Home Blog Page 963

పాపం సవాంగ్‌!

0
Gautam Sawang
Gautam Sawang

పాపం సవాంగ్‌!

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఆకస్మిక బదిలీ తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులు కచ్చితంగా పోలీసులను వాడుకొని వదిలేస్తారని మరోసారి ఈ ఉదంతం నిక్కచ్చిగా నిరూపించింది. పొమ్మనలేక పొగపెట్టి చివరకు ఇలా సాగనంపారని ఆంధ్రా మీడియా ఘోషిస్తున్నది. కనీసం ‘నువ్వెక్కడ పనిచేయాలి?’ అని చెప్పకుండా ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండానే ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించి మరీ సవాంగ్‌పై బలమైన వేటు వేసింది. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న సవాంగ్‌ ఇంటికొచ్చేసరికి బదిలీ ఉత్తర్వులు చేతికందాయి. ఈస్థాయిలో అత్యంత అవమానకరీతిలో ఏ పోలీసు అధికారినీ, గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా బదిలీ చేయలేదు. ఇన్నాళ్లూ గౌతమ్‌ సవాంగ్‌ ప్రజలపక్షాన కాకుండా కేవలం ప్రభుత్వ పక్షాన నిలిచినందుకు సర్కారు ‘భలే గిఫ్ట్‌’ ఇచ్చిందని ఏపీలో చెవులు కొరుక్కుంటున్నారు. జగన్‌ (YS Jagan) ప్రభుత్వం ఏరికోరి మరీ కొన్ని మాసాల క్రితం గౌతమ్‌ సవాంగ్‌ను డీజీపీగా నియమించుకుంది. పాపం సవాంగ్‌… ప్రభుత్వం ఏది చెపితే అదే చేశారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజల ముందు అభాసుపాలయ్యారు. సవాంగ్‌ డీజీపీగా వుండగా, హక్కుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ విధానాలను, దాంట్లోని లోపాలను ప్రశ్నించే వారెవ్వరైనా వారిపై కేసులు బనాయించడంలో ముందున్నారు. (చిన్న వసరణ : పోలీసులు కేసులు బనాయించడమనేది ఈ ఒక్క ప్రభుత్వ హయాంలోనే కాదు…గత ప్రభుత్వ హయాంలోనూ జరిగింది. అలాంటి ఘటనలు కోకొల్లలు).అత్యంత వివాదాస్పదమైన డీజీపీగా ముద్ర వేసుకున్నారు.
పెద్దలు ఆదేశించారంటూ ప్రతిపక్షాల కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపారు. పైగా ప్రతిపక్షాల అభ్యర్థనలను ఏనాడూ పట్టించుకోలేదు. కాకపోతే అధికార పార్టీ వేలమందితో కార్యక్రమాలు నిర్వహించినా, నోరుమెదపలేదు. దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరిగిన కార్యక్రమంగా బిల్డప్‌ ఇచ్చేవారు. వామపక్షాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలపై మాత్రం కొవిడ్‌ నిబంధనలు రుద్దేవారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై రెండుసార్లు దాడులు జరిగినా పట్టించుకోలేదు. ఒకటి అమరావతిలోనూ, ఇంకొకటి విశాఖపట్నంలోనూ. విశాఖలో చంద్రబాబును విమానాశ్రయానికే పరిమితం చేశారు. కనీసం బయటకు రానీయలేదు. నోటీసులిచ్చి అవమానించారు. దీనిపై సవాంగ్‌ కోర్టుకెళ్లి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక రాజధాని రైతులపై పోలీసు లాఠీ రaుళిపించారు. (చిన్న సవరణ : రాజధాని రైతుల ఆందోళన వెనుక ఎవరున్నారు? ఈ అసమ్మతి నిజమైనదేనా?కాదా? అన్నది వేరే విషయం. దాన్ని తర్వాత చర్చించుకుందాం.)
చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు అధికార పార్టీ కార్యకర్తలు దాడిచేస్తే, అది భావస్వేచ్ఛగా సవాంగ్‌ అభివర్ణించారు. ఆ దాడిలో ఓ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేపై కేసుపెట్టకుండా వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. రామతీర్థం ఘటనలో చేతులెత్తేశారు. వివిధ ఘటనల విషయంలో సవాంగ్‌కు కేంద్ర హోంశాఖ కూడా చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. హైకోర్టు కూడా ఆయన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఆయన మారలేదు. పైగా తన ప్రభుభక్తిని చాటుకున్నారు. అంతర్గతంగా పోలీసుశాఖలో కూడా ఆయన అసమ్మతిని కూడగట్టుకున్నారు. సవాంగ్‌ అసమర్ధుడనే నిందను భరించాల్సి వచ్చింది. కిందిస్థాయి అధికారులే ఆయన మాట వినేవారు కాదు. పోలీసులకు వీక్లీఆఫ్‌లు కూడా ఇవ్వలేకపోయారు. కానిస్టేబుల్‌ నుంచి హౌస్‌ఆఫీసర్‌ వరకు పోలీసుబాస్‌ పట్ల అసంతృప్తినే వ్యక్తం చేస్తూ వుండేవారు. ఆయన హయాంలో పోలీసుస్టేషన్లలో ప్రతిపాదిక సౌకర్యాలను సైతం మెరుగుపర్చలేకపోయారు. స్టేషన్లకు తగినన్ని వాహనాలను తెచ్చుకోలేకపోయారన్న ఆరోపణ కూడా వుంది. కేంద్ర నిధులు కోట్లాది రూపాయలు రావాల్సి వున్నా, ఆయన ఉపయోగించులేకపోయారు.
ఆరేళ్ల క్రితమే సవాంగ్‌పై బదిలీ వేటు పడాల్సిందని, కాకపోతే, ఇంకొన్నాళ్ల ఆయన వున్నందుకు సంతోషమని కొందరు సీనియర్‌ పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ‘ఛలో విజయవాడ’ పేరుతో ఉద్యోగులు చేసిన ఆందోళనను అడ్డుకోవడంలోనూ, కనీసం ఇంత జరుగుతుందన్న సమాచారాన్ని సేకరించడంలో విఫలమయ్యారు. కావాలనే ఆయన ఉద్యోగులకు మద్దతు ఇచ్చారన్న అపవాదును మూటగట్టుకొని, చివరకు ఉద్వాసనకు గురయ్యారు. 2019 జూన్‌ 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సవాంగ్‌కు వచ్చే ఏడాది జులై నెలాఖరు వరకు సర్వీసు వుంది. అప్పటివరకు ఆయనను ఏ పోస్టులో పెడతారో వేచిచూడాలి. లేదా ఏ పోస్టింగూ లేకుండా వదిలేస్తారో కాలమే సమాధానం చెప్పాలి. ‘‘ఏ పోలీసును కదిపినా…దానమ్మా జీవితం…ఎంత చేసినా ఈ రాజకీయనాయకులు ఇంకా తొక్కిపడేస్తున్నారండీ’’ అని అంటూ వుంటారు. సవాంగ్‌ కథ కూడా అంతే! ఏదేమైనప్పటికీ, రాజకీయ రథచక్రాల కింద నలిగిపోయిన మరో పోలీసు అధికారిగా గౌతమ్‌ సవాంగ్‌ మిగిలిపోయారు. పాపం పోలీసులకు ‘చివరకు మిగిలేది!’ ఇదేనేమో! (Story : పాపం సవాంగ్‌!)

Also See : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

తెలంగాణ కుంభమేళా!

0
తెలంగాణ కుంభమేళా...మేడారం మహా జాతర
తెలంగాణ కుంభమేళా...మేడారం మహా జాతర

తెలంగాణ కుంభమేళా

మేడారం మహా జాతర

తెలంగాణ కుంభమేళా…మేడారం మహా జాతర ! ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేర్కొనబడిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజుల్లో ఈ జాతర జరగనుంది. ఈ జాతర ఆసియాలో జరిగే అతిపెద్ద జాతర. మేడారం జాతర దశాబ్దాల కాలం నుండి బుధ, గురు, శుక్రవారాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని చెప్పవచ్చును. ఈ జాతరను తెలంగాణ మహా కుంభమేళగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడికి తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుండే కాక దేశం నలుమూలలనుండి అలాగే ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
భిన్నత్వంలో ఏకత్వం: జాతర పూర్తిగా భిన్న సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా కనిపిస్తుంది. గిరిజనులు, ఆదివాసీలు, ఆదీవాసేతరులు ప్రకృతి జీవన విధానాలను ఈ జాతరలో తెలుసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జాతర మినీ భారతాన్ని ఆవిష్కరిస్తుంది. జాతర పూర్తిగా ఆదివాసి సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తరతరాల నుండి వస్తున్న ఆచారాలకు లోటు రాకుండా సమ్మక్క సారలమ్మలను కొలవడం జరుగుతుంది. జాతరలో కోటి యాభై లక్షల మందికి పైగా ఆదివాసి, ఆదివాసేతరులు ఒక దగ్గరకు చేరి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. మేడారంకి వచ్చే భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి దర్శనానికి వెళ్తారు. జంపన్నవాగులో స్నానాలు చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వాగు ఒడ్డున తల నీలాలు సమర్పించడం సంప్రదాయం.
ఘన కీర్తి: కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాలంలో గిరిజనులు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కొరకు పోరాటం చేసి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి గిరిజనుల హక్కులను కాపాడిన వీరవనితలుగా సమ్మక్క-సారలమ్మలు చరిత్రలో గుర్తింపు పొందారు. కాకతీయుల పరిపాలన కాలం క్రీ.శ. 1000-1323 వరకు పరిపాలించిన కాకతీయ రాజులు తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేసి మూడు వందల సంవత్సరాలు పరిపాలించిన ఘనత కాకతీయులకు చెందుతుంది. తెలుగు జాతి చరిత్రలో కాకతీయ సామ్రాజ్యాన్ని స్వర్ణ యుగంగాను, మహోజ్వల ఘట్టంగాను పేర్కొంటారు. అలాంటి కాకతీయుల ఆగ్రహానికి మేడారం సామంత రాజులు బలయ్యారు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘‘పగిడిద్దరాజు’’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువుకాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు ‘జంపన్న’వాగుగా ప్రసిద్ధి చెందింది.
ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలుతీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలుగల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతరను జరుపుకుంటున్నారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. మేడారంలో ఈ తల్లి బిడ్డల విగ్రహాలు లేని ఆదివాసి జాతర ఎంతో గొప్పదని చెప్పవచ్చును. ఈ జాతరలో భక్తులు బెల్లాన్ని(బంగారాన్ని) నైవేథ్యంగా భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. బెల్లాన్ని (బంగారాన్ని) నైవేథ్యంగా పెడితే అమ్మవారు వారి కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పించడం బంగారంతో పాటు పసుపు, కుంకుమ, చీర, సారులను సమర్పించేందుకు పోటీపడతారు. కేవలం జాతర సమయంలోనే కాకుండా ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడే మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ జాతర జాతీయ స్థాయి జాతరగా గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Medaram jathara
Medaram jathara

ఈ సంవత్సరం 750 కోట్ల రూపాయలు నిధులు మంజూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు జాతరలకు రూ.332 కోట్లు ఖర్చు చేసింది. ఈ సంవత్సరం 750 కోట్ల రూపాయలును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, జాతర కోసం చేపట్టిన పనులలో ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయి. ఈ సారి శాశ్వత నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. గత జాతరలో 4 రోజుల్లో ఒక కోటి రెండు లక్షల మంది భక్తులు జాతరను సందర్శించారని అధికారులు తెలిపారు. జాతరకు ముందుగానే భక్తులు లక్షల్లో సందర్శిస్తున్నారు. ములుగు జిల్లా యంత్రాగం జాతర పటిష్ట నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజించారు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్‌ కేంద్రాలు, 10,300 మంది పోలీస్‌ సిబ్బంది పహారా కాస్తారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్‌ క్యాంప్‌, పస్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్‌ క్యాంప్‌, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం 50 బెడ్లతో సమ్మక్క-సారలమ్మ వైద్యశాల ఏర్పాటు చేశారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులు ఆర్‌టిసి ఏర్పాటుచేయడం జరిగింది. జాతరలో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని మంత్రుల బృందం ప్రారంభించింది. ముఖ్యమైన శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈసారి జాతరను ‘‘ప్లాస్టిక్‌ రహిత జాతర’’గా నిర్వహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా అధికారులకు విధుల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇందులో నియమింపబడిన అధికారులు అందరూ గతంలో మేడారం జాతరలో పనిచేసిన అనుభవం ఉన్నవారే నియమించడం జరిగిందని చెప్పవచ్చు. సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పనిచేసే అవకాశాన్ని అదృష్టంగా జిల్లా అధికారులు భావించి సేవలు అందిస్తారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఇనుమడిరచేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతర నిర్వహణకు చర్యలు తీసుకుంటుంది. దీని కొరకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయవలసిన అవసరం ఉంది. భక్తితో పాటు విందు, వినోదాలు కలిగిన సంస్కృతి మేడారం జాతర ప్రత్యేకత. ఈ జాతర జరిగే నాలుగు రోజులు ప్రజలు భక్తిపారవశ్యంతో మునిగితేలుతారు. కోరిన కోరికలు తీర్చే దయగల తల్లులని భక్తులు ఎంతో విశ్వాసంతో గద్దెలను దర్శించుకుంటారు. ముఖ్యంగా మొదట మొక్కుల తల్లి ‘‘సమ్మక్కకు వెళ్లేదారిలో గట్టమ్మ’’ కొలువై ఉంటుంది. గట్టమ్మను దర్శించుకున్న తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివెళ్లడం జరుగుతుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆచారం అని చెప్పవచ్చు. 1996లో రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి అద్భుతంగా కొనసాగుతుందని చెప్పవచ్చును. ఈ జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు జాతరలో పాల్గొనడం గొప్ప విశేషం.

See Also : రేపటి నుంచే మేడారం మహా జాతర ప్రారంభం

మనదేశంలో అనేక జాతరలు జరుగుతున్నప్పటికీ మేడారం జాతర ప్రత్యేకతనే వేరు. రెండేళ్ళకోసారి జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఎందరో భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు రావడం ఆనవాయితి. ఆ భక్తులను నిరుత్సాహ పరచకూడదనే ఉద్దేశ్యంతోపాటు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం జాతరను నిర్వహిస్తుంది. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పంజా విసిరింది. ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితంగా కరోనా వైరస్‌ను నియంత్రించగలిగాం. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా, ఒమిక్రాన్‌లు స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో భక్తుల సంరక్షణ ప్రభుత్వానికి కత్తి మీద సాములా పరిణమించింది. ఇందుకుగాను ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ప్రజలు ఎవరికివారు బాధ్యతయుతంగా స్వీయరక్షణ చర్యలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ జాతర నిస్సందేహంగా భక్తుల ఆధ్యాత్మిక యాత్ర.

Laxnmana Rao
G.Laxnman Kumar

Writer :

జి.లక్ష్మణ్‌ కుమార్‌,
అసిస్టెంట్‌ డైరక్టర్‌,
సమాచార పౌర సంబంధాల శాఖ (Story : తెలంగాణ కుంభమేళా!)

 

రేపటి నుంచే మేడారం మహా జాతర ప్రారంభం

0
Medaram Jathara
Medaram Jathara

రేపటి నుంచే మేడారం మహా జాతర ప్రారంభం

ములుగు : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిచెందిన మేడారం (Medaram) మహా జాతరకు రంగం సిద్ధమైంది. ఈ జాతరకు సర్వం సిద్ధం చేశామని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడిరచారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. జాతర నిర్వహణకు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్‌ (KCR) సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలను చేపట్టామని మంత్రి తెలిపారు. భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని, అలాగే అన్ని రకాల కరోనా నిబంధనలను పాటించామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు 2500 కార్మికులు, 650 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని మంత్రి వెల్లడిరచారు.
తెలంగాణ (Relangana) రాష్ట్ర ఆవిర్భావం తరువాత సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయం తెల్సిందే. అందుకనుగుణంగా గత ఎనిమిది ఏళ్లలో నాలుగు సార్లు జాతర నిర్వహణకు 381 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. జాతరకు రోడ్లు వేయడానికి, జాతరలో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పనకు, జాతర నిర్వహణకు ఈ నిధులు వినియోగించారు. ఈసారి జాతరలో 10,000 మందికి పైగా పోలీసులు శాంతి భద్రతలను కాపాడడానికి బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అధునాతన సాంకేతికతతో కంట్రోల్‌ రూమ్‌ నుండి నిఘా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే జంపన్న వాగులోకి లక్నవరం నీటిని విడుదల చేశామని, వాగులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 6 వేల తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. జాతరలో వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా మేడారంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రిని, ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో మరో పది పడకలతో తాత్కాలిక ఆసుపత్రిని జాతర పరిసరాలలో 35 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. దీనికి తోడుగా 108, 104 లతో పాటు బైక్‌ అంబులెన్సులు కూడా వినియోగిస్తున్నామని చెప్పారు.
జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం 3,840 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే సమ్మక్క, సారలమ్మ తల్లుల గద్దెల సమీపంలో వసతులు ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా హనుమకొండ నుంచి జాతరకు హెలికాప్టర్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. దాదాపు 30 వేల మంది వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ జాతరను విజయవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయలకు అతీతంగా జాతర వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.  (Story : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిచెందిన మేడారం మహా జాతరకు రంగం సిద్ధమైంది. )

See Also : కేసీఆర్‌తో మ‌మ‌త మాటామంతీ

 

మాటరాని మౌనమిది ఫస్ట్ లుక్

0
Maataraani Mounamidhi
Maataraani Mounamidhi

శుక్ర దర్శకుని రెండవ సినిమా మాటరాని మౌనమిది ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు
పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”. ఈ చిత్రంతో
అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో ట్రైన్ అయ్యిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి
సోని శ్రీవాస్తవ ప్రేక్ష‌కుల ముందుకు పరిచయం కాబోతున్నారు. లవ్ స్టొరీ
మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న “మాటరాని
మౌనమిది” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అబ్బాయి మరియు అమ్మాయి
ఫేస్ కనపడకుండా, లవ్ ఎలిమెంట్ ఉంటూనే, పెయింటింగ్ లో మిక్స్ చేసిన
లైటింగ్ కొంత అనుమానం క్రియేట్ చేసేలాగా  ఇంట్రెస్టింగ్ గా ఉంది

దర్శకుడు తొలి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యి పెట్టుబడిని పదింతలు
చెయ్యగా, అమెజాన్ ప్రైమ్ లో 18 లక్షలుకి పైగా వీక్షకులు కూడా చూసారు. ఆ
సక్సెస్ ఇచ్చిన అర్హతతో చేస్తున్న రెండవ సినిమా ఇది.

న‌టీ న‌టులు – మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి,
సంజీవ్ , శ్రీహరి తదితరులు.

సాంకేతిక వ‌ర్గం – , సినిమాటోగ్ర‌ఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ
: జియ‌స్ కె మీడియా,
నిర్మాత : రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్.
ద‌ర్శ‌కుడు : సుకు పూర్వాజ్ (Story : మాటరాని మౌనమిది ఫస్ట్ లుక్ )

See Also : మంచి ఫీల్‌తో ఇంటికి వెళ్తారు

ప్రొడ్యూసర్ గా మారిన మేఘ ఆకాష్ తల్లి

0
Megha Akash's mom Bindu Akash
Megha Akash's mom Bindu Akash

ప్రొడ్యూసర్ గా మారిన మేఘ ఆకాష్ తల్లి

మేఘ ఆకాష్ కొత్త సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన తన తల్లి బిందు ఆకాష్!!

‘డియర్ మేఘ’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మేఘ  ఆకాష్ మరో మంచి లవ్
స్టొరీ సైన్ చేసింది. ఈ చిత్రానికి డియర్ మేఘ దర్శకుడు సుశాంత్ రెడ్డి కథ
అందించడం విశేషం.అంతేకాదు నిర్మాణం లో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు.

సుశాంత్ రెడ్డి.ఏ & అభిషేక్ కోట నిర్మాణంలో, మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్
సమర్పణలో కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్
పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

మేఘ ఆకాష్ హీరొయిన్ గా రూపొందబోతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి
అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకుడు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, “డియర్ మేఘ లాంటి హిట్ చిత్రం తరువాత
మేఘ ఆకాష్ తో మా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం పై చాలా
అంచనాలున్నాయి. దర్శకుడు అభిమన్యు బడ్డి పై మాకు చాలా నమ్మకముంది. ముఖ్య
నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నాం. షూటింగ్ కూడా
అతి త్వరలో మొదలవుతుంది.” అన్నారు

కథ : ఏ.సుశాంత్ రెడ్డి
సంగీతం: హరి గౌర
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకత్వం: అభిమన్యు బడ్డి
పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
కో-ప్రొడ్యూసర్: అభిషేక్ కోట
నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట.
సమర్పణ: బిందు ఆకాష్
నిర్మాణ సంస్థ: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ (Story : ప్రొడ్యూసర్ గా మారిన మేఘ ఆకాష్ తల్లి)

See Also : మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!

మంచి ఫీల్‌తో ఇంటికి వెళ్తారు

0
Sharwanand
Sharwanand

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చూసి ఒక చిరున‌వ్వుతో మంచి సినిమా చూశాం అనే ఫీల్‌తో ఇంటికి వెళ్తారు – హీరో శ‌ర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్  (Sharwanand) నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`(Adavaallu Meeku Johaarlu). కిషోర్ తిరుమల ద‌ర్శ‌కుడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. టీజ‌ర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మ‌రింత‌ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కానుంది ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మ‌ట్లాడుతూ – “ఈ సినిమా నేను అనుకున్నంత హ్యాపీగా రావ‌డానికి కార‌ణ‌మైన సినిమాలో ఉన్న ఆడవాళ్లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా క‌థ చెప్పిన‌ప్పుడే అంద‌రూ పూర్తి స‌హాకారం అందిస్తేనే ఈ సినిమా బాగా వ‌స్తుంద‌ని న‌మ్మారు. శ‌ర్వా గారు ఈ సినిమా ఫ్లేవ‌ర్ ఎక్క‌డా మిస్‌కాకుండా పూర్తి స‌హాకారం అందించారు. ర‌ష్మిక అంత బీజీ షెడ్యూల్‌లో కూడా మేం ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జ‌స్ట్ చేసుకుని షూటింగ్‌కి వ‌చ్చింది. కుష్బుగారి పాత్ర‌లో ఆమెను త‌ప్ప ఇంకెవ్వ‌రినీ ఊహించుకోలేము. రాధిక‌గారి లాంటి ఎక్స్ పీరియ‌న్స్డ్ యాక్ట‌ర్‌తో వ‌ర్క్ చేయ‌డం చాల హ్యాపీ..ఈ సినిమా మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. అంద‌రూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామీలీ అంతా క‌లిసి చూసే చిత్రమిది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ – “శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత మ‌ళ్లీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లు చేయ‌లేదు, అలాగే మ‌హానుభావుడు లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌మ‌ని చాలా మంది అడుగుతున్నారు. ఆ సినిమాల్లో ఎలా న‌వ్వించాడో ఆ పాత శ‌ర్వా కావాల‌ని చాలా మంది అడుగుతున్నారు. వాళ్లంద‌రికీ ఒక‌టైతే క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను ఈ సినిమా చూసి వెళ్లేట‌ప్పుడు ఒక మంచి చిరున‌వ్వుతో, ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఇంటికి వెళ్తారు. రాధిక‌గారు, కుష్బుగారి లాంటి యాక్ట‌ర్స్‌తో క‌లిసి న‌టించ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు. ఇదొక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌. ర‌ష్మిక‌తో క‌లిసి న‌టించ‌డం చాలా స‌ర‌దాగా ఉంటుంది. చాలా డైడికేటెడ్ ప‌ర్స‌న్‌. ఇంత‌మంచి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి గారికి థ్యాంక్స్‌. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల ఇలాంటి ఒక బ‌ల‌మైన క‌థ‌కి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు లాంటి టైటిల్ పెట్ట‌డం నిజంగా ప్ర‌శంస‌నీయం. ఇంత మంచి స్క్రిప్ట్ నా ద‌గ్గ‌ర‌కి తీసుకువ‌చ్చినందుకు ఆయ‌న‌కి ధ‌న్య‌వాదాలు. చాలా హ్యాపీగా సినిమా తీశాం. క‌చ్చితంగా మీ అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

ర‌ష్మిక మంద‌న్న మ‌ట్లాడుతూ – “కిషోర్ గారు ఈ స్క్రిప్ట్ న‌రేట్ చేస్తున్న‌ప్పుడే చాలా న‌వ్వుకున్నాను. సినిమా షూటింగ్ లో కూడా న‌వ్వుతూనే ఉన్నాం. డ‌బ్బింగ్ స‌మ‌యంలో కూడా న‌వ్వుతూనే ఉన్నాం..సినిమా అంతా ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆడియ‌న్స్ త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్ర‌వ‌రి25 కోసం నేను చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా నా ఫేవ‌రేట్ చిత్రాల్లో ఒక‌టి. ఇంత మంది సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌తో క‌లిసి న‌టించ‌డం చాలా హ్యాపీ..సుధాక‌ర్‌గారు, దేవీశ్రీ‌, కిషోర్‌, సుజీత్ గారి వ‌ల్లే ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చింది“అన్నారు.

సీనియ‌ర్ న‌టి రాధిక శ‌ర‌త్‌కుమార్‌ మాట్లాడుతూ – “ముందుగా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు టీమ్ అంద‌రికీ కంగ్రాచ్యులేష‌న్స్‌. మొద‌టి రోజు నుండి చాలా హ్యాపీగా షూటింగ్ లో పాల్గొనే వాళ్లం. టీమ్ అంతా ఒక యూనిట్‌లా కూర్చుని ప్ర‌తి సీన్ గురించి మాట్లాడుకుంటూ షూటింగ్ చేశాం. నేను తెలుగులో 250కి పైగా మూవీస్‌లో న‌టించాను. ప్ర‌తి పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉండేలా సినిమా ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి సినిమా చూడండి“ అన్నారు

న‌టి కుష్బు మాట్లాడుతూ – “ఒక సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్‌.. ఈ సినిమాలో అన్ని క్యారెక్ట‌ర్స్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కుంటుంబ విలువ‌లు, బంధాలు నేప‌థ్యంలో అద్బుతంగా తెర‌కెక్కింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాలో భాగ‌మైనందుకు నేను చాలా హ్యాపీ. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం నిజంగా హ్యాపీ..ర‌ష్మిక హానెస్ట్ అండ్ ప్యూర్ సోల్. వెరీ క్యూట్‌. శ‌ర్వా గ్రేట్ పెర్‌ఫార్మ‌ర్‌. ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్ శ‌ర్వానే.. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌“ అన్నారు.

న‌టి జాన్సి మ‌ట్లాడుతూ – “బ‌ల‌మైన క్యారెక్ట‌ర్స్ రైట‌ర్స్ మాత్ర‌మే రాయ‌గ‌ల‌రు అని న‌మ్ముతాను. అన్ని కోణాల నుండి మ‌హిళా క్యారెక్ట‌ర్స్‌కి ప్రాధాన్య‌త ఉండేలా స్క్రిప్ట్ రాసిన కిశోర్ గారికి థ్యాంక్స్‌. ఆడవాళ్లు అన‌గానే సెంటిమెంట్ అనుకుంటారేమో…సిచ్యువేష‌న్స్ ప‌రంగా వ‌చ్చే కామెడీ.. ఉంటుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌“ అన్నారు

నిర్మాత శ్రీ‌కాంత్ మ‌ట్లాడుతూ – “` టీమ్ అంద‌రి స‌పోర్ట్‌తోనే ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఫిబ్ర‌వ‌రి 25 ఫ్యామిలీస్‌తో క‌లిసి సినిమా చూడండి“ అన్నారు.

నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story : మంచి ఫీల్‌తో ఇంటికి వెళ్తారు)

See Also : ర‌వితేజ‌తో క‌లిసి ద్విబాషా చిత్రం

`ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తి

0
Aadavaallu Meeku Johaarlu
Aadavaallu Meeku Johaarlu

శ‌ర్వానంద్‌, ర‌ష్మిక‌, తిరుమ‌ల కిషోర్‌, ఎస్ఎల్‌వీసి `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తి.

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌కటించారు మేక‌ర్స్‌. మ‌హాశివ‌రాత్రికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న రానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన కొత్త పోస్టర్‌లో శర్వానంద్ తన ఆన్-స్క్రీన్ భార్యకు నమస్కరిస్తున్నట్లు క‌నిపిస్తోంది. రష్మిక మందన్నతో పాటు ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం అంద‌రూ ఈ పోస్ట‌ర్లో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ఈ సినిమా ఇతివృత్తాన్ని తెలియ‌జేసేలా ఉంది. శర్వా హావభావానికి చాలా మంది మహిళలు అందమైన చిరునవ్వుతో మెరుస్తున్న‌ట్లు పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది.

టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం టైటిల్ సాంగ్‌, టీజ‌ర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మ‌రింత‌ మంచి రెస్పాన్స్ వస్తోంది. వాలెంటెన్స్ డే కానుకగా దేవి శ్రీ ప్రసాద్  సమకూర్చిన పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య పాటను ఈ రోజు విడుదల చేయనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.

కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ  వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం.సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్
పీఆర్వో: వంశీ-శేఖర్ (story : `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తి)

See Also : జీ5లో ‘బంగార్రాజు’ ఎప్పుడో తెలుసా?

కేసీఆర్‌తో మ‌మ‌త మాటామంతీ

0
KCR-Mamata
KCR-Mamata

కేసీఆర్‌తో మ‌మ‌త మాటామంతీ

కోల్‌క‌తా: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు (KCR) ఊహించిన‌ట్లుగానే జాతీయ ఫ్రంట్‌కు పావులు క‌దులుతున్న‌ట్లు క‌న్పిస్తోంది. తాజాగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సోమ‌వారంనాడు కేసీఆర్‌తో మాట్లాడారు. కేంద్రంలో ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ ఏర్పాటుపై ఆమె ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. దేశ స‌మాఖ్యా స్పూర్తిని ప‌రిర‌క్షించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమె అన్నారు. బెంగాల్‌లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ జ‌య‌భేరీ మోగించింది. ఈ నేప‌థ్యంలో ఆమె మాట్లాడారు. సాధార‌ణ ప్ర‌జ‌ల బాగు కోసం విన‌మ్రంగా క‌లిసి ప‌నిచేయాల‌ని దీదీ పిలుపునిచ్చారు. యూపీ ఎన్నిక‌ల్లో టీఎంసీ బ‌రిలోకి దిగ‌లేద‌ని, చాలా విశాల‌మైన ఉద్దేశంతో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆమె చెప్పారు. వార‌ణాసిలో మార్చి 3వ తేదీన జ‌ర‌గ‌నున్న ర్యాలీలో పాల్గొనున్న‌ట్లు దీదీ చెప్పారు. కాంగ్రెస్‌తో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా స‌క్ర‌మైన సంబంధాలు లేవ‌ని, ఆ పార్టీ త‌న‌దైన శైలిలో వెళ్తుంద‌ని, త‌మ పార్టీ కూడా త‌మ‌దైన శైలిలోనే వెళ్తోంద‌ని ఆమె అన్నారు. స‌మాఖ్యా ప్ర‌భుత్వం ఏర్పాటు విష‌యంలో అంద‌రి స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని దీదీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడిన‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. ప్ర‌జ‌లు కోరితే జాతీయ పార్టీ పెడ‌తాన‌ని, మోదీని, బీజేపీని ఓడించి తీరుతామ‌ని కేసీఆర్ ఆదివారం మీడియా స‌మావేశంలో ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. (Story : కేసీఆర్‌తో మ‌మ‌త మాటామంతీ)

See Also : డోసు పెంచిన కేసీఆర్‌

హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ రుద్ర కొత్త ట్రైలర్‌

0

హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ రుద్ర కొత్త ట్రైలర్‌

ముంబయి : డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సోమవారంనాడు ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో, అందరూ అత్యంత ఆసక్తిగా వేచి చూస్తున్న హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ రుద్ర- ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ రెండవ ట్రైలర్‌ను ఆవిష్కరించింది. ఆసక్తిని మరింత పెంచుతూ, ‘‘జో అందేరా మే చుప్తా హై, మై ఉసే వహీ మిల్తా హూ’’ అనే అజయ్‌ దేవ్‌గన్‌ అద్భుతమైన డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. అతను తనను తాను ఏసీపీ రుద్ర వీర్‌గా పరిచయం చేసుకుంటూ, అత్యంత రహస్యమైన నేరాలను, అత్యంత అసాధారణమైన మార్గాల్లో ఛేదించే విధానాలను మనం ఇందులో చూస్తాము. ప్రముఖ దర్శకుడు రాజేష్‌ మపుస్కర్‌ తెరకెక్కించిన ఈ సైకలాజికల్‌ డ్రామాతో ప్రముఖ నటుడు అజయ్‌ దేవగన్‌ డిజిటల్‌ సిరీస్‌ అరంగేట్రం చేస్తుండగా, ఇందులో అతన్ని గతంలో ఎన్నడూ చూడని పోలీసు పాత్రలో కనిపిస్తారు. బీబీసీ స్టూడియోస్‌ ఇండియా భాగస్వామ్యంలో అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ముంబయిలోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇందులో రాశి ఖన్నా, ఈషా డియోల్‌, అతుల్‌ కులకర్ణి, అశ్విని కల్సేకర్‌, తరుణ్‌ గహ్లోట్‌, ఆశిష్‌ విద్యార్థి మరియు సత్యదీప్‌ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. (Story : హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ థ్రిల్లర్‌ రుద్ర కొత్త ట్రైలర్‌)

“రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌లో, భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన అజయ్ దేవగన్‌తో ఒక అద్భుతమైన థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అప్లాజ్‌కు చెందిన సమీర్ నాయర్ మరియు అతని అద్భుతమైన టీమ్ ఈ షోను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలిగింది. మీరు ఈ షోను పూర్తిగా ఆస్వాదిస్తారని మేము ఆశిస్తున్నాము” అని డిస్నీ స్టార్కంటెంట్ డిస్నీహాట్‌స్టార్ మరియు హెచ్ఎస్‌ఎం ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ హెడ్ గౌరవ్ బెనర్జీ అన్నారు.

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ సమీర్ నాయర్ మాట్లాడుతూ, “రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో ఇంత ప్రతిష్టాత్మకమైన స్థాయిలో అజయ్ దేవగన్ డిజిటల్ అరంగ్రేటంలో  భాగమైనందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాము. అద్భుతమైన తారాగణం, సిబ్బంది మరియు మా నిర్మాణ భాగస్వాములైన బీబీసీ స్టూడియోస్‌తో కలిసి ఈ ప్రత్యేకమైన కథనంపై పని చేయడం అద్భుతమైన అనుభవం. అప్లాజ్‌లో మేము కథలు మరియు కథనాల్లోని శక్తిని విశ్వసిస్తాము మరియు రుద్రతో, మేము పరిశ్రమలో అగ్రగామి డిస్నీ+ హాట్‌స్టార్‌తో మా సృజనాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళతాము. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము’’ అని పేర్కొన్నారు.

దర్శకుడు రాజేష్ మపుస్కర్ మాట్లాడుతూ “రుద్ర సాధారణ పోలీసుగా, క్రైమ్ డ్రామాకు తీక్షణమైన మరియు ఉత్కంఠతో కూడిన కథనాన్ని నడిపిస్తాడు. అతను సత్యాన్ని అనుసరిస్తూ, నేరగాళ్ల మనస్తత్వాన్ని హీరో అసాధారణంగా అన్వేషిస్తాడు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు మరియు దీన్ని గొప్పగా చిత్రీకరించడంతో వీక్షణలోనూ మనోహరంగా ఉంటుందని’’ ధీమా వ్యక్తం చేశారు.

బాలీవుడ్ సూపర్ స్టార్అజయ్ దేవగన్ మాట్లాడుతూ, “రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నా పాత్ర మీరు ఇంతకు ముందెన్నడూ చూడని ప్రతినాయకునిలా కనిపించే అవకాశం ఉంది. ఇది నాకు సవాలుగానూ మరియు స్ఫూర్తిదాయకంగానూ ఉంది అలాగే రుద్ర మాయాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులతో పంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మేము షోను రూపొందించేందుకు ఎంత తీవ్రంగా శ్రమించామో, వారూ అంతే స్థాయిలో ఈ షోతో ప్రేమలో పడతారని నేను ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

నటి ఈషా డియోల్ మాట్లాడుతూ, “మా సిరీస్ ప్రారంభం నుంచి కెమెరా ముందుకు వచ్చేలా చేసిన నా స్నేహితుడు మరియు సహనటుడు అజయ్ దేవగన్‌తో మరోసారి తెరను పంచుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో, నా పాత్ర మరియు ప్రదర్శన ద్వారా ప్రేక్షకులకు ఒక అడుగు దగ్గరవ్వాలని నేను వేచి చూస్తున్నాను’’ పేర్కొన్నారు.

రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో డిజిటల్ రంగ ప్రవేశం చేస్తున్న రాశీ ఖన్నా మాట్లాడుతూ, ‘‘రుద్ర నాకు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది నేను ఇప్పటివరకు పోషించిన అత్యంత క్లిష్టమైన పాత్ర మరియు ఇది ఖచ్చితంగా నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు తీసుకువచ్చింది. నేను ఈ పాత్రను పోషించినందుకు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అజయ్ దేవగన్ వంటి ప్రముఖ నటుడితో తెరపై నటించేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు.

నటుడు అతుల్ కులకర్ణి మాట్లాడుతూ, “నేను రుద్ర-ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను. అజయ్ దేవగన్, ఈషా డియోల్, రాశి ఖన్నా మరియు ఇతర సిబ్బందితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. స్క్రిప్ట్‌లోని సస్పెన్స్ మరియు ట్విస్ట్‌లతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవుతారు. సిబ్బంది మొత్తం అద్భుతమైన పని చేశారు మరియు ప్రతి ఒక్కరూ సిరీస్‌ని చూసే వరకు మేము వేచి ఉండలేకపోతున్నాము’’ అని పేర్కొన్నారు.

నటి అశ్విని కల్సేకర్ మాట్లాడుతూ “దర్శకుడు రాజేష్‌ మపుస్కర్‌తో కలిసి రుద్రది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ నాకు గొప్ప అభ్యాసాన్ని అందించింది మరియు ప్రేక్షకులు ఈ ప్రదర్శనను చూసి థ్రిల్ అవుతారని నేను విశ్వసిస్తున్నాను. మీ కోసం చాలా ట్విస్ట్‌లు మరియు సస్పెన్స్‌లు ఎదురుచూస్తున్నాయి’’ అని తెలిపారు.

ఆరు-ఎపిసోడ్ల సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన బ్రిటిష్ సిరీస్ లూథర్కు భారతీయ అనుసృజన. ఈ ధారావాహిక నేరాలు, వాటిని అడ్డుకునే మరియు సంక్లిష్టమైన కథనాన్ని కలిగి ఉండగా, ఇది అత్యంత తెలివైన నేరగాళ్లు మరియు వారిని వేటాడే డిటెక్టివ్‌ల మానసిక స్థితిని పరిశోధించే విచిత్రమైన రేస్-ఎగైనెస్ట్-ది-క్లాక్ థ్రిల్లర్. రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ ప్రత్యేకంగా డిస్నీహాట్‌స్టార్‌లో 4 మార్చి 2022 నుంచి హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ భాషల్లో అందుబాటులోకి వస్తోంది.

సారాంశం: ముంబయిలో జరిగిన రుద్రది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ రేస్-ఎగైనెస్ట్-ది-క్లాక్ థ్రిల్లర్ కాగా, ఇది అత్యంత తెలివైన నేరగాళ్లు మరియు వారిని వేటాడే డిటెక్టివ్‌ల మనోగతాన్ని ఆవిష్కరిస్తుంది. డీసీపీ రుద్ర వీర్ సింగ్ నేరగాళ్లు మరియు హంతకులను వెంబడించే తీవ్రమైన వ్యక్తిగత వ్యయాన్ని మరియు సామాజిక మేధావి అలియాతో అతను ఏర్పరుచుకునే అసంభవమైన స్నేహాన్ని చిత్రీకరిస్తూ, సీరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ కొత్త తరహాలో ఉంటుంది. సిరీస్‌లో హీరో అప్రమత్తమైన చర్యలకు కేవలం నేపథ్యంగానే కాకుండా, ముంబయి మహానగరం మంచి మరియు చెడుల మధ్య యుద్ధానికి వేదికను నిర్దేశిస్తుంది. ఈ చీకటిలో లోనూ ప్రపంచంలో ప్రేమ ఇంకా ఉందని రుద్ర విశ్వసిస్తాడు. ఎందుకంటే అంతిమంగా మనకు లభించేది మానవత్వమే. ఈ నమ్మకం కోసమే రుద్ర తనకు ఉన్నదంతా త్యాగం చేస్తాడు.

మార్చి 4 నుంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌తో అజయ్ దేవగన్ డిజిటల్ అరంగేట్రాన్ని వీక్షించేందుకు డిస్నీహాట్‌స్టార్‌ను ట్యూన్ చేయండి ~

See Also : మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!

హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ థ్రిల్లర్‌ రుద్ర కొత్త ట్రైలర్‌

ఐపీఎల్‌ తుది జట్లు ఇవే!

0
IPL auction-2022
IPL auction-2022

ఐపీఎల్‌ తుది జట్లు ఇవే!
ఇక ఆడుకోవడమే తరువాయి
పోటాపోటీగా ఆటగాళ్ల ఎంపిక
ఎస్‌ఆర్‌హెచ్‌ తప్ప అన్ని జట్లూ బలమైనవే

న్యూఢల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా వేలం ముగిసింది. రెండురోజుల వేలం ముగిసిన తర్వాత పది ఫ్రాంఛైజీలకు గాను ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నదీ తేలిపోయింది. ఒక్కొక్క ఫ్రాంఛైజీ కనీసం 20మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈసారి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని ఫ్రాంఛైజీలు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, పద్ధతి ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంతో వచ్చే ఐపీఎల్‌ (IPL) టోర్నీ కచ్చితంగా పోటాపోటీగా నిలవనున్నది. 8 జట్లు ఉండే ఐపీఎల్‌ ఈసారి 10 జట్లు అయ్యాయి. గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ జట్లు కొత్తగా చేరాయి. దాదాపు అన్ని జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లు ఉండటం విశేషం, ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) మాత్రం ఎక్కువమంది కుర్రవాళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ఐపీఎల్‌ తుది జట్లు ఇవే!

ముంబయి ఇండియన్స్‌ : రోహిత్‌ శర్మ (Rohit Sharma), బుమ్రా (Bumra), కీరన్‌ పోలార్డ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (రిటైనింగ్‌), బాసిల్‌ థంపి (రూ.30 లక్షలు), మురుగన్‌ అశ్విన్‌ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్‌ బ్రేవిస్‌ (రూ.3 కోట్లు), ఇషాన్‌ కిషాన్‌ (రూ.15.25 కోట్లు)(Ishan Kishan) మిగిలిన మొత్తం: రూ.27.85 కోట్లు, టిమ్‌ డేవిడ్‌ (రూ.8.25 కోట్లు), జోఫ్రా ఆర్చర్‌ (రూ.8 కోట్లు), డానియల్‌ సామ్స్‌ (రూ.2.60 కోట్లు), తిలక్‌వర్మ (రూ.1.70 కోట్లు), మిల్స్‌ (రూ.1.50 కోట్లు), ఉనద్కత్‌ (రూ.1.30 కోట్లు), మెరిడీత్‌ (రూ.కోటి), సంజయ్‌ (రూ.50 లక్షలు), ఫాబియన్‌ అలెన్‌ (రూ.75 లక్షలు), అర్జున్‌ తెంద్కులర్‌ (రూ.30 లక్షలు), రమణ్‌దీప్‌ (రూ.20 లక్షలు), అన్మోల్‌ప్రీత్‌ (రూ.20 లక్షలు), ఆర్యన్‌ జుయల్‌ (రూ.20 లక్షలు), రాహుల్‌ బుద్ధి (రూ.20 లక్షలు), హృతిక్‌ (రూ.20 లక్షలు), అర్షద్‌ఖాన్‌ (రూ.20 లక్షలు).

చెన్నై సూపర్‌ కింగ్స్‌ : ఎంఎస్‌ ధోనీ (MS Dhoni), రవీంద్ర జడేజా, మొయిన్‌ ఆలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌ (రిటైనింగ్‌), తుషార్‌ (రూ.20 లక్షలు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు), దీపక్‌ చాహర్‌ (రూ.14 కోట్లు), ఆసిఫ్‌ (రూ.20 లక్షలు), బ్రావో (రూ.4.4 కోట్లు), ఉతప్ప (రూ.2 కోట్లు)బీ మిగిలిన మొత్తం: రూ.20.45 కోట్లు, శివం దూబె (రూ.4 కోట్లు), జోర్డాన్‌ (రూ.3.6 కోట్లు), శాంట్నర్‌ (రూ.1.90 కోట్లు), మిల్నె (రూ.1.90 కోట్లు), మహేశ్‌ తీక్షణ (రూ.70 లక్షలు), రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ (రూ.1.50 కోట్లు), ప్రశాంత్‌ సోలంకి (రూ.1.20 కోట్లు), కాన్వే (రూ.1 కోటి), ప్రిటోరియస్‌ (రూ.50 లక్షలు), సేనాపతి (రూ.20 లక్షలు), ముఖేశ్‌ చౌదరి (రూ.20 లక్షలు), భగత్‌వర్మ (రూ.20 లక్షలు, హరి నిశాంత్‌ (రూ.20 లక్షలు), జగదీశన్‌ (20 లక్షలు), సిమర్‌జీత్‌ సింగ్‌ (రూ.20 లక్షలు).

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : కేన్‌ విలియమ్సన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, సమద్‌ (రిటైనింగ్‌), పూరన్‌ (10.75 కోట్లు), సుచిత్‌ (రూ.20 లక్షలు), శ్రేయస్‌ గోపాల్‌ (రూ.75 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.4 కోట్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (రూ.8.75 కోట్లు), భువనేశ్వర్‌ కుమార్‌ (రూ.4.20 కోట్లు), నటరాజన్‌ (రూ.4 కోట్లు), ప్రియమ్‌ గార్గ్‌ (రూ.20 లక్షలు), అభిషేక్‌ శర్మ (రూ.6.50 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి (రూ.8.50 కోట్లు)బీ మిగిలిన మొత్తం: రూ.20.15 కోట్లు., రొమారియో షెపర్డ్‌ (రూ.7.75 కోట్లు), మార్కో జాన్సన్‌ (రూ.4.20 కోట్లు), మార్‌క్రమ్‌ (రూ.2.60 కోట్లు), సీన్‌ అబాట్‌ (రూ.2.40 కోట్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (రూ.1.50 కోట్లు), విష్ణు వినోద్‌ (రూ.50 లక్షలు), ఫారూఖీ (రూ.50 లక్షలు), సామ్రాట్‌ (రూ.20 లక్షలు), శశాంక్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), సౌరభ్‌ దూబె (రూ.20 లక్షలు), సుచిత్‌ (రూ.20 లక్షలు).

రాజస్థాన్‌ రాయల్స్‌ : సంజూ శాంసన్‌, బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌ (రిటైనింగ్‌), కరియప్ప (రూ.30 లక్షలు), రియాన్‌ పరాగ్‌ (రూ.3.80 కోట్లు), బౌల్ట్‌ (రూ.8 కోట్లు), అశ్విన్‌ (రూ.5 కోట్లు), చాహల్‌ (రూ.6.50 కోట్లు), హెట్‌మయర్‌ (రూ.8.50 కోట్లు), ప్రసిద్ధ్‌ కృష్ణ (రూ.10 కోట్లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (రూ.7.75 కోట్లు)బీ మిగిలిన మొత్తం: రూ.12.15 కోట్లు, నవ్‌దీప్‌ సైని (రూ.2.60 కోట్లు), కౌల్టర్‌నైల్‌ (రూ.2 కోట్లు), నీషమ్‌ (రూ.1.50 కోట్లు), కరుణ్‌ నాయర్‌ (రూ.1.40 కోట్లు), వాండర్‌ డసెన్‌ (రూ.కోటి), డారెల్‌ మిచెల్‌ (రూ.75 లక్షలు), మెక్‌కే (రూ.75 లక్షలు), కుల్‌దీప్‌ సేన్‌ (రూ.20 లక్షలు), ధ్రువ్‌ జురెల్‌ (రూ.20 లక్షలు), తేజస్‌ (రూ.20 లక్షలు), వై.కుల్‌దీప్‌ (రూ.20 లక్షలు), శుభమ్‌ (రూ.20 లక్షలు), అనునయ్‌ (రూ.20 లక్షలు).

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు : విరాట్‌ కోహ్లీ (Virat Kohli), మ్యాక్స్‌వెల్‌, మహమ్మద్‌ సిరాజ్‌ (రిటైనింగ్‌), డుప్లెసిస్‌ (రూ.7 కోట్లు), అనుజ్‌ రావత్‌ (రూ.3.40 కోట్లు), హేజిల్‌వుడ్‌ (రూ.7.75 కోట్లు), ఆకాశ్‌ దీప్‌ (రూ.20 లక్షలు), షాబాజ్‌ అహ్మద్‌ (రూ.2.40 కోట్లు), దినేశ్‌ కార్తీక్‌ (రూ.5.50 కోట్లు), హర్షల్‌ పటేల్‌ (రూ.10.75 కోట్లు), హసరంగ (రూ.10.75 కోట్లు)బీ మిగిలిన మొత్తం: 9.25 కోట్లు, డేవిడ్‌ విల్లీ (రూ.2 కోట్లు), రూథర్‌ఫోర్డ్‌ (రూ.కోటి), కర్ణ్‌శర్మ (రూ.50 లక్షలు), లొమ్రార్‌ (రూ.95 లక్షలు), ఫిన్‌ అలెన్‌ (రూ.80 లక్షలు), బెరెన్‌డార్ఫ్‌ (రూ.75 లక్షలు), సిద్ధార్థ్‌ కౌల్‌ (రూ.75 లక్షలు), ప్రభుదేశాయ్‌ (రూ.30 లక్షలు), మిలింద్‌ (రూ.25 లక్షలు), అనీశ్వర్‌ (రూ.20 లక్షలు), సిసోడియా (రూ.20 లక్షలు).

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : సునీల్‌ నరైన్‌, ఆండ్రూ రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకేటష్‌ అయ్యర్‌, శివమ్‌ మావి (రూ.7.25 కోట్లు), షెల్డన్‌ జాక్సన్‌ (రూ.60 లక్షలు), కమిన్స్‌ (రూ.7.25 కోట్లు), శ్రేయస్‌ (రూ.12.25 కోట్లు), నితీశ్‌ రాణా (రూ. 8 కోట్లు)బీ మిగిలిన మొత్తం: రూ.12.65 కోట్లు, బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు), ఉమేశ్‌ యాదవ్‌ (రూ.2 కోట్లు), హేల్స్‌ (రూ.1.50 కోట్లు), సౌథీ (రూ.1.50 కోట్లు), రహానె (రూ.కోటి), మహ్మద్‌ నబి (రూ.కోటి), రింకు సింగ్‌ (రూ.55 లక్షలు), అశోక్‌ (రూ.55 లక్షలు) కరుణరత్నె (రూ.50 లక్షలు), అభిజిత్‌ తోమర్‌ (రూ.40 లక్షలు), అనుకుల్‌ (రూ.20 లక్షలు), రసిఖ్‌ దార్‌ (రూ.20 లక్షలు), బాబా ఇంద్రజిత్‌ (రూ.20 లక్షలు), అమన్‌ఖాన్‌ (రూ.20 లక్షలు), ప్రథమ్‌ (రూ.20 లక్షలు), రమేశ్‌ (20 లక్షలు).

ఢల్లీి క్యాపిటల్స్‌ : రిషభ్‌ పంత్‌, అన్రిచ్‌ నార్జ్‌, పృథ్వీషా, అక్షర్‌ పటేల్‌ (రిటైనింగ్‌), శార్దూల్‌ (రూ.10.75 కోట్లు), మిచెల్‌ మార్ష్‌ (రూ.6.50 కోట్లు), ముస్తాఫిజుర్‌ (రూ.2 కోట్లు), కేఎస్‌ భరత్‌ (రూ.2 కోట్లు), వార్నర్‌ (రూ.6.25 కోట్లు), కుల్‌దీప్‌ యాదవ్‌ (రూ.2 కోట్లు), అశ్విన్‌ హెబ్బర్‌ (రూ.20 లక్షలు), కమలేష్‌ నాగర్‌కోటి (రూ.1.10 కోట్లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (రూ.20 లక్షలు)బీ మిగిలిన మొత్తం: రూ.16.50 కోట్లు, ఖలీల్‌ అహ్మద్‌ (రూ.5.25 కోట్లు), చేతన్‌ సకారియా (రూ.4.20 కోట్లు), మన్‌దీప్‌ సింగ్‌ (రూ.1.10 కోట్లు), లలిత్‌ యాదవ్‌ (రూ.65 లక్షలు), ఎంగిడి (రూ.50 లక్షలు), సీఫర్ట్‌ (రూ.50 లక్షలు), ప్రవీణ్‌ దూబె (రూ.50 లక్షలు), యశ్‌ ధుల్‌ (రూ.50 లక్షలు), విక్కీ (రూ.20 లక్షలు), రిపల్‌ పటేల్‌ (రూ.20 లక్షలు).

పంజాబ్‌ కింగ్స్‌ : మయాంక్‌ అగర్వాల్‌, హర్ష్‌దీప్‌ సింగ్‌ (రిటైనింగ్‌), జితేశ్‌ శర్మ (రూ.20 లక్షలు), షారుక్‌ ఖాన్‌ (రూ.9 కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (రూ.3.80 కోట్లు), ధావన్‌ (రూ.8.25 కోట్లు), ఇషాన్‌ పోరెల్‌ (రూ.25 లక్షలు), రబాడ (రూ.9.25 కోట్లు), రాహుల్‌ చాహర్‌ (రూ.5.25 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (రూ.60 లక్షలు)బీ మిగిలిన మొత్తం: రూ.28.65 కోట్లు, లివింగ్‌స్టోన్‌ (రూ.11.50 కోట్లు), ఒడియన్‌ స్మిత్‌ (రూ.6 కోట్లు), రాజ్‌ బవా (రూ.2 కోట్లు), వైభవ్‌ (రూ.2 కోట్లు) ఎలిస్‌ (రూ.75 లక్షలు), రిషి ధావన్‌ (రూ.55 లక్షలు), సందీప్‌శర్మ (రూ.50 లక్షలు), వైభవ్‌ (రూ.50 లక్షలు), భానుక రాజపక్స (రూ.50 లక్షలు), హోవెల్‌ (రూ.40 లక్షలు), ప్రేరక్‌ (రూ.20 లక్షలు), అథర్వ (రూ.20 లక్షలు), వృతిక్‌ ఛటర్జీ (రూ.20 లక్షలు), బాల్‌తేజ్‌ (రూ.20 లక్షలు), అన్ష్‌ పటేల్‌ (రూ.20 లక్షలు).

గుజరాత్‌ టైటాన్స్‌ : హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (ముందుగానే ఎంపిక), నూర్‌ అహ్మద్‌ (రూ.30 లక్షలు), రాయ్‌ (రూ.2 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు), రాహుల్‌ తెవాతియా (రూ.9 కోట్లు), అభినవ్‌ (రూ.2.60 కోట్లు), ఫెర్గూసన్‌ (రూ.10 కోట్లు), సాయి కిశోర్‌ (రూ.3 కోట్లు)బీ మిగిలిన మొత్తం: రూ.18.85 కోట్లు, యశ్‌ దయాళ్‌ (రూ.3.20 కోట్లు), మిల్లర్‌ (రూ.3 కోట్లు), వేడ్‌ (2.45 కోట్లు), జోసెఫ్‌ (రూ.2.40 కోట్లు), సాహా (రూ.1.90 కోట్లు), జయంత్‌ యాదవ్‌ (రూ.1.70 కోట్లు), విజయ్‌ శంకర్‌ (రూ.1.40 కోట్లు), డ్రేక్స్‌ (రూ.1.10 కోట్లు), గుర్‌కీరత్‌ సింగ్‌ (రూ.50 లక్షలు), వరుణ్‌ అరోన్‌ (రూ.50 లక్షలు), దర్శన్‌ (రూ.20 లక్షలు), సాయి సుదర్శన్‌ (రూ.20 లక్షలు), ప్రదీప్‌ సాంగ్వాన్‌ (20 లక్షలు).

లక్నో సూపర్‌జెయింట్స్‌ : కె.ఎల్‌.రాహుల్‌, మార్కస్‌ స్టాయినిస్‌, రవి బిష్ణోయ్‌ (ముందుగానే ఎంపిక), అవేశ్‌ ఖాన్‌ (రూ.10 కోట్లు), డికాక్‌ (రూ.6.75 కోట్లు), మార్క్‌వుడ్‌ (రూ.7.50 కోట్లు), మనీశ్‌ పాండే (రూ.4.60 కోట్లు), హోల్డర్‌ (రూ.8.75 కోట్లు), దీపక్‌ హుడా (రూ.5.75 కోట్లు), కృనాల్‌ పాండ్య (రూ.8.25 కోట్లు), అంకిత్‌ సింగ్‌ (రూ.50 లక్షలు)బీ మిగిలిన మొత్తం: రూ.6.90 కోట్లు, చమీర (రూ.2 కోట్లు), ఇవెన్‌ లూయిస్‌ (రూ.2 కోట్లు), కె.గౌతమ్‌ (రూ.90 లక్షలు), నదీమ్‌ (రూ.50 లక్షలు), కైల్‌ మేయర్స్‌ (రూ.50 లక్షలు), మనన్‌ వోహ్రా (రూ.20 లక్షలు), మొహిసిన్‌ ఖాన్‌ (రూ.20 లక్షలు), మయాంక్‌ యాదవ్‌ (రూ.20 లక్షలు), ఆయూష్‌ బదోని (రూ.20 లక్షలు), కరణ్‌శర్మ (రూ.20 లక్షలు). (story : ఐపీఎల్‌ తుది జట్లు ఇవే!)

See Also : యువ క్రికెటర్లకు కాసులపంట

Photo Gallery

error: Content is protected !!