UA-35385725-1 UA-35385725-1

హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ రుద్ర కొత్త ట్రైలర్‌

హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ రుద్ర కొత్త ట్రైలర్‌

ముంబయి : డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సోమవారంనాడు ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో, అందరూ అత్యంత ఆసక్తిగా వేచి చూస్తున్న హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ రుద్ర- ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ రెండవ ట్రైలర్‌ను ఆవిష్కరించింది. ఆసక్తిని మరింత పెంచుతూ, ‘‘జో అందేరా మే చుప్తా హై, మై ఉసే వహీ మిల్తా హూ’’ అనే అజయ్‌ దేవ్‌గన్‌ అద్భుతమైన డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. అతను తనను తాను ఏసీపీ రుద్ర వీర్‌గా పరిచయం చేసుకుంటూ, అత్యంత రహస్యమైన నేరాలను, అత్యంత అసాధారణమైన మార్గాల్లో ఛేదించే విధానాలను మనం ఇందులో చూస్తాము. ప్రముఖ దర్శకుడు రాజేష్‌ మపుస్కర్‌ తెరకెక్కించిన ఈ సైకలాజికల్‌ డ్రామాతో ప్రముఖ నటుడు అజయ్‌ దేవగన్‌ డిజిటల్‌ సిరీస్‌ అరంగేట్రం చేస్తుండగా, ఇందులో అతన్ని గతంలో ఎన్నడూ చూడని పోలీసు పాత్రలో కనిపిస్తారు. బీబీసీ స్టూడియోస్‌ ఇండియా భాగస్వామ్యంలో అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ముంబయిలోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇందులో రాశి ఖన్నా, ఈషా డియోల్‌, అతుల్‌ కులకర్ణి, అశ్విని కల్సేకర్‌, తరుణ్‌ గహ్లోట్‌, ఆశిష్‌ విద్యార్థి మరియు సత్యదీప్‌ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. (Story : హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ థ్రిల్లర్‌ రుద్ర కొత్త ట్రైలర్‌)

“రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌లో, భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన అజయ్ దేవగన్‌తో ఒక అద్భుతమైన థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అప్లాజ్‌కు చెందిన సమీర్ నాయర్ మరియు అతని అద్భుతమైన టీమ్ ఈ షోను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలిగింది. మీరు ఈ షోను పూర్తిగా ఆస్వాదిస్తారని మేము ఆశిస్తున్నాము” అని డిస్నీ స్టార్కంటెంట్ డిస్నీహాట్‌స్టార్ మరియు హెచ్ఎస్‌ఎం ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ హెడ్ గౌరవ్ బెనర్జీ అన్నారు.

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ సమీర్ నాయర్ మాట్లాడుతూ, “రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో ఇంత ప్రతిష్టాత్మకమైన స్థాయిలో అజయ్ దేవగన్ డిజిటల్ అరంగ్రేటంలో  భాగమైనందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాము. అద్భుతమైన తారాగణం, సిబ్బంది మరియు మా నిర్మాణ భాగస్వాములైన బీబీసీ స్టూడియోస్‌తో కలిసి ఈ ప్రత్యేకమైన కథనంపై పని చేయడం అద్భుతమైన అనుభవం. అప్లాజ్‌లో మేము కథలు మరియు కథనాల్లోని శక్తిని విశ్వసిస్తాము మరియు రుద్రతో, మేము పరిశ్రమలో అగ్రగామి డిస్నీ+ హాట్‌స్టార్‌తో మా సృజనాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళతాము. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము’’ అని పేర్కొన్నారు.

దర్శకుడు రాజేష్ మపుస్కర్ మాట్లాడుతూ “రుద్ర సాధారణ పోలీసుగా, క్రైమ్ డ్రామాకు తీక్షణమైన మరియు ఉత్కంఠతో కూడిన కథనాన్ని నడిపిస్తాడు. అతను సత్యాన్ని అనుసరిస్తూ, నేరగాళ్ల మనస్తత్వాన్ని హీరో అసాధారణంగా అన్వేషిస్తాడు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు మరియు దీన్ని గొప్పగా చిత్రీకరించడంతో వీక్షణలోనూ మనోహరంగా ఉంటుందని’’ ధీమా వ్యక్తం చేశారు.

బాలీవుడ్ సూపర్ స్టార్అజయ్ దేవగన్ మాట్లాడుతూ, “రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నా పాత్ర మీరు ఇంతకు ముందెన్నడూ చూడని ప్రతినాయకునిలా కనిపించే అవకాశం ఉంది. ఇది నాకు సవాలుగానూ మరియు స్ఫూర్తిదాయకంగానూ ఉంది అలాగే రుద్ర మాయాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులతో పంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మేము షోను రూపొందించేందుకు ఎంత తీవ్రంగా శ్రమించామో, వారూ అంతే స్థాయిలో ఈ షోతో ప్రేమలో పడతారని నేను ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

నటి ఈషా డియోల్ మాట్లాడుతూ, “మా సిరీస్ ప్రారంభం నుంచి కెమెరా ముందుకు వచ్చేలా చేసిన నా స్నేహితుడు మరియు సహనటుడు అజయ్ దేవగన్‌తో మరోసారి తెరను పంచుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో, నా పాత్ర మరియు ప్రదర్శన ద్వారా ప్రేక్షకులకు ఒక అడుగు దగ్గరవ్వాలని నేను వేచి చూస్తున్నాను’’ పేర్కొన్నారు.

రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో డిజిటల్ రంగ ప్రవేశం చేస్తున్న రాశీ ఖన్నా మాట్లాడుతూ, ‘‘రుద్ర నాకు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది నేను ఇప్పటివరకు పోషించిన అత్యంత క్లిష్టమైన పాత్ర మరియు ఇది ఖచ్చితంగా నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు తీసుకువచ్చింది. నేను ఈ పాత్రను పోషించినందుకు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అజయ్ దేవగన్ వంటి ప్రముఖ నటుడితో తెరపై నటించేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు.

నటుడు అతుల్ కులకర్ణి మాట్లాడుతూ, “నేను రుద్ర-ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను. అజయ్ దేవగన్, ఈషా డియోల్, రాశి ఖన్నా మరియు ఇతర సిబ్బందితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. స్క్రిప్ట్‌లోని సస్పెన్స్ మరియు ట్విస్ట్‌లతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవుతారు. సిబ్బంది మొత్తం అద్భుతమైన పని చేశారు మరియు ప్రతి ఒక్కరూ సిరీస్‌ని చూసే వరకు మేము వేచి ఉండలేకపోతున్నాము’’ అని పేర్కొన్నారు.

నటి అశ్విని కల్సేకర్ మాట్లాడుతూ “దర్శకుడు రాజేష్‌ మపుస్కర్‌తో కలిసి రుద్రది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ నాకు గొప్ప అభ్యాసాన్ని అందించింది మరియు ప్రేక్షకులు ఈ ప్రదర్శనను చూసి థ్రిల్ అవుతారని నేను విశ్వసిస్తున్నాను. మీ కోసం చాలా ట్విస్ట్‌లు మరియు సస్పెన్స్‌లు ఎదురుచూస్తున్నాయి’’ అని తెలిపారు.

ఆరు-ఎపిసోడ్ల సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన బ్రిటిష్ సిరీస్ లూథర్కు భారతీయ అనుసృజన. ఈ ధారావాహిక నేరాలు, వాటిని అడ్డుకునే మరియు సంక్లిష్టమైన కథనాన్ని కలిగి ఉండగా, ఇది అత్యంత తెలివైన నేరగాళ్లు మరియు వారిని వేటాడే డిటెక్టివ్‌ల మానసిక స్థితిని పరిశోధించే విచిత్రమైన రేస్-ఎగైనెస్ట్-ది-క్లాక్ థ్రిల్లర్. రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ ప్రత్యేకంగా డిస్నీహాట్‌స్టార్‌లో 4 మార్చి 2022 నుంచి హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ భాషల్లో అందుబాటులోకి వస్తోంది.

సారాంశం: ముంబయిలో జరిగిన రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ రేస్-ఎగైనెస్ట్-ది-క్లాక్ థ్రిల్లర్ కాగా, ఇది అత్యంత తెలివైన నేరగాళ్లు మరియు వారిని వేటాడే డిటెక్టివ్‌ల మనోగతాన్ని ఆవిష్కరిస్తుంది. డీసీపీ రుద్ర వీర్ సింగ్ నేరగాళ్లు మరియు హంతకులను వెంబడించే తీవ్రమైన వ్యక్తిగత వ్యయాన్ని మరియు సామాజిక మేధావి అలియాతో అతను ఏర్పరుచుకునే అసంభవమైన స్నేహాన్ని చిత్రీకరిస్తూ, సీరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ కొత్త తరహాలో ఉంటుంది. సిరీస్‌లో హీరో అప్రమత్తమైన చర్యలకు కేవలం నేపథ్యంగానే కాకుండా, ముంబయి మహానగరం మంచి మరియు చెడుల మధ్య యుద్ధానికి వేదికను నిర్దేశిస్తుంది. ఈ చీకటిలో లోనూ ప్రపంచంలో ప్రేమ ఇంకా ఉందని రుద్ర విశ్వసిస్తాడు. ఎందుకంటే అంతిమంగా మనకు లభించేది మానవత్వమే. ఈ నమ్మకం కోసమే రుద్ర తనకు ఉన్నదంతా త్యాగం చేస్తాడు.

మార్చి 4 నుంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో అజయ్ దేవగన్ డిజిటల్ అరంగేట్రాన్ని వీక్షించేందుకు డిస్నీహాట్‌స్టార్‌ను ట్యూన్ చేయండి ~

See Also : మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!

హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ థ్రిల్లర్‌ రుద్ర కొత్త ట్రైలర్‌

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1