ తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నది. మహిళల శ్రేయస్సు మరియు రోగనిరోధక శక్తి స్థాయిలు దృఢంగా ఉండాల్సిన వారి మొత్తం ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఏది ఏమైనప్పటికీ, మహిళల ఆరోగ్యం క్షీణించడానికి తాజాగా వెల్లడైన ప్రధాన సూచికలలో ఒకటి విటమిన్ ‘డి’ లోపం. ఈ లోపం చాలా సాధారణమైనదిగా గుర్తించబడినప్పటికీ సాధారణంగా చూస్తే ఇది రోగలక్షణం కాదు. వయస్సువారీ వర్గాలలో 50% నుండి 94% వరకు ప్రాబల్యం ఉన్నట్లుగా యాదృచ్ఛికంగా గత దశాబ్దంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి మరియు దీని ప్రాబల్యం దేశవ్యాప్తంగా కనిపించింది. ఇతర వ్యాధులకు చికిత్స పొందుతున్నప్పుడు మరియు కొన్ని సందర్భాల్లో తరచుగా ఇది సరిదిద్దలేనంత లోపంగా ఉంటున్నది.

ఈ నిశ్శబ్ద రుగ్మతపై అవగాహన కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కేవలం రోగులకు మాత్రమే పరిమితం చేయడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. విటమిన్ ‘డి’ లోపం సమస్యను ఎదుర్కోవడానికి వైద్య సమాజం సహకారం కూడా చాలా అవసరం. టైమ్స్ ఆఫ్ గైనకాలజీ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించే సూచనలపై శాస్త్రీయమైన చర్చలను చేయడం ద్వారా వైద్య సమాజంలో దీనిపై అవగాహన పెంపొందించడానికి మరియు ఈ అంశం ఊపందుకోవడానికి సరైన మార్గం అని డాక్టర్ శాంతకుమారి అన్నారు. FOGSI కు నేను అధ్యక్షురాలిని, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండి ఈ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిని. FOGSI భారతదేశంలో 262 సంఘాలతో 38000 మంది గైనకాలజిస్టుల సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 132 దేశాలలో ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్ FIGO కు ట్రస్టీగా ఉన్నాను. మనం ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో గత రెండు సంవత్సరాలుగా COVID మనకు నేర్పింది. శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యవంతమైన శరీరం అవససరం. బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. స్త్రీలైనా, పురుషులైనా ప్రజల ఆరోగ్యంపై మనం పెట్టుబడి పెట్టాలి. దురదృష్టవశాత్తూ మహిళల్లో సూక్ష్మ మరియు స్థూల పోషకాల యొక్క అధిక లోపాన్ని మనం చూస్తున్నాము, సాధారణ సమస్యలలో ఒకటి రక్తహీనత, అయినప్పటికీ దీని ప్రాబల్యం 80% నుండి 90% వరకు తగ్గింది, అయితే ఇప్పటికీ జనాభాలో 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మన దేశంలో ప్రబల సమస్య సూక్ష్మ మరియు స్థూల పోషకాలతో పాటు ఐరన్ లోపం, రక్తహీనత. మన దేశంలోని అన్ని ఆరోగ్య సమస్యలకు మూలం పోషకాల లోపమే కారణం. ఈ పోషకాహార లోపానికి కారణం మనం తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన సరైన పోషకాలు లేకపోవడమే. మనం ఆచరించే జీవనశైలి కూడా ఆరోగ్యకరమైన జీవితానికి కావలసినవన్నీ అందివ్వడం లేదు. అది పంటలను పండించడానికి ఉపయోగించే పురుగుమందులు కావచ్చు, అనారోగ్యకరమైన జీవనశైలి మార్పులు, పర్యావరణ కారకాలు శరీరంకు కావలసిన సూక్ష్మ మరియు స్థూల పోషకాల అవసరాలను ప్రభావితం చేస్తాయి మరియు పోషకాహార లోపం అన్ని సమస్యలను మనం ఎందుకు ఎదుర్కొంటున్నాము అనేవి చాలా ముఖ్యమైన కారణాలు కావచ్చు. విటమిన్ డి లోపం గురించి తాజాగా అనేక చర్చలు జరుగుతున్నాయి, కొన్ని దశాబ్దాల క్రితం మన దేశంలో సూర్యరశ్మికి గురికావడం వల్ల ఉష్ణమండల అయిన మన దేశంలో ఇది ఒక సమస్యగా ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు మరియు మన వాతావరణం మరియు జీవనశైలి కారణంగా భారతీయులమైన మనం అదృష్టవంతులమని మనం భావించాము. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ పరిస్థితులు మారాయి, మనం ఉన్నదాని నుండి ఇతర సంస్కృతులను అనుసరించేలా మనం మారాము. మనం ఖండాంతర అలవాట్లను అవలంబించాము మరియు మన అసలు అలవాట్లను మరచిపోయాము, ఇనుప పాత్రలలో వంట చేయడం, శారీరక వ్యాయామం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం వంటివి మానేశాము, ఎందుకంటే మన పద్దతులు ప్రాచీనమైనవి మరియు ఆ విదేశీ పద్దతులే సరైన పద్ధతులు అని మనం భావించాము. గత దశాబ్దంలో అకస్మాత్తుగా మనం విటమిన్ డి లోపంతో ఉన్నామని గ్రహించాము. ఈ విటమిన్ డి లోపం మన జీవక్రియ ప్రక్రియను చాలా ప్రభావితం చేస్తోంది మరియు చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు, నేడు హైదరాబాద్ భారతదేశం యొక్క డయాబెటిక్ రాజధానిగా మారింది. విటమిన్ డి లోపం మహిళల్లో కండరాలు మరియు ఎముకల నొప్పికి దోహదం చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మేము విటమిన్ డి లోపాలను తనిఖీ చేయడానికి ఎప్పుడూ ఉపయోగించలేదు, కానీ మేము విటమిన్ డి కోసం పరీక్షలు చేసినప్పుడు అకస్మాత్తుగా చాలా లోపాలను కనుగొన్నాము, ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, మూత్రపిండాల వైఫల్యం, డయాలసిస్, ఎముకల నొప్పి, కండరాల నొప్పులు మొదలైన అనేక కేసులను మనం చూస్తున్నాం. ప్రజలు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. నొప్పి అనేది విటమిన్ డి లోపం యొక్క లక్షణం, పోషకాల ద్వారా దాన్ని పరిష్కరించే బదులు మనం పెయిన్ కిల్లర్‌లతో మాత్రమే నెట్టుకొసస్తున్నాము, దానివలన మరికొన్ని దుష్ర్పభావాలు కొని తెచ్చుకుంటున్నాము. స్త్రీలు తమ ఆరోగ్యం గురించి కౌమారదశ నుండి వృద్దాప్యం వరకు తగిన జాగ్రత్త వహించాలి, ఎందుకంటే శారీరక శ్రమ మరియు తగినంత ఆహారం రెండింటి ద్వారా ఎముక మరియు కండరాల బలం కలిసి ఉంటే కనుక స్త్రీ గర్భవతి అయినప్పుడు లేదా వృద్ధాప్యంలో ఉన్నా దుష్ప్రభావాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నొప్పికి పెయిన్ కిల్లర్ మాత్రమే సమాధానం కాదు, దానికి మూల కారణాన్ని గుర్తించి పరిష్కరించాలి, అది సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తుంది. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, బలమైన రోగనిరోధక శక్తితో మనం కోవిడ్ వంటి వ్యాధులతో కూడా మెరుగ్గా ఉండగలము.

విటమిన్ ‘డి’ లోపం మూడు అత్యంత సాధారణమైన లక్షణాలు ఏమిటంటే నిరంతరం అలసటతో ఉండడం, ఇందులో వ్యక్తి చాలా త్వరగా అలసిపోతాడు మరియు అన్ని సమయాలలోనూ అలసిపోతాడు, ఎముకలు, కీళ్ళు మరియు కండరాల నొప్పులు ఉండడం, శారీరకమైన నొప్పులు, నడుము నొప్పి మరియు చివరిదే అయినా విస్మరించరాని లక్షణం తక్కువ రోగనిరోధక శక్తితో ఇన్ఫెక్షన్లు పునరావృతం కావడం, నిజానికి విటమిన్ ‘డి’ లోపం ఉన్న రోగులలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది.

విటమిన్ ‘డి’ లోపానికి దోహదపడే కొన్ని కారణాలు ఎక్కువగా ఇంటిలోనే ఉండే జీవనశైలి మరియు నగర జీవనశైలిలో సూర్యరశ్మికి తక్కువగా గురికావడం, పోషకాహార లోపం ఉన్న స్త్రీలలో అంతరం లేని మరియు ప్రణాళిక లేని గర్భాధారణలు, ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరిలోనూ విటమిన్ ‘డి’ స్థాయిలను మరింత దిగజార్చడానికి దారితీస్తుంది.

భారతదేశంలో, విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా వ్యాపించింది మరియు ప్రస్తుతం నిర్ధారణ చేయబడిన సంఖ్యలు మొత్తం సంఖ్యలో అతి కొద్ది భాగం మాత్రమే. ముందస్తుగా గుర్తించడం మరియు దిద్దుబాటు సంరక్షణ ప్రారంభించడానికి పరీక్షా సౌకర్యాలతో పాటు అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి అని రాంబాబు చెప్పారు. ఇంతకుముందు మనం చాలా శారీరక శ్రమ చేసేవాళ్ళం, ఆ విధంగా తగినంత విటమిన్ డి మనకు లభించేది మరియు విద్యుత్ శక్తి లేనప్పుడు త్వరగా చీకటి పడడంతో త్వరగా నిద్రపోయే వాళ్ళము, అది మనల్ని ఆరోగ్యంగా ఉంచేది. కానీ ఈ రోజున మనం దానికి సరిగ్గా వ్యతిరేకం చేస్తున్నాము, మనం అర్థరాత్రి వరకు మేల్కొని, నిద్ర నుండి ఆలస్యంగా మేల్కొంటున్నాము, సూర్యరశ్మి అనేది తగలకుండా కార్యాలయాలకు ప్రయాణిస్తున్నాము, మనల్ని మనం పూర్తిగా కప్పేసుకుంటున్నాము. విటమిన్ డి లోపం యొక్క ఈ సమస్యకు ప్రస్తుత జీవనశైలి చాలా వరకు దోహదపడుతున్నది. ఈ సమస్యను పరిష్కరించడానికి మనకు మార్కెట్‌లో ఉన్న సప్లిమెంట్‌లు సరిపోవు. మన శరీరాలు జీర్ణాశయం ద్వారా విటమిన్ డిని గ్రహించేలా చేయబడలేదు, అది చర్మం ద్వారా గ్రహించబడేలా చేయాలి. మన ఆహారాలలో కూడా చాలా వరకు విటమిన్ డి ఉండదు. మనపై పని చేసే సప్లిమెంట్లను మనం తీసుకోవాలి, మార్కెట్‌లో లభించే బలవర్థకమైన ఆహారాలు చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే పాశ్చాత్య ప్రపంచంలో వలె కాకుండా ఉడకబెట్టడం మరియు వేయించడం వంటి మన వంట పద్ధతులు బలవర్థకమైన ఆహారాలతో సరిపోవు కాబట్టి భారతదేశంలోగా సహాయపడకపోవచ్చు. సూక్ష్మపోషకాలు హీట్ సెన్సిటివ్‌లు, మనం ఇక్కడ ఎదుర్కొనే సవాళ్లలో అది ఒకటి. మన శరీరాలు సప్లిమెంట్లను గ్రహించేలా చేయడానికి ఆరోగ్య జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. (Story: 94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1