UA-35385725-1 UA-35385725-1

ఓటీటీ వూట్‌లో ‘ఖత్రా  ఖత్రా షో’

వినోదం, ఆటలు మరియు హాస్యం అపరిమితం – ‘ఖత్రా ఖత్రా షో’తో ఆనందాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లేందుకు  సర్వం సిద్ధం చేసిన వూట్‌ (Voot)

హార్ష్‌ లింబాచియా మరియు భారతీ సింగ్‌ దర్శకత్వం  వహించిన ఈ కామెడీ  గేమ్‌ షో వూట్‌పై 13 మార్చి 2022న  తొలిసారిగా ప్రదర్శితం కానుంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకూ  రాత్రి  7గంటల వరకూ  మరియు ఆ తరువాత కలర్స్‌లో రాత్రి 11గంటలకు ప్రసారం కానుంది

ఓటీటీ వూట్‌లో ‘ఖత్రా  ఖత్రా షో’ ! మీరెప్పుడైనా సైకిల్‌ తొక్కుతూ ఫుట్‌బాల్‌ ఆడారా ? లేదంటే శీసా పై బాక్సింగ్‌ చేస్తూ ఎప్పుడైనా ప్రయత్నించారా ?  ఈ తరహా ఎన్నో వినోదాత్మక క్రీడలకు ధమ్‌కేదార్‌ మలుపును అందించండి. భారతదేశంలో మొట్టమొదటి , దేశీయంగా వృద్థిచేసిన కామెడీ గేమ్‌ షో ‘ఖత్రా  ఖత్రా షో’ను ప్రసారం చేయడానికి వూట్‌  పూర్తిగా సన్నద్ధమైంది.  శక్తివంతమైన దర్శకద్వయం హార్ష్‌ లింబాచియా మరియు భారతీ సింగ్‌లు దర్శకత్వం వహించిన ఈ అత్యంత ఆసక్తికరమైన షోలో సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ శుక్రవారపు ప్రత్యేక హోస్ట్‌గా ఖత్రా  గుణాత్మకతను మరింత వృద్ధి చేయనున్నారు.  మార్చి 13, 2022న తొలిసారిగా ప్రదర్శితం కానున్న ఈ ఖత్రా ఖత్రా షోను సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 7 గంటలకు వూట్‌ పై  మరియు రాత్రి  11గంటలకు కలర్స్‌ ఛానెల్‌పై ప్రసారం చేయనున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో సుప్రసిద్ధ పోటీదారులుగా కరన్‌ కుంద్రా, ప్రతీక్‌ సెహజ్‌పాల్‌, నిశాంత్‌ భట్‌, పునీత్‌ పాఠక్‌, విశాల్‌ ఆదిత్య సింగ్‌లు వినోదాత్మక టాస్క్‌లు మరియు ఖతర్నాక్‌ సవాళ్లలో పోటీపడనున్నారు.  వీరితో పాటుగా అందాల బాలీవుడ్‌ తార  జాక్విలిన్‌ ఫెర్నాండేజ్‌ కూడా ఈ వినోద షో లో  పాల్గొనబోతున్నారు.  హోస్ట్స్‌తో  సరదాగా ఆమె పరిహాసం చేయనుంది.
హై వోల్టేజీ సెలబ్రిటీ డ్రామా, అపరిమిత వినోదం, హాస్యం, చమత్కారంతో కూడిన సవాళ్లతో  కూడిన ఖత్రా ఖత్రా షో, తనతో పాటుగా  150కు పైగా మజేదార్‌ గేమ్స్‌ మరియు టాస్క్‌లను, హాస్యంతో కూడినప్పటికీ గగుర్పాటు కలిగించే విన్యాసాలు, వీక్షకుల అభిమాన సెలబ్రిటీలు ప్రదర్శించే ప్రాంక్‌ వంటివి మీరు స్ర్కీన్‌లకు అతుక్కుని ఉండిపోయేలా చేస్తాయి. ఇది దేశీయంగా వృద్ధి చెందిన మొట్టమొదటి ఇంటరాక్టివ్‌ షో. దీనిలో వూట్‌ వినియోగదారులు పాల్గొనడంతో పాటుగా ప్రాచుర్యం  పొందిన సెలబ్రిటీలకు వినోదాత్మక గేమ్స్‌ మరియు ఛాలెంజింగ్‌ టాస్క్స్‌ను సైతం అందించవచ్చు.  మొదటి ఎపిసోడ్‌లో  ప్రత్యేక విభాగం  ‘ఫరా కా ఛాలెంజ్‌’ ఉంది. దీనిలో వినియోగదారులు ఫరా ఖాన్‌ అందించిన సవాళ్లను స్వీకరించడంతో పాటుగా తమ వీడియోలను పంపించవచ్చు. ఈ షోలో కొన్ని ఉత్సాహపూరితమైన , ఇతర  ఇంటరాక్టివ్‌ గేమ్స్‌ అయినటువంటి ‘ఫరా కే ఫంకార్‌’, ‘డిమాండ్‌ పే రిమాండ్‌’, ‘ఇండియా కీ ఫట్కార్‌’, ‘అనారీ నెంబర్‌ 1’ మరియు ‘ఖత్రా ఫన్‌ మీటర్‌’ వంటివి ఉంటాయి.  వీటిద్వారా వీక్షకులు  కంటెంస్టెంట్‌ల ప్రదర్శనలను చూడటం, ఎంపిక  చేయడం మాత్రమే పోటీదారులకు శిక్షలనివ్వడం, ఎపిసోడ్‌లకు రేటింగ్‌ ఇవ్వడం సహా మరెన్నో చేయవచ్చు.
ఖత్రావాగన్‌లో చేరిన ఫరాఖాన్‌ మాట్లాడుతూ‘‘ భారతీ మరియు హార్ష్‌ యొక్క శైలి హాస్యానికి నేను అతిపెద్ద అభిమానిని. ఈ ‘ఖత్రా ఖత్రా’ షో కోసం వారితో చేతులు కలపడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ షోకు శుక్రవారపు ప్రత్యేక హోస్ట్‌గా, దేశంలో ఎక్కువ మంది అభిమానించే సెలబ్రిటీలను  సవాల్‌తో కూడిన టాస్క్స్‌లో పోటీపడేలా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది తప్పనిసరిగా వారి అభిమానులందరినీ ఆశ్చర్యపరచనుంది. మనోహరమైన గేమ్‌లు, సరదా శిక్షల ద్వారా  నటీనటుల ఆఫ్‌ స్ర్కీన్‌ ధీరత్వం గురించి  ఈ షో వెల్లడిస్తుంది’’అని అన్నారు.
ఈ షో గురించి మరింతగా హార్ష్‌ లింబాచియా మాట్లాడుతూ ‘‘ ఖత్రా ఖత్రా షో, నా వరకూ అత్యద్భుతమైన సృజనాత్మక  ప్రయాణం. మీరు వినోదాంశాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్లడంతో  పాటుగా పలు థ్రిల్లింగ్‌ గేమ్స్‌ను సైతం సృష్టించవచ్చు. కాకపోతే ఆ గేమ్స్‌ను పోటీదారులు సులభంగా ఆడగలరనే భరోసాతో ఉంటే చాలు.  వీక్షకులకు మాత్రమే కాదు మాకు కూడా పూర్తి వినోదాన్ని పంచేలా ఉండాలి. అది ఖచ్చితంగా పోటీదారులకు మాత్రం అంత సులభమేమీ కాదు (నవ్వులు), అంతేనా , ఈ వినోద్మాక, వినూత్నమైన  షోను మా వీక్షకుల చెంతకు తీసుకురావడానికి వూట్‌ను మించిన అత్యుత్తమ మార్గం ఏముంది!’’అని అన్నారు.
‘‘ఈ షో ఫార్మాట్‌, సంప్రదాయ షోలతో పోలిస్తే  పూర్తి భిన్నంగా ఉంటుంది. పోటీదారులకు టాస్క్‌లను సృష్టించడానికి మాలోని  సృజనాత్మకతను ఛానలైజ్‌ చేయాల్సి వచ్చింది. కానీ ఖచ్చితంగా ఇది పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఓ హోస్ట్‌గా నేను చేస్తోన్న షోలలో పూర్తి వినోదాత్మకమైనది ఇది. సరదా  టాస్క్‌లు, సవాళ్ల ద్వారా వాళ్లను శిక్షించాను. ప్రేక్షకులు మాపై ఎప్పుడూ చూపే ఆదరణను ఈ షోపై కూడా కురిపిస్తారని ఆశిస్తున్నాము మరియు వారికి పూర్తి వినోదాన్ని అందిస్తూనే హాస్యంలో ముంచెత్తగలమని హామీ ఇస్తున్నాము’’ అని భారతీ సింగ్‌ వెల్లడించారు.
దయచేసి మమ్మల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవద్దు మరియు ఖత్రా  ఖత్రా షో ను 13 మార్చి 2022 నుంచి వూట్‌ మరియు కలర్స్‌ పై చూడటం మాత్రం మరువవద్దు ! (Story: ఓటీటీ వూట్‌లో ‘ఖత్రా  ఖత్రా షో’)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1