Home Blog Page 962

అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

0
Nagarjuna adopts the forest
Nagarjuna adopts the forest

అడవిని దత్తత తీసుకున్న నాగార్జున
హైదరాబాద్‌ : సినీ నటుడు, ‘కింగ్‌’ అక్కినేని నాగార్జున తెలంగాణ రాష్ట్రంలో ఒక అడవిని దత్తత తీసుకున్నారు. తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్లు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గురువారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినోత్సవం సందర్భంగా, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్లలో అడవిని నాగార్జున దత్తత తీసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్‌ ఫారెస్ట్‌ అని నామకరణం చేశారు. దీని ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్‌, సుమంత్‌, సుశాంత్‌, సురేఖ, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. (Story : అడవిని దత్తత తీసుకున్న నాగార్జున)

See Also : డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

0
Metaverse Marriage
Metaverse Marriage

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!
రిసెప్షన్‌ను హోస్ట్‌ చేసిన తమిళనాడు జంట

చెన్నై : డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి! తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా అంశెట్టి తాలూకా శివలింగపురం గ్రామంలో జరిగిన రిసెప్షన్‌లో నూతన వధూవరులు ప్రపంచ ఖ్యాతి గడిరచారు. బ్లాక్‌చెయిన్‌, ఎన్‌ఎఫ్‌టీలు, క్రిప్టో కరెన్సీల లావాదేవీల్లో పనిచేస్తున్న దినేష్‌ ఆసియాలో తనది మొదటి మెటావర్స్‌ వివాహం అని ప్రకటించాడు. నాకు ఫిబ్రవరి 2022లో వివాహం జరిగింది. వధువు పేరు జనగానందిని. మహమ్మారి కారణంగా అతిథులను పరిమితం చేసినందున, ఫిబ్రవరి 6న మెటావర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో నా రిసెప్షన్‌ని నిర్వహించాలని ప్లాన్‌ చేశాను అని అతను చెప్తున్నాడు. ఈ మెటావర్స్‌ మ్యారేజీ అంటే అర్థం కావడం కాస్త కష్టమే. కాకపోతే, ఐటీ విద్యార్థులకు, నిపుణులకు ఇది సులువుగా అర్థమవుతుంది. మెటావర్స్‌ మ్యారేజీ అంటే ఒక విధంగా బొమ్మల పెళ్లి అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనుషులకు బదులుగా వారి రూపాలను డిజిటలైజ్‌ చేసి పెళ్లిచేస్తారు. ఇదంతా ఆన్‌లైన్‌ లైవ్‌లో జరుగుతుంది.
హ్యారీ పోటర్‌ నుండి హాగ్వార్ట్స్‌ థీమ్‌ను వారి రిసెప్షన్‌ కోసం ఈ జంట ఎంపిక చేసుకున్నారు. చెన్నై నుండి మెటావర్స్‌లో సంగీత కచేరీ జరిగింది. ఈ కార్యక్రమంలో రిసెప్షన్‌కు హాజరైన దాదాపు 200 మంది అతిథులు వారి ఇళ్లలో ఆహారాన్ని స్వీకరించారు. అద్వితీయమైన మెటావర్స్‌ వివాహ రిసెప్షన్‌ ఆసియాలో మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ పెళ్లి పెద్ద హిట్‌ అయ్యిందని దినేష్‌, జనగానందిని కోసం వర్చువల్‌ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించిన శ్రీపెరంబుదూర్‌ ఆధారిత సమాచార సాంకేతిక సంస్థ టర్డీవెర్స్‌ సీఈవో వినేష్‌ సెల్వరాజ్‌ పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడానికి మా 12 మంది సభ్యుల బృందానికి జనవరి 3 నుండి దాదాపు నెల పట్టిందని విఘ్నేష్‌ తెలిపారు. మెటావర్స్‌ 3.0 టెక్నాలజీ ప్రజలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు. ఈ విశిష్ట కార్యక్రమం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి, విదేశాల నుండి విఘ్నేష్‌ 60 ఆర్డర్‌లను పొందారు. ప్రస్తుతం అతను ఈ ఫిబ్రవరి 14న చెన్నైలోని మెటావర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో వాలెంటైన్స్‌ డే వేడుకలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమికులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో బహుమతులు మార్చుకోవచ్చు అని కూడా అతను చెప్పారు. ‘‘టర్డీవర్స్‌ గత ఏప్రిల్‌లో మరణించిన వధువు చివరి తండ్రి అవతారాలతో పాటు అతిథులు, వధువు, వరుడి అవతార్‌లను సృష్టించింది. దినేష్‌ కోరినట్లు మేము అతని మామగారి 3డీ అవతార్‌ని సృష్టించాం. భారతదేశంతోపాటు విదేశాలలో ఇలాంటి సంఘటనలకు పెద్ద స్కోప్‌ ఉంది’’ అని విఘ్నేష్‌ చెప్పారు. క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ అయిన కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ మద్దతుతో ఈ రిసెప్షన్‌ జరిగింది.
మెటావర్స్‌ వర్చువల్‌ ప్రపంచంలో వ్యక్తులు పరస్పరం సంభాషించుకోవచ్చు. సమావేశాలు నిర్వహించ్చుకోవచ్చు. ఇప్పుడు భూమిని కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. సహజంగానే ఈ మెటావర్స్‌ సాంకేతిక పరిజ్ఞానం సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో భారీ విజయాన్ని సాధించింది.
ది మ్యాట్రిక్స్‌ సినిమా చూసేవుంటారు. ఇదొక కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ కథ. స్వోర్డ్‌ ఆర్ట్‌ ఆన్‌లైన్‌ ప్రసిద్ధ యానిమే సిరీస్‌. ఈ మూవీలు మెటావర్స్‌ సాంకేతికతను మలచాయి. గత సంవత్సరం నవంబర్‌లో, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ గేమ్‌ ఆధారిత మెటావర్స్‌లోకి ప్రవేశించిన మొదటి నటుడిగా మారడానికి కొత్త వర్చువల్‌ అవతార్‌ ప్రణాళికలను ఆవిష్కరించారు. (Story: డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!)

See Also: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై

ఇకపై పిల్లలకూ హెల్మెట్‌!

0
helmets-for-kids
helmets-for-kids

ఇకపై పిల్లలకూ హెల్మెట్‌!
న్యూఢల్లీ: ఇకపై పిల్లలకు కూడా హెల్మట్‌ ధారణ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. బైక్‌రైడర్‌కు, చైల్డ్‌కు మధ్య బెల్ట్‌ తరహా భద్రతాపరికరం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాల నుంచి ద్విచక్ర వాహనదారులకు భద్రత కల్పించే వీలుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు రూపొందించింది. నాలుగేళ్ల లోపు పిల్లలను బైక్‌పై తీసుకెళ్తే వారికి కూడా హెల్మెట్‌ పెట్టాలని తెలిపింది. అంతేగాక, బైక్‌ నడిపే వారికి, చిన్నారులకు మధ్య సేఫ్టీ హార్నెస్‌(బెల్ట్‌ లాంటిది) ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాకపోతే పిల్లలకు సరిపడా హెల్మెట్‌ సైజులు మార్కెట్‌లో లేవు. అందువల్ల ఈ హెల్మెట్ల తయారీపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారులను బైక్‌పై తీసుకెళ్తే.. వారికి క్రాష్‌ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. బైక్‌పై పిల్లలు ఉన్నప్పుడు స్పీడ్‌ 40 కేఎంపీహెచ్‌కు మించరాదని ఆదేశించారు. ఈ కొత్త మార్గదర్శకాలు 2023 ఫిబ్రవరి 15 నుంచి అమల్లో వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవర్‌ లైసెన్స్‌ను రద్దు చేయనున్నట్లు హెచ్చరించింది. ఈ నూతన మార్గదర్శకాలకు సంబంధించి గతేడాది అక్టోబరులోనే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన అనంతరం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరోవైపు నాలుగేళ్ల లోపు చిన్నారులకు ప్రత్యేకంగా హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్‌ తయారీ సంస్థలను ఆదేశించింది. అప్పటిదాకా సైకిళ్లపై ఉపయోగించే హెల్మెట్లను పిల్లలకు పెట్టాలని స్పష్టం చేసింది. డ్రైవర్‌ వెనకాల కూర్చుని ఉన్న పిల్లలు బైక్‌ పైనుంచి పడిపోకుండా సేఫ్టీ హార్నెస్‌ ధరించాలని మార్గదర్శకాలు స్పష్టంచేశాయి. ఈ హర్నెస్‌ కనీసం 30 కేజీల బరువు మోసేలా రూపొదించాలని ఉత్పాదక సంస్థలకు సూచించింది.

ట్రాకింగ్‌ డివైజ్‌లు తప్పనిసరి
ప్రమాదకర రసాయనాల వంటివి రవాణా చేసే వాహనాల విషయంలోనూ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఆ వాహనాలకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ డివైజ్‌ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘’ఆర్గోన్‌, నైట్రోజెన్‌, ఆక్సిజన్‌ వంటి ప్రమాదకర వాయువులు లేదా రసాయనాలను రవాణా చేసే వాహనాలకు(నేషనల్‌ పర్మిట్‌ కిందకు రానివి) ట్రాకింగ్‌ వ్యవస్థ లేదని మా దృష్టికి వచ్చింది. అందుకే అలాంటి వాహనాలకు ఇకపై వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను అటాచ్‌ చేయాలని నిర్ణయించాం. దీనిపై డ్రాఫ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాం. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా ప్రజలు తమ సూచనలు, సలహాలు తెలియజేయాలి’’ అని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పిల్లలకు హెల్మెట్‌, రసాయనాల రవాణా వాహనాలకు ట్రాకింగ్‌ డివైజ్‌ల అమరిక అనేవి రెండూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలుగా భావిస్తున్నారు. (Story: ఇకపై పిల్లలకూ హెల్మెట్‌!)

See Also : ఎమ్మెల్యేతో మేయర్‌ పెళ్లి

‘జగనన్న తోడు’ మూడో దశ డబ్బులు జమ ఎప్పుడో తెలుసా?

0
YSR Jagananna Thodu Scheme
YSR Jagananna Thodu Scheme

‘జగనన్న తోడు’ మూడో దశ డబ్బులు జమ ఎప్పుడో తెలుసా?
విజయవాడ : ‘జగనన్న తోడు’ డబ్బులు త్వరలో లబ్ధిదారుల జేబుల్లో జమకానున్నాయి. ఈ మేరకు డేట్‌ ఫిక్స్‌ అయింది. రాష్ట్రంలో అధిక వడ్డీల బారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు జగనన్న తోడుకు సంబంధించి రెండు దశలు పూర్తయ్యాయి. ఈ రెండు దశల్లోనూ లబ్ధిదారులకు నగదు ఖాతాల్లోకి వెళ్లిపోయింది. ఇక ఫిబ్రవరి 22న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) ‘జగనన్న తోడు’ మూడో దశను ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 14 వరకు 9,05,023 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 6,91,530 మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందారు. మూడో దశలో మరో 1,57,760 మందికి రుణాలు పొందుతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితానుంచి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జగనన్న తోడు పథకం క్రింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారికి ఏటా 10 వేల రుపాయిలు వరకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పది వేల రుపాయిలకు ఏడాదికి అయ్యే వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు అందిస్తుంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని లబ్దిదారులు తిరిగి చెల్లించిన తర్వాత మరలా వారు బ్యాంకుల నుండి మళ్ళీ వడ్డీ లేని రుణం తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.  (Story: ‘జగనన్న తోడు’ మూడో దశ డబ్బులు జమ ఎప్పుడో తెలుసా?)

See Also : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

వివాహేతర సంబంధం దుష్ప్రవర్తన కాదట!

0
Illegal Relationship in India
Illegal Relationship in India

వివాహేతర సంబంధం దుష్ప్రవర్తన కాదట!
అహ్మదాబాద్‌ : వివాహేతర సంబంధం అనైతిక చర్యే తప్ప దుష్ప్రవర్తన (బ్యాడ్‌ బిహేవియర్‌) కాదని ఓ కోర్టు వ్యాఖ్యానించింది. సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని ‘‘అనైతిక చర్య’’గా చూడగలిగినప్పటికీ, దానిని ‘‘దుష్ప్రవర్తన’’గా పరిగణించలేమని గుజరాత్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్‌ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్‌ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. ‘‘అయితే పిటిషనర్‌ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని’’ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేమని కోర్టు స్పష్టం చేసింది. (Off Beat Story : వివాహేతర సంబంధం దుష్ప్రవర్తన కాదట!)

See Also : ఎమ్మెల్యేతో మేయర్‌ పెళ్లి

ఎమ్మెల్యేతో మేయర్‌ పెళ్లి

0
Hindu Marriage
Hindu Marriage

ఎమ్మెల్యేతో మేయర్‌ పెళ్లి
తిరువనంతపురం : సీపీఎం ఎమ్మెల్యే, సీపీఎం మేయర్‌…వీళ్లద్దరూ వివాహం చేసుకొని ఒక్కటి కాబోతున్నారు. కేరళలో ఈ పెళ్లి జరగబోతున్నది. ప్రస్తుతం కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో వున్న విషయం తెల్సిందే. ఈ యువ నేతలిద్దరూ మొదట్నించీ సీపీఎం, దాని అనుబంధ సంఘాల్లో మంచి కార్యకర్తలుగా పనిచేశారు. ఆమె దేశ ప్రజలను తన వైపు ఆకర్షించి చిన్న వయసులోనే మేయర్‌ పీఠాన్ని అధిరోహించారు.. ఆయన రాష్ట్ర అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యేందకు సిద్దమయ్యారు. ఈ విషయం కేరళలో ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ ఎవరంటే.. తిరువనంతపురం మేయర్‌ ఆర్యా రాజేంద్రన్‌, బలుస్సెరీ ఎమ్మెల్యే సచిన్‌ దేవ్‌. విద్యాభ్యాసం తర్వాత బాలసంఘం, ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిరది. అనంతరం వీరు మంచి స్నేహితులయ్యారు. కాగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న సమయంలో సచిన్‌ దేవ్‌కు 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార సీపీఎం పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో, ఎన్నికల్లో బలుస్సెరీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు ధర్మజన్‌ బోల్గట్టిపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కేరళలో అతిచిన్న వయస్సుల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మరోవైపు.. తిరువనంతపురం మేయర్‌ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్‌ సీపీఎం పార్టీ తరఫున పోటీ చేశారు. సీనియర్‌ అభ్యుర్థులకు షాకిస్తూ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే 21 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎన్నికై దేశం దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య స్నేహ బంధం కాస్తా.. త?్వరలో వివాహం బంధం కానుంది. వీరికి పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు అంగీకరించినట్టు సచిన్‌ దేవ్‌ ధ్రువీకరించారు. పెళ్లి తేదీ ఫిక్స్‌ కాగానే ఒకటవుతామని ఆయనన్నారు. (Story : ఎమ్మెల్యేతో మేయర్‌ పెళ్లి)

See Also : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై

నాని `దసరా` చిత్రం షురూ!

0
Nani Dasara Movie
Nani Dasara Movie

నాని `దసరా` చిత్రం షురూ!

నాని `దసరా` చిత్రం షురూ! నాని, శ్రీకాంత్ ఓదెల, SLVC కాంబినేష‌న్‌లో `దసరా` చిత్రం  ఘనంగా ప్రారంభమైంది. నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు,  ఇప్పుడు మునుపెన్నడూ చూడని పాత్రలలో విభిన్న పాత్రలతో ప్రెజెంట్ చేయ‌బోతున్నాడు. శ్యామ్ సింఘ రాయ్ విజయంతో వున్న నాని ఇప్పుడు మొద‌టిసారి శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో ద‌స‌రా చిత్రం చేస్తున్నాడు.  సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఆధ్వర్యంలో దసరాకు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. క‌థానాయిక‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ (Keerthi Suresh) న‌టించ‌నుంది.

దసరా చిత్రం ఈరోజు (బుధ‌వారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా స్విచాన్ చేయగా, నాని, కీర్తి సురేష్ క్లాప్ కొట్టారు. తిరుమల కిషోర్, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెల చిత్ర స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు.

గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథలో నాని మాస్ అండ్‌ యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. దసరా కుటంబ‌క‌థ డ్రామాగా రూపొందుతోంది. అంతేకాక దసరా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీతో సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్,  జరీనా వహాబ్ ముఖ్య తారాగణం.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి, 2022 నుండి ప్రారంభమవుతుంది. (Story : నాని `దసరా` చిత్రం షురూ!)

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం – శ్రీకాంత్ ఓదెల

నిర్మాత – సుధాకర్ చెరుకూరి

ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ISC

సంగీతం: సంతోష్ నారాయణన్

ఎడిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి

PRO: వంశీ-శేఖర్

See Also : మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!

 

ఆకట్టుకుంటున్న 1134 ఫస్ట్ లుక్ 

0
1134 Movie
1134 Movie

ఆకట్టుకుంటున్న 1134 ఫస్ట్ లుక్ 

ఆకట్టుకుంటున్న 1134 ఫస్ట్ లుక్ : ఈ రోజుల్లో కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగిన కంటెంట్‌తో వచ్చే సినిమాలు గొప్ప విజయం సాధిస్తున్నాయి. స్టార్ నటీనటులు నటించకపోయినా కథలో బలం ఉండాలే గానీ ఆ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. కొత్త దర్శకనిర్మాతలు సైతం అలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే 1134 అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.
రాబరీ థ్రిల్లర్‌గా మునుపెన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని ఈ 1134 రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు శరత్ చంద్ర తడిమేటి. తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్ని వర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో బాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 1134 అనే డిఫరెంట్ టైటిల్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. నడిరోడ్డుపై డబ్బుల బ్యాగ్, ఆ వెనుక ముగ్గురు వ్యక్తుల షాడోతో కూడిన ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు బోలెడన్ని ఉంటాయని స్పష్టమవుతోంది.
రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రానికి శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వం వహిస్తున్నారు. గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
నటీనటులు: 
గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు
సాంకేతిక వర్గం:
డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటి
బ్యానర్: రాంధుని క్రియేషన్స్
మ్యూజిక్: శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి
డీఓపీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి
డీఐ: గజ్జల రక్షిత్ కుమార్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు (Story : ఆకట్టుకుంటున్న 1134 ఫస్ట్ లుక్ )

మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!

0
Bappi Lahiri
Bappi Lahiri

మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!
ముంబయి : మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది! మూస సంగీతానికి స్వస్తిచెప్పి, నృత్యాలకు ఉషారుతెప్పించిన బప్పీలహరి కన్నుమూశారు. బప్పీలహరి అంటేనే ఓ సంచలనం. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రాజకీయ నాయకుడు, రికార్డు ప్రొడ్యూసర్‌ బప్పీలహరి ముంబయిలోని ఒక ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. భారతీయ సంగీతానికి సింథసైజ్‌డ్‌ డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన బప్పీలహరి సంగీతం అందించిన పాటలకు కుర్రకారు నేటికీ డ్యాన్సులు చేస్తారంటే ఆయన ప్రభావం భారతీయ సంగీతంపై ఎంతవుందో అర్థమవుతుంది. 1952 నవంబరు 27న పశ్చిమబెంగాల్‌ జల్‌పైగురిలో జన్మించిన బప్పీలహరి మంగళవారం రాత్రి తీవ్రమైన అస్వస్థతతో తుదిశ్వాస విడిచారు. వర్దాత్‌, డిస్కోడ్యాన్సర్‌, నమక్‌ హలాల్‌, షరాబీ, నయాకదమ్‌, మాస్టర్‌జీ, బేవఫాయ్‌, మక్సద్‌, సురాగ్‌, ఇన్సాఫ్‌ మే కరూంగా, డ్యాన్స్‌డ్యాన్స్‌, కమాండో, సాహెబ్‌, గ్యాంగ్‌లీడర్‌, సైలాబ్‌ వంటి సినిమాలకు ఆయన అందించిన సూపర్‌హిట్‌ సాంగ్స్‌కు నేటికీ వింటూనే వుంటాం. అమర్‌సంగీ, ఆశా ఓ భలోబాషా, ఆమర్‌ తుమీ, అమర్‌ప్రేమ్‌, మందిర, బద్నామ్‌, రక్తేలేఖా, ప్రియా వంటి బెంగాలీ సినిమాలకు స్వరాష్ట్రంలో సంగీత దర్శకత్వం వహించిన బప్పీలహరి నన్హా శికారీ (1973)తో హిందీ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. 1970, 80, 90 దశకాల్లో బప్పీలహరి అంటే యువతకు ఓ పిచ్చి. ఆయన కెరీర్‌ మొత్తం డిస్కో స్టైల్‌తోనే నడిచింది. మిథున్‌ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్‌, డ్యాన్స్‌డ్యాన్స్‌ సినిమాలు యువతను ఊపేశాయి. కిశోర్‌కుమార్‌, మహమ్మద్‌ రఫీలను ఒకే సినిమాలో పాడిరచిన ఘనత ఆయనదే. ఎన్నో గజల్స్‌ను కూడా కంపోజ్‌ చేసి పేరుప్రఖ్యాతులు గడిరచారు. బాఫీు`3 ఆయన ఆఖరి సినిమా. విశేషమేమిటంటే, బప్పీలహరి హిందీ తర్వాత తెలుగు సినిమాలకు అధికంగా సంగీత దర్శకత్వం వహించారు. సింహాసనం సినిమాతో సూపర్‌స్టార్‌ కృష్ణ బప్పీలహరిని టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ‘ఆకాశంలో ఒక తార…’ వంటి పాటలతో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఏకంగా 26 తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. అందులో సింహాసనంతోపాటు తేనె మనసులు, త్రిమూర్తులు, శంఖారావం, సామ్రాట్‌, కలెక్టర్‌ విజయ, మన్మథ సామ్రాజ్యం, స్టేట్‌రౌడీ, చిన్నా, చిన్నకోడలు, ఇంద్రభవనం, గ్యాంగ్‌లీడర్‌, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు, దొంగపోలీస్‌, రక్తతర్పణం, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, బ్రహ్మ, నిప్పురవ్వ, రౌడీ రాజకీయం, బిగ్‌బాస్‌, ముద్దాయి ముద్దుగుమ్మ, ఖైదీ ఇన్‌స్పెక్టర్‌, పుణ్య భూమి నా దేశం సినిమాలకు సంగీతం అందించారు. యాక్షన్‌ త్రీడీ సినిమాకు తన కుమారుడు బప్పాలహరికి సహకారం, డిస్కో రాజా సినిమాలో ఒక పాట పాడారు. తెలుగులో ఎక్కువగా కృష్ణ సినిమాకు మ్యూజిక్‌ అందించారు. స్వతహాగా ఆయన గాయకుడు కూడా. చాలా సినిమాల్లో పాటలను ఆయనే స్వయంగా పాడేవాడు. మూడు తమిళ సినిమాలకు, ఐదు కన్నడ సినిమాలకు కూడా సంగీతం అందించారు. డిస్కోడ్యాన్సర్‌లో ఐయామ్‌ ఎ డిస్కో డ్యాన్సర్‌ పాట, డ్యాన్స్‌డ్యాన్స్‌లో జిందగీ మేరే డ్యాన్స్‌ డ్యాన్స్‌ పాటతో అతను దుమ్ములేపాడు. జిందగీ మేరే డ్యాన్స్‌డ్యాన్స్‌ పాటను 2017లో విడుదలైన డాడీ సినిమాలో కూడా తిరిగి వాడుకొని, మరో పెద్ద విజయం సాధించారు. విదేశాల్లో కూడా బప్పీలహరి పాటలకు మంచి క్రేజ్‌ ఉండేది. 1985లో షరాబీ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును, 2018లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. ది డర్టీ పిక్చర్‌ సినిమాలో ‘ఊ లలాలా’ పాటకు బెస్ట్‌ ఐటెమ్‌సాంగ్‌ మిర్చీ మ్యూజిక్‌ అవార్డును గెల్చుకున్నారు. కింగ్స్‌మన్‌ : ది గోల్డెన్‌సర్కిల్‌ హాలీవుడ్‌ మూవీకి, మవోనా యానిమేటెడ్‌ సినిమాకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. (Story : మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!)

See Also : 25న వరుణ్ తేజ్ ‘గని’

25న వరుణ్ తేజ్ ‘గని’

0
Ghani
Ghani

ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ ‘గని’ సినిమా విడుదల..

25న వరుణ్ తేజ్ ‘గని’ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రోమియో జూలియట్ పాటకు సైతం మంచి స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సమర్పకుడు: అల్లు అరవింద్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్
పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను (Story : 25న వరుణ్ తేజ్ ‘గని’)

See Also : మంచి ఫీల్‌తో ఇంటికి వెళ్తారు

Photo Gallery

error: Content is protected !!